హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cars Under Rs.10 Lakhs: ఇండియాలో రూ.10 లక్షల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ కార్లు ఇవే..!అవేంటో తెలుసుకోండి..

Cars Under Rs.10 Lakhs: ఇండియాలో రూ.10 లక్షల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ కార్లు ఇవే..!అవేంటో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఆటో మొబైల్ బ్రాండ్స్‌లో రూ.10 లక్షలలోపు అందుబాటులో ఉన్న కార్ల గురించి తెలుసుకోండి.

భారతీయ ఆటో పరిశ్రమలో ఇయర్‌ ఆన్‌ ఇయర్‌(Year In Year) రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల శ్రేణిలోని కార్ల విక్రయాల సంఖ్య పడిపోయింది. భారతదేశంలోని కార్ల తయారీదారులు ఆ శ్రేణిలోని కార్ల విక్రయాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అదే సమయంలో కార్ల వినియోగదారులకు ప్రీమియం(Premium) అనుభవాన్ని అందించాలని భావిస్తున్నారు. బ్రాండ్‌లను (Brand) ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు మారుతీ సుజుకి(Suzuki), హ్యుందాయ్, టాటా(Tata), మహీంద్రా(Mahindra) వంటి వాటిపై ఎక్కువ మంది శ్రద్ధ చూపుతున్నారు. ఇండియన్ ఆటో మొబైల్ బ్రాండ్స్‌లో(Auto Mobile Brands) రూ.10 లక్షలలోపు అందుబాటులో ఉన్న కార్ల గురించి తెలుసుకోండి.

* మారుతీ సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)

మారుతి సుజుకి బాలెనో ఇటీవల మేకోవర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. నెల క్రితం కొత్త ఫేస్‌లిఫ్ట్ మారుతి సుజుకి బాలెనోను లాంచ్ చేసినప్పటి నుంచి దాదాపు 50,000 బుకింగ్‌లను సంస్థ సేకరించింది. 1.2 లీటర్ డ్యుయల్‌జెట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో ఆధారితమైన ఈ కారు 88 bhp శక్తిని, 113 Nm గరిష్ట టార్క్‌ను అందజేస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ.6.35 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.9.49 లక్షలుగా ఉంది.

Best Cars Under Rs.5 Lakhs: ఇండియాలో రూ.5 లక్షల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు ఇవే..! వాటిపై ఓ లుక్కేయండి..


* టాటా పంచ్ (Tata Punch)

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా.. కొన్ని సురక్షితమైన, అధిక పనితీరు గల కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా భారతీయ ఆటో పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. టాటా పంచ్ ధర రూ.5.67 లక్షలతో మొదలై రూ.9.18 లక్షల వరకు ఉంది. 84.48 bhp గరిష్ట శక్తిని, 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన 1199 cc ఇంజిన్‌తో కారు వస్తోంది.

* హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

అద్భుతమైన ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో హ్యుందాయ్ కంపెనీ వెన్యూను లాంచ్ చేసింది. భారతీయ కార్ మార్కెట్‌లో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. టాప్ ఎండ్ వేరియంట్ మినహా, రూ.10 లక్షలలోపు మొత్తాన్ని చెల్లించి హ్యుందాయ్ వెన్యూను సొంతం చేసుకోవచ్చు. కారు పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 118.35 bhp శక్తిని, 171.7 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

* టాటా నెక్సాన్ (Tata Nexon)

1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికల్లో టాటా నెక్సాన్‌ అందుబాటులో ఉంది. మీరు బడ్జెట్ మార్కును దాటకుండా కొనుగోలు చేయాలంటే టాటా నెక్సాన్ మంచి ఎంపిక. టాటా నెక్సాన్‌ను రూ.10 లక్షలలోపు సొంతం చేసుకోవచ్చు. కారు డిజైన్, ఫీచర్ల పరంగా అద్భుతంగా ఉంటుంది. కొన్ని ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, I-RA వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

TS TET 2022: టెట్ అభ్యర్థులకు షాకిస్తున్న వెబ్ సైట్.. ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో ట్విస్టులు.. వివరాలివే

* మహీంద్రా KUV100 NXT (Mahindra KUV100 NXT)

ఈ కారు సాంప్రదాయిక ఐదు-సీట్ల కాన్ఫిగరేషన్‌ను అందిస్తుంది. కస్టమర్‌లు పెట్రోల్, డీజిల్ రెండు ఇంధన ఎంపికలలో ప్రత్యేకమైన ఆరు-సీట్ల కాన్ఫిగరేషన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ మహీంద్రా క్రియేషన్ ఆటో స్టార్ట్/స్టాప్, వివిధ డ్రైవ్ మోడ్‌లు, 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో సహా సెగ్మెంట్‌లోని స్టాండ్‌అవుట్ ఫీచర్లతో వస్తుంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.7.91 లక్షలు.

Published by:Veera Babu
First published:

Tags: Budget, Cars, MARUTI SUZUKI, New cars

ఉత్తమ కథలు