ద్రవ్యోల్బణం ప్రభావం ఆటో రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో న్యూ ఇయర్‌లో (New Year) కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారు.. ధరలు చూసి షాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ద్రవ్యోల్బణం, ముడి సరుకుల ధరలు పెరగడం వంటి కారణాలతో ఇన్‌ఫుట్ ఖర్చులు పెరిగాయని, కార్ల ధరలను (Car Prices) జనవరి నుంచి పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఆడి, మెర్సిడెస్-బెంజ్, హోండా, మహీంద్రా వంటి కంపెనీలు ఉన్నాయి.
కరోనా సమయంలో సెమీకండక్టర్లతో సహా విడిభాగాల కొరత తీవ్రంగా వేధించింది. దీంతో కార్ల మార్కెట్ కళ తప్పింది. ఈ అంతరాయాల నుంచి కార్ల పరిశ్రమ కోలుకుంది. ఇటీవల భారత్‌లో కార్ల విక్రయాలు పుంజుకున్నాయి. అయితే ద్రవ్యోల్బణం కారణంగా ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో కార్ల ధరలు పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
OTP Scam: ఓటీపీ చెప్తే ఉన్నదంతా ఊడ్చేస్తారు... ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే?
కార్ల పరిశ్రమలో మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకీ.. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి కార్ల ధరలను పెంచనుంది. అయితే మోడల్ ఆధారంగా ధరల పెరుగుదల భిన్నంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ నుంచి i10 నియోస్, క్రెటా, వెన్యూ, వెర్నా, టక్సన్ వంటి మోడల్స్ ధరలు పెరగనున్నాయి. టాటా మోటార్స్ నుంచి నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్ కార్ల ధరలు జనవరి నుంచి పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కమర్షియల్ వాహనాల ధరలను సైతం టాటా మోటార్స్ పెంచనున్నట్లు సమాచారం. లగ్జరీ కార్ల తయారీదారు మెర్సిడెస్-బెంజ్ కూడా ఇన్ పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి కొంత మొత్తాన్ని కస్టమర్లకు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంది.
కియా కార్లు మరింత ఖరీదు కానున్నాయి. ప్రధానంగా సెల్టోస్, సోనెట్, కేరెన్స్, కార్నివాల్ వంటి మోడల్స్ ధరలు ఏకంగా రూ.50,000 పెరిగే అవకాశం ఉంది. హోండా కంపెనీ సిటీ, అమేజ్, సిటీ హైబ్రిడ్ మోడల్స్ ధరలను రూ.30,000 వరకు పెంచనుంది. కంపాస్, గ్రాండ్ చెరోకీతో సహా జీప్ లైనప్ 2-4 శాతం పెరిగే అవకాశం ఉంది. బైక్ తయారీ కంపెనీలు సైతం ధరలను పెంచే అవకాశం ఉంది. దిగ్గజ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇప్పటికే తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను రూ.1,500 వరకు పెంచింది.
IRCTC Tamil Nadu Tour: వారం రోజుల్లో తమిళనాడు ఆలయాలన్నీ చూసెయ్యండి... ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
వాయు కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి వచ్చే ఏడాది 2023 ఏప్రిల్ నుంచి రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్(RDE) నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. దీంతో వాహన తయారీ సంస్థలు ఈ నిబంధనలు అనుగుణంగా వాహనాల ఉత్పత్తి చేపట్టాల్సి ఉంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. దీంతో ఏప్రిల్ నాటికి మరోసారి వాహనాల ధరలను తయారీ సంస్థలు పెంచే అవకాశం ఉంది.
RDE నిబంధనల ప్రకారం.. రియల్-టైమ్ డ్రైవింగ్ ఉద్గార లెవల్స్‌ను స్కాన్ చేయడానికి వాహనాల్లో తప్పనిసరిగా ఆన్-బోర్డ్ సెల్ఫ్-డయాగ్నోస్టిక్ డివైజ్ ఉండాలి. క్రాంక్‌షాఫ్ట్ పొజిషన్స్, థొరెటల్, ఇంజన్ ఉష్ణోగ్రత వంటి వాటిని స్కాన్ చేయడానికి తయారీ సంస్థలు వాహనాల సెమీకండక్టర్‌లను కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు కంపెనీలు అదనంగా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో పెట్రోలు మోడల్స్1.5 శాతం, డీజిల్ మోడల్స్ 3.5 శాతం వరకు ఏప్రిల్‌లో మరోసారి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Missed Call Fraud: కలకలం రేపుతున్న మిస్డ్ కాల్ ఫ్రాడ్... నిర్లక్ష్యంగా ఉంటే నిలువునా దోచేస్తారు
ఈ ప్రభావం ముఖ్యంగా డీజిల్ మోడల్స్‌పై తీవ్రంగా పడనుంది. దీంతో తయారీ సంస్థలు కొన్ని రకాల మోడల్స్ ఉత్పత్తికి గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. ఈ జాబితాలో హోండా నుంచి సిటీ 4th జెన్, సిటీ 5th జెన్ (డీజిల్), అమేజ్ (డీజిల్), జాజ్, WR-V వంటివి ఉన్నాయి. మహీంద్రా కంపెనీ Marrazzo, Alturas G4, KUV100 వంటి మోడల్స్‌ను నిలిపివేయనుంది. i20, వెర్నా డీజిల్ మోడళ్లను హ్యుందాయ్... ఆక్టావియా, సూపర్బ్ మోడల్స్‌కు స్కోడా గుడ్‌బై చెప్పనుంది. టాటా ఆల్ట్రోజ్ (డీజిల్), రెనాల్ట్ క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, మారుతి సుజుకి ఆల్టో 800 మోడల్స్ కూడా ఇకపై రోడ్లపై కనిపించవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Car prices, Cars