Home /News /business /

Car, Bike Prices Hike: కార్, బైక్ కొనాలనుకుంటున్న వారికి షాక్.. ఈ రోజు నుంచి పెరిగిన ధరలు.. ఏ కంపెనీ ఎంత పెంచిందంటే..

Car, Bike Prices Hike: కార్, బైక్ కొనాలనుకుంటున్న వారికి షాక్.. ఈ రోజు నుంచి పెరిగిన ధరలు.. ఏ కంపెనీ ఎంత పెంచిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏడాది ప్రారంభం నుంచే ఆటోమోటివ్ రంగంలో ధరల పెరుగుదల కనిపించింది. తాజాగా మరికొన్ని ప్రముఖ వాహన తయారీ సంస్థలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఒకటి.  గత ఏడాది ప్రారంభంలో కరోనా వెలుగుచూడక ముందు నుంచే పరిశ్రమ నష్టాల్లో ఉంది. అనంతరం కోవిడ్ మొదటి దశ ఉద్ధృతిలో విధించిన లాక్‌డౌన్ వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆ తరువాత గత ఏడాది దసరా, దీపావళి సీజన్ నాటికి అమ్మకాలు కాస్త పుంజుకున్నాయి. అయితే 2021 సంక్రాంతి అనంతరం పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. వాహనాల తయారీకి అవసరమయ్యే ముడి సరకు ఉత్పత్తి తగ్గిపోవడం, ఇన్‌పుట్ కాస్ట్ పెరుగుదల, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సంస్థలు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆటోమోటివ్ రంగంలో ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలను పెంచగా, తాజాగా మరికొన్ని ప్రముఖ సంస్థలు వాహనాల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో జులై 2021 నుంచి ధరలు పెంచనున్న కంపెనీల గురించి తెలుసుకుందాం.
LPG Price Today: సామాన్యులకు మరో షాక్... భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు... ఇవాళ్టి రేట్స్ ఇవే

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp)
భారత్‌లో ప్రధాన మోటార్ బైక్స్ తయారీ సంస్థగా ఉన్న హీరో మోటోకార్ప్.. టూ వీలర్ల ధరలు పెంచుతున్నట్లు గత నెలలో ప్రకటించింది. సంస్థకు చెందిన అన్ని రకాల స్కూటర్లు, బైక్‌ల ధరలను 2021 జులై నుంచి పెంచుతున్నట్లు పేర్కొంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో మొత్తానికి ధరల పెరుగుదల వర్తిస్తుందని వెల్లడించింది. జులై 1 నుంచి సంస్థకు చెందిన ప్రతి మోడల్‌పై అత్యధికంగా రూ.3,000 వరకు ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో సైతం సంస్థ ద్విచక్ర వాహనాల ధరలను రూ.2,500 వరకు పెంచింది.

మారుతి సుజుకి (Maruti Suzuki)
2021-22 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది మారుతి సుజుకి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన ఈ సంస్థ.. ఈ నిర్ణయాన్ని గత నెలలోనే ప్రకటించింది. ఇన్‌పుట్ కాస్ట్ పెరుగుదలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలోనే మారుతి సుజుకి.. కార్లపై రూ.34,000 వరకు ధరలు పెంచింది. ఆ తరువాత 2021 ఏప్రిల్‌లో మరోసారి 1.6 శాతం వరకు ధరలు పెరిగాయి. తాజాగా మూడోసారి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈసారి ఎంత మేరకు ధరల పెరుగుదల ఉంటుందనే వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India)
ప్రీమియం మోటార్ బైక్స్ విభాగంలో దూసుకుపోతున్న యమహా సంస్థ సైతం జులై 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సంస్థకు చెందిన డీలర్‌షిప్ షోరూంలకు మాత్రం అధికారిక సమాచారం అందలేదని తెలుస్తోంది. ధరల పెరుగుదలపై ఇప్పటి వరకు యమహా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే మరికొన్ని రోజుల్లో ఈ విషయాన్ని సంస్థ ధ్రువీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Bike, CAR, Honda, MARUTI SUZUKI, Yamaha

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు