ఇండియన్(Indian) ఆటో మేకర్స్ కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు వేర్వేరు ధరల్లో కార్లను తయారు చేస్తున్నాయి. హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి SUVల వరకు.. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన మోడల్‌ను(Model) ఎంచుకోవచ్చు. అయితే చాలామంది వ్యక్తులు తమ బడ్జెట్(Budget) ఆధారంగా, అందుబాటులో ఉన్న బెస్ట్ కార్ల(Best Cars)గురించి ఆరా తీస్తారు. ఒకవేళ మీ బడ్జెట్ రూ.6 లక్షలు అయితే.. ఈ ధరలో లభిస్తున్న బెస్ట్ కార్లు ఏవో చూద్దాం.
* రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)
ఫ్రాన్స్‌కు చెందిన వాహన తయారీ సంస్థ రెనాల్ట్ తయారు చేసిన క్విడ్ ఒక హ్యాచ్‌బ్యాక్. కానీ దీని డిజైన్ SUV మాదిరిగా ఉంటుంది. ఈ కారు రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో వస్తుంది. 799cc, 999cc - మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంటుంది. రెనాల్ట్ క్విడ్ కారు ధర రూ. 4.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
* మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)
మారుతి సుజుకి బ్రాండ్ నుంచి తక్కువ ధరకు కార్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అనేది కంపెనీ తయారు చేసిన బెస్ట్ సెల్లర్ కార్లలో ఒకటి. ఈ 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. 1-లీటర్, 1.2-లీటర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మీ బడ్జెట్ రూ. 6 లక్షల కంటే తక్కువగా ఉంటే.. ధర రూ. 5.47 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ కారును ఎంచుకోవచ్చు.
* టాటా టియాగో (Tata Tiago)
స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా నుంచి వచ్చిన టియాగో.. 3 ఇంజిన్-ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌తో వస్తుంది. టాటా టియాగో పెట్రోల్, CNG వేరియంట్లలో లభిస్తుంది. టాటా టియాగో బేస్, మిడ్ వేరియంట్ ధర రూ. 5.22 లక్షల నుంచి రూ. 5.79 లక్షల వరకు ఉంటుంది.
* టాటా పంచ్ (Tata Punch)
టాటా పంచ్ మోడల్ తక్కువ ధరకే ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. కాబట్టి రూ.6 లక్షల బడ్జెట్‌లో ఇది బెస్ట్ కారు. టాటా పంచ్ ఐదు సీట్ల సబ్ కాంపాక్ట్ SUV. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. టాటా పంచ్ ధర రూ. 5.67 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
* మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)
SUV ఇన్‌స్పైర్డ్ డిజైన్‌తో వచ్చిన మరో కారు మారుతి సుజుకి S-ప్రెస్సో. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు ఇంటీరియర్‌లు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. ఈ కారు 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ట్రిమ్‌ను బట్టి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ధర రూ. 4.17 లక్షల నుంచి రూ. 5.57 లక్షల మధ్య ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.