Pharmacy: ఫార్మసీ విభాగంలో పెరుగుతున్న అవకాశాలు.. కరోనా తరువాత.. ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ను అర్థం చేసుకుని సరైన మెడిసిన్ అందించి ఎందరో రోగుల ప్రాణాలను కాపాడుతుంటారు. కరోనా కాలంలో ఫార్మాసిస్టులకు మరింత డిమాండ్ ఏర్పడింది.

  • Share this:
కరోనా కారణంగా కోట్లాది మంది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ ఫార్మాసిస్టులు ప్రత్యక్ష దైవంగా మారారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫార్మాసిస్టులు ఔషధ పరిశోధనలలో, డ్రగ్స్ తయారీలో కీలక భూమిక వహిస్తుంటారు. అలాగే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ను అర్థం చేసుకుని సరైన మెడిసిన్ అందించి ఎందరో రోగుల ప్రాణాలను కాపాడుతుంటారు. కరోనా కాలంలో ఫార్మాసిస్టులకు మరింత డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫార్మసీ రంగంలోని కెరీర్ ఆప్షన్స్ ఏవో తెలుసుకుందాం.

ఫార్మాసిస్టుల కోసం కెరీర్ ఆప్షన్స్
ఫార్మాసిస్టులు డ్రగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్.. ఫార్మకోవిజిలెన్స్ (Pharmacovigilance).. క్లినికల్ ట్రయల్స్.. రిటైల్ సెటప్.. ఆసుపత్రులు.. క్లినిక్‌లు.. కమ్యూనిటీ ఫార్మసీ.. ఫార్మాసిటికల్/ఫార్మాస్యూటిక్స్‌ సేల్స్ & మార్కెటింగ్.. ఇండస్ట్రియల్ ఫార్మసీ & ప్రొడక్షన్, నియంత్రణ వ్యవహారాలు (Regulatory affairs).. హెల్త్ డేటా అనాలిసిస్.. మెడికల్ రైటింగ్ తదితర కెరీర్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

ఫార్మసీ కెరీర్ స్కోప్
ఫార్మసీ గ్రాడ్యుయేట్లు అనేక కెరీర్ అవకాశాలను అంది పుచ్చుకోవచ్చు. అయితే కింద పేర్కొన్న ఆప్షన్‌లలో కెరీర్ స్కోప్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కెరీర్ ఆప్షన్స్ కోవిడ్ 19 కాలంలో మంచి బెనిఫిట్స్ అందిస్తాయి. ఆ కెరీర్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకుంటే..

1. మెడిసిన్ ప్రొడక్షన్ (ఆపరేటెడ్ బై NMIMS )

2. మెడిసిన్ క్వాలిటీ కంట్రోల్ (ఆపరేటెడ్ బై NMIMS)

3. ఇండస్ట్రియల్ ఫార్మసీ
కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు సరిపోవడం లేదు. చవకైన వైద్య పరికరాల కోసం సామాన్యులు మెడికల్ షాపులు, ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో డయాగ్నొస్టిక్ కిట్లు, శానిటైజర్లు, టీకాలు, మందులు, థర్మామీటర్లు, ఆక్సీమీటర్లు వంటి వైద్య పరికరాలు సామాన్యులకు అందించగల ఇండస్ట్రియల్ ఫార్మాసిస్టుల అవసరం చాలా ఉంటుంది.

4. టెస్టింగ్ ల్యాబ్‌లు
కొత్తగా ప్రతిపాదించిన టీకాలు, చికిత్సల పరీక్షను నిర్వహించే ప్రభుత్వ పరీక్షా ప్రయోగశాలల్లో ఫార్మాసిస్టులు పని చేయవచ్చు.

5. ఫార్మాసిటికల్ మార్కెటింగ్
ఫార్మాసిటికల్ మార్కెటింగ్ లో ఫార్మాసిస్ట్‌లు వెన్నుముకగా నిలుస్తారు. మందులు, వ్యాక్సిన్‌ల పంపిణీతో సహా వాటి విక్రయాలలో ఫార్మసిస్టులు ముఖ్య బాధ్యత వహిస్తారు.

6. మెడిసిన్/వ్యాక్సిన్ డెవలప్‌మెంట్
ఫార్మసీలో కెరీర్ ఎంచుకుంటే ఔత్సాహికులకు వైద్య పరికరాల రూపకల్పన, అభివృద్ధి, మార్కెటింగ్ చేసే అవకాశాన్ని కూడా పొందొచ్చు.

7. రెగ్యులేటరీ డిపార్ట్‌మెంట్
ఔషధ తయారీ సౌకర్యాల నియంత్రణ విభాగానికి ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఎంతో అవసరం. ఇక్కడ డేటా, విశ్లేషణల మద్దతుతో కొత్త చికిత్సలకు ఆమోదం తెలపడం అవసరం. ఫార్మాసిస్టులు ఈ పని చేస్తారు.

8. హాస్పిటల్ ఫార్మసీ
హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో మరో ముఖ్యమైన భాగం హాస్పిటల్ ఫార్మసీ. ఫార్మసీ గ్రాడ్యుయేట్లు ఈ కెరీర్ ను కూడా ఎంచుకోవచ్చు.

9. ఫార్మకోవిజిలెన్స్
ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫార్మకోవిజిలెన్స్ రంగంలో పనిచేయొచ్చు. ఇందులో ఔషధ పరస్పర పర్యవేక్షణ, డాక్యుమెంటేషన్, ప్రతికూల దుష్ప్రభావాల గురించి వైద్యులు, అభ్యాసకులకు నివేదించడం. ప్రత్యేకించి కోవిడ్ 19 రోగులకు చికిత్స అందించే వైద్యులకు తెలియజేసే రంగంలో ఫార్మసిస్టులు పని చేయొచ్చు.

10. కమ్యూనిటీ ఫార్మసీ ప్రాముఖ్యత
రోగులకు వైద్య చికిత్స అందించే అన్ని స్థాయిలలోనూ కమ్యూనిటీ ఫార్మాసిస్ట్‌లు సహాయపడటంతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వడంలో కూడా కీలకపాత్ర పోషిస్తారు. రికవరీ తరువాత కాలంలో కోవిడ్ 19 ఇతర సంబంధిత వ్యాధులను నివారించే చర్యల గురించి కమ్యూనిటీ ఫార్మాసిస్ట్‌లు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్ సిఫార్సు చేస్తారు.
Published by:Kishore Akkaladevi
First published: