Cashback: క్యాష్‌బ్యాక్స్‌ పొందినా ట్యాక్స్ కట్టాలి

Tax for Cashback | ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పొందే క్యాష్‌బ్యాక్స్ మొత్తం రూ.50,000 లోపు ఉంటే పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: June 27, 2019, 3:45 PM IST
Cashback: క్యాష్‌బ్యాక్స్‌ పొందినా ట్యాక్స్ కట్టాలి
Cashback: క్యాష్‌బ్యాక్స్‌ పొందినా ట్యాక్స్ కట్టాలి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 27, 2019, 3:45 PM IST
ఆన్‌లైన్ షాపింగ్ చేసినప్పుడు క్యాష్‌బ్యాక్స్ పొందుతున్నారా? గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్‌లో లావాదేవీలు జరిపితే క్యాష్ బ్యాక్ వచ్చిందా? అయితే వాటికి మీరు పన్నులు చెల్లించాల్సిందే. యూపీఐ, ఇ-వ్యాలెట్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ లేదా ఇతర ఏ యాప్స్‌లో అయినా క్యాష్‌బ్యాక్స్ పొందితే వాటికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే చిక్కుల్లో పడిపోతారు జాగ్రత్త. ఉదాహరణకు మీరు రూ.499 షాపింగ్ చేస్తే రూ.49 క్యాష్ బ్యాక్ వచ్చిందనుకుందాం. ఆ క్యాష్‌బ్యాక్ మీ వ్యాలెట్ లేదా వ్యాలెట్‌కు లింక్ చేసి ఉన్న బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్తుంది. ఆ క్యాష్‌బ్యాక్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పొందే క్యాష్‌బ్యాక్స్ మొత్తం రూ.50,000 లోపు ఉంటే పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం క్యాష్‌బ్యాక్స్ రూ.50,000 మించితే గిఫ్ట్ ట్యాక్స్‌ కింద పన్ను చెల్లించాలి. క్యాష్‌బ్యాక్స్‌ని 'ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్' లేదా 'ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్' విభాగంలో చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాష్‌బ్యాక్స్‌కి బదులు సినిమా టికెట్స్, పెన్ డ్రైవ్స్, ఇయర్‌ఫోన్స్ లాంటివి ఉచితంగా పొందితే పన్ను వర్తించదు. వ్యాపారాలు, వృత్తి అవసరాల కోసం కొన్నవాటికి వచ్చే ఉచితాలపై సెక్షన్ 28(iv) కింద మార్కెట్ వ్యాల్యూ ప్రకారం పన్ను చెల్లించాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో క్యాష్‌బ్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని 147 ప్రకారం రీఅసెస్‌మెంట్ చేయాల్సి ఉంటుంది.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో




ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సప్‌లో స్టేటస్ నచ్చలేదా? ఈ ఫీచర్ వాడుకోవచ్చు

Google Maps: రాంగ్ రూట్‌లో వెళ్తే అలర్ట్ చేసే గూగుల్ మ్యాప్స్

Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా
First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...