Home /News /business /

Cars Under 10 Lakhs: కారు కొంటున్నారా...మీ బడ్జెట్ 10 లక్షల లోపే ఉందా...అయితే బెస్ట్ చాయిస్ ఇవే...

Cars Under 10 Lakhs: కారు కొంటున్నారా...మీ బడ్జెట్ 10 లక్షల లోపే ఉందా...అయితే బెస్ట్ చాయిస్ ఇవే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హ్యాచ్‌బ్యాక్ మోడ‌ళ్ల‌లో 10 ల‌క్ష‌ల లోపు బ‌డ్జెట్‌లో ఉన్న‌ కార్ల‌ను ప‌రిశీలిస్తే బ‌‌లెనో, గ్లాంజా, ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్‌, పోలో, స్విఫ్ట్ కార్లు ముందు వ‌రుస‌లో ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతుంది.ఇటీవ‌ల కాలంలో కార్ల కొనుగోలు చాలానే పెరిగింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కు దూరంగా సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణం చేయ‌డానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. నానాటికీ పెరిగిపోతున్న ర‌క‌ర‌కాల కార్ల మోడ‌ల్స్ లో ఏది కొనాలోన‌ని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అందుకే చాలామంది ఇష్టపడే హ్యాచ్‌బ్యాక్ కార్ల‌లో ఏది బెస్ట్ అనేది చెబుతున్నాం. హ్యాచ్‌బ్యాక్ మోడ‌ళ్ల‌లో 10 ల‌క్ష‌ల లోపు బ‌డ్జెట్‌లో ఉన్న‌ కార్ల‌ను ప‌రిశీలిస్తే బ‌‌లెనో, గ్లాంజా, ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్‌, పోలో, స్విఫ్ట్ కార్లు ముందు వ‌రుస‌లో ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతుంది. ఇవే ఎందుకు టాప్‌లో ఉన్నాయంటే అందుకు కార‌ణ‌మూ లేక‌పోలేదు. సాధార‌ణంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడ‌ల్‌లో ఆటోమాటిక్ గేర్ బాక్స్ (Automatic Gearbox)తో పాటు అంద‌రూ ఎక్కువ విశాలంగా ఉండాల‌ని అనుకుంటారు. భార‌త‌దేశంలోని రోడ్ల‌కు, న‌గ‌రాల్లో నివ‌శించే ప్ర‌జ‌ల‌కు ఈ మోడ‌ళ్లే అనువుగా ఉంటాయి. మార్కెట్లో ఉన్న మోడ‌ళ్లలో మీరు ఇక్క‌డ చెప్ప‌బోయే ఆప్ష‌న్ల నుంచి ఏ కారునైనా సెలెక్ట్ చేసుకోవ‌చ్చు. ఇండియాలో ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న 10 ల‌క్ష‌ల లోపు టాప్ బెస్ట్ ఆటోమాటిక్ హ్యాచ్‌‌బ్యాక్ కార్ల‌ మోడ‌ళ్ల‌ను చూద్దాం.

మారుతి బాలెనో,  ట‌యోటా గ్లాంజా
ఆటోమాటిక్ వ‌ర్ష‌న్ అయిన మారుతి బ‌లెనో, దాదాపుగా ఇలాంటి ఇంజినీరింగ్‌తోనే త‌యారుచేసిన ట‌యోటా గ్లాంజా, రెండూ కూడా కె12ఎమ్ ఇంజిన్ ప‌వ‌ర్‌తో న‌డిచేవే. ఈ రెండు మోడ‌ళ్లు చాలా స్మూత్‌గా ఉంటాయి. డ్రైవ్ చేయ‌డానికి బాగుంటాయి. ఇక సివిటి గేర్ బాక్స్ వీటిని ప్ర‌త్యేకంగా నిలుపుతాయి. ఇదే కాకుండా ఈ రెండు ప్రిమియం హ్యాచ్‌బ్యాక్‌ మోడ‌ళ్లు లోప‌ల విశాలంగా ఉంటాయి. అలాగే ప్రాక్టిక‌ల్‌గా త‌యారుచేయ‌బ‌డిన ఇంటీరియ‌ర్లు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌. మీరు ఆశించే విధంగా ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ట్లు ఉంటాయ‌.

బ‌లెనో (Baleno) ధ‌ర రేంజ్ త‌క్కువ నుంచే మొద‌ల‌వుతుంది. అయితే గ్లాంజా మాత్రం ఎక్కువ కాలం స్టాండ‌ర్డ్ వారెంటీతో వ‌స్తుంది. ఇవి కాకుండా ఈ రెండింటికీ తేడాలు పెద్ద‌గా క‌నిపించ‌వు.

మారుతి బ‌లెనో ఆటోమాటిక్ ఫ్యాక్ట్ ఫైల్ః
ఇంజిన్ -- 1197సిసి -- 4 సిలిండ‌ర్ -- పెట్రోల్
ప‌వ‌ర్ -- 83 హార్స్‌ ప‌వ‌ర్‌
టార్క్ -- 113 ఎన్ ఎమ్
గేర్ బాక్స్ -- సివిటి
ఎఆర్ ఏఐ మైలేజ్ -- 19.56 కెపిఎల్‌

మారుతి బ‌లెనో ఆటోమాటిక్ ధ‌ర‌లు (ఎక్స్‌-షోరూమ్, ఢిల్లీ)
వేరియంట్ ధ‌ర‌
డెల్టా రూ. 7.77 ల‌క్ష‌లు
జెటా రూ. 8.38 ల‌క్ష‌లు
ఆల్ఫా రూ. 9.10 ల‌క్ష‌లు

ట‌యోటా గ్లాంజా ఆటోమాటిక్ ఫ్యాక్ట్ ఫైల్ః
ఇంజిన్ -- 1197సిసి -- 4 సిలిండ‌ర్ -- పెట్రోల్
ప‌వ‌ర్ -- 83 హార్స్‌ ప‌వ‌ర్‌
టార్క్ -- 113 ఎన్ ఎమ్
గేర్ బాక్స్ -- సివిటి
ఎఆర్ ఏఐ మైలేజ్ -- 19.56 కెపిఎల్

ట‌యోటా గ్లాంజా ఆటోమాటిక్ ధ‌ర‌లు (ఎక్స్‌-షోరూమ్, ఢిల్లీ)
వేరియంట్ ధ‌ర (Price)
జి సివిటి రూ. 8.39 ల‌క్ష‌లు
వి సివిటి రూ. 9.10 ల‌క్ష‌లు

హుండాయ్ ఐ20
మార్కెట్లో కొత్త‌గా వ‌చ్చిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హుండాయ్ ఐ20 స్టైల్ ప‌రంగానే కాకుండా కొత్త‌గా అమ‌ర్చిన మ‌రికొన్న ఫీచ‌ర్లు ఇందులో చేరాయి. ఐ20 రైడింగ్ బాగుంటుంద‌ని మంచి పేరుంది. దీనికి ప‌వ‌ర్‌ట్రైన్స్‌, ఆటో గేర్‌బాక్స్ ఇష్టాన్ని బ‌ట్టి ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఇందులో సివిటి, డ్యూయ‌ల్ క్ల‌చ్ ఆటో కూడా ఉంది. అలాగే ఆటోమేటెడ్ మాన్యువ‌ల్ ఉంటుంది. మీ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు చాలా ఎంచుకునే అవ‌కాశం ఉంది. అయితే డ్యూయ‌ల్ క్ల‌చ్ గేర్‌బాక్స్ ఉన్న ఐ20 కాస్త ఎక్కువ ధ‌ర‌లో ఉంది. ఇది రూ. 10 ల‌క్ష‌లు దాటేస్తుంది.

హుండాయ్ ఐ20 ఆటోమాటిక్ ఫ్యాక్ట్ ఫైల్
1.2 సివిటి 1.0 ఐఎమ్‌టి 1.0 డిసిటి
ఇంజిన్ --- 197 సిసి, 4 సిలిండ‌ర్, పెట్రోల్ 998సిసి, 3 సిలిండ‌ర్‌, ట‌ర్బో పెట్రోల్ 998సిసి,3 సిలిండ‌ర్‌\ట‌ర్బో పెట్రోల్
ప‌వ‌ర్ --- 88 హార్స్ ప‌వ‌ర్ 120 హార్స్ ప‌వ‌ర్ 120 హార్స్ ప‌వ‌ర్
టార్క్ --- 115 ఎన్ ఎమ్ 172 ఎన్ ఎమ్ 172 ఎన్ ఎమ్‌
గేర్ బాక్స్ --- సివిటి 6-స్పీడ్ ఐఎమ్‌టి 7-స్పీడ్ డ్యూయ‌ల్‌-క్ల‌‌చ్ ‌
ఎఆర్ ఏఐ మైలేజ్-- 19.65 కెపిఎల్ 20.25 కెపిఎల్ 20.25 కెపిఎల్‌

హుండాయ్ ఐ20 ఆటోమాటిక్ ధ‌ర‌లు (ఎక్స్ -షోరూమ్ ఢిల్లీ)
వేరియంట్ -- 1.2 సివిటి ధ‌ర 1.0 ఐఎమ్‌టి ధ‌ర 1.0 డిసిటి ధ‌ర‌
స్పోర్ట్జ్ రూ. 8.60 ల‌క్ష‌లు రూ.8.80 ల‌క్ష‌లు --
స్పోర్ట్జ్ డ్యూయ‌ల్-టోన్ రూ. 8.75 ల‌క్ష‌లు రూ. 8.95 ల‌క్ష‌లు --
అస్టా రూ. 9.70 ల‌క్ష‌లు రూ. 9.90 ల‌క్ష‌లు రూ. 10.67 ల‌క్ష‌లు
అస్టా డ్యూయ‌ల్-టోన్ రూ. 9.85 ల‌క్ష‌లు రూ. 10.05 ల‌క్ష‌లు రూ. 10. 82 ల‌క్ష‌లు
అస్టా (ఓ) -- -- రూ. 11.18 ల‌క్ష‌లు
అస్టా (ఓ) డ్యూయ‌ల్‌-టోన్ -- -- రూ. 11.33 ల‌క్ష‌లు

హుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ :
హుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడ‌ల్‌కు వెల్‌-ఫినీషింగ్‌తో పాటు అప్‌మార్కెట్ క్యాబిన్ కూడా ఉంది. అలాగే హుండాయ్‌లో ఉండే ఫ్యాష‌న్ ఏమాత్రం త‌గ్గ‌కుండా స‌రంజామా అంతా ఇందులో ఉంది. ఆఫ‌ర్ చేస్తున్న ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌కు ఏఎమ్‌టి యూనిట్ ఉంది. అయితే సివిటితో, టార్క్ క‌న్వ‌ర్ట‌ర్ ఆటోతో పోల్చుకుంటే అంత స్మూత్‌గా ఉండ‌దు. కానీ ఇదీ బాగా ప‌నిచేస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్‌ లేదంటే డీజిల్ ఇంజిన్ కావ‌చ్చు ఇంధ‌నం సామ‌ర్థ్యంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. ప్ర‌స్తుతం ఇండియాలో ప‌ది లక్ష‌ల లోపు ఉన్న కారుల్లో డీజిల్‌-ఆటోమాటిక్ ఆప్ష‌న్ ఉన్న ఒకేఒక్క హ్యాచ్‌బ్యాక్ మోడ‌ల్ కారు నియోస్ ఒక్క‌టి మాత్ర‌మే.

హుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ ఆటోమాటిక్ ఫ్యాక్ట్ ఫైల్

ఇంజిన్ 1197సిసి, 4 సిలిండ‌ర్‌, పెట్రోల్ 1186సిసి, 3 సిలిండ‌ర్‌, ట‌ర్బో-డీజిల్‌
ప‌వ‌ర్ 83 హార్స్ ప‌వ‌ర్‌ 75 హార్స్ ప‌వ‌ర్‌‌
టార్క్ 114 ఎన్ ఎమ్ 190 ఎన్ ఎమ్‌
గేర్ బాక్స్ 5 స్పీడ్ ఏ ఎమ్ టి 5 స్పీడ్ ఏ ఎమ్ టి
ఏఆర్ ఏఐ మైలేజ్ 20.5 కెపిఎల్ 25 కెపిఎల్‌

హుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆటోమాటిక్ ధ‌ర‌లు (ఎక్స్‌-షోరూమ్ ఢిల్లీ)
వేరియంట్ 1.2 పెట్రోల్ ధ‌ర 1.2 డీజిల్ ధ‌ర
‌మాగ్నా ఎ ఎమ్ టి రూ. 6.57 ల‌క్ష‌లు --
స్పోర్ట్జ్ ఎ ఎమ్ టి రూ. 7.18 ల‌క్ష‌లు 8.27 ల‌క్ష‌లు
అస్టా ఎ ఎమ్ టి 7.81 ల‌క్ష‌లు --

మారుతి స్విఫ్ట్ (Swift):
ఇటీవ‌ల ఈ మోడ‌ల్లో చేసిన మార్పుతో మారుతీ స్విఫ్ట్‌లో అంత‌కుముందు ఉన్న 83 హార్స్‌ప‌వ‌ర్‌ తొల‌గించారు. ఎక్కువ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌టానికి 1.2 లీట‌ర్‌ కె సిరీస్ ఇంజిన్, సామ‌ర్థ్యం కోసం 1.2 లీట‌ర్ డ్యూయ‌ల్ జెట్ మోట‌ర్ ఉంది. ఆఫ‌ర్ చేస్తున్న ఆటో గేర్ బాక్స్ ఏఎమ్‌టి, ఇది మంచి సామ‌ర్థ్యంతో ప‌నిచేస్తుంది. నిజానికి ఇండియాలో అమ్ముడ‌వుతున్న కార్ల‌లో పెట్రోల్‌ను పొదుపు చేయ‌డంలో ఏఆర్ ఏఐ ర్యాంకుల‌ను బ‌ట్టి స్విఫ్ట్ ఏఎమ్‌టి 3వ స్థానంలో ఉంది. దీనికి ముందు డిజైర్ ఏ ఎమ్ టి, బ‌లెనో మైల్డ్‌-హైబ్రీడ్‌లు ఉన్న‌ాయి. కొన్ని కాస్మ‌టిక్ అప్‌డేట్‌లు, అధికంగా మ‌రికొన్ని ఫీచ‌ర్లు వ‌చ్చాయి. అయితే అవేమీ క్లాస్ లీడింగ్‌కి ప‌నిచేయ‌వు.

మారుతి స్విఫ్ట్ ఆటోమాటిక్ ఫ్యాక్ట్ ఫైల్ః
ఇంజిన్ -- 1197సిసి, 4 సిలిండ‌ర్‌, పెట్రోల్‌
ప‌వ‌ర్ -- 90 హార్స్‌ప‌వ‌ర్‌
టార్క్ -- 113 ఎన్ ఎమ్‌
గేర్‌బాక్స్ -- 5-స్పీడ్ ఎఎమ్‌టి
ఏఆర్ ఏఐ మైలేజ్ -- 23.76 కెపిఎల్‌

మారుతి స్విఫ్ట్ ఆటోమాటిక్ ధ‌ర‌లు (ఎక్స్‌-షోరూమ్ ఢిల్లీ)
వేరియంట్ ధ‌ర‌‌
వి ఎక్స్ ఐ ఏఎమ్‌టి రూ. 6.86 ల‌క్ష‌లు
జెడ్ ఎక్స్ ఐ ఏఎమ్‌టి రూ. 7.49 ల‌క్ష‌లు
జెడ్ ఎక్స్ ఐ ప్ల‌స్‌ ఏఎమ్‌టి రూ. 8.27 ల‌క్ష‌లు
జెడ్ ఎక్స్ ఐ ప్ల‌స్ ఎమ్‌టి డ్యూయ‌ల్ టోన్‌ రూ. 7.49 ల‌క్ష‌లు

వొక్స్ వాగ‌‌న్ పోలో
నిజానికి వోక్స్ వాగ‌‌న్ పాత కారే. కానీ దీని క్యాబిన్ క్వాలిటీ మాత్రం ఎక్స్‌లెంట్‌గా ఉంటుంది. ఇందులో కొత్త‌గా చేర్చిన ఫీచ‌ర్లు హ్యాచ్‌బ్యాక్ మోడ‌ళ్ల‌లో బెస్ట్‌గా నిలిపాయి. కొత్త టార్క్ క‌న్వ‌ర్ట‌ర్ గేర్ బాక్స్‌తో స‌హా 1.0-లీట‌ర్ టిఎస్ ఐ ఇంజిన్ కొత్త‌గా వ‌చ్చింది. ఇది ప‌వ‌ర్‌ఫుల్‌గానే కాకుండా స్మూత్‌గా డ్రైవింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది. ఇది షార్ప్ - హ్యాండిలింగ్ ఛేసిస్‌కి బాగా స‌రిపోతుంది.

వోక్స్ వాగ‌న్ పోలో ఆటోమాటిక్ ఫ్యాక్ట్ ఫైల్‌
ఇంజిన్ 999సిసి, 3 సిలిండ‌ర్‌, పెట్రోల్‌
ప‌వ‌ర్ 110 హ్యార్స్ ప‌వ‌ర్‌
టార్క్ 175 ఎన్ ఎమ్
గేర్ బాక్స్ 6-స్పీడ్ టార్క్ క‌న్వ‌ర్ట‌ర్
ఏఆర్ ఏఐ మైలేజ్ 18.24 కెపిఎల్‌‌

వోక్స్ వాగ‌న్ పోలో ఆటోమాటిక్ ధ‌ర‌లు (ఎక్స్‌-షోరూమ్, ఢిల్లీ (Delhi)
వేరియంట్ ధ‌ర‌
హైలైన్ ప్ల‌స్ ఎటి రూ. 9.60 ల‌క్ష‌లు
జిటి రూ. 9.99 ల‌క్ష‌లు

Published by:Krishna Adithya
First published:

Tags: Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు