హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: అక్టోబర్ 1... ఈ డేట్ గుర్తుంచుకోండి... కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి

New Rules: అక్టోబర్ 1... ఈ డేట్ గుర్తుంచుకోండి... కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి

New Rules: అక్టోబర్ 1... ఈ డేట్ గుర్తుంచుకోండి... కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: అక్టోబర్ 1... ఈ డేట్ గుర్తుంచుకోండి... కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడేవారికి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (RBI) ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉందా? అయితే అలర్ట్. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కార్డ్ ఆన్ ఫైల్ (CoF) టోకెనైజేషన్ నియమనిబంధనల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రూల్స్ 2022 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ఆర్‌బీఐ ప్రకటించింది. వాస్తవానికి జూలై 1 నుంచే ఈ రూల్స్ అమలులోకి రావాల్సి ఉండగా, బ్యాంకులు, మర్చెంట్స్ గడువు కోరడంతో సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించింది ఆర్బీఐ. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి. కార్డ్ టోకెనైజేషన్ రూల్స్ (Card Tokenisation Rules) అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఎస్‌బీఐ కార్డ్ ప్రకటించింది.

ఇక ఈసారి ఆర్‌బీఐ గడువు పెంచే పరిస్థితి లేదు. కార్డ్‌హోల్డర్ల ముఖ్యమైన డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఆర్‌బీఐ టోకెనైజేషన్ పద్ధతిని తీసుకొచ్చింది. ఇప్పటికే 19.5 కోట్ల టోకెన్స్ జారీ అయ్యాయని అంచనా. క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ ఉన్నవారు ఆన్‌లైన్ లావాదేవీల కోసం తమ కార్డుల్ని ఉపయోగించాలంటే టోకెనైజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ట్రాన్సాక్షన్ జరిపిన ప్రతీసారి కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Link Aadhaar Card: ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండిలా

ఉదాహరణకు మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుతో ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారనుకుందాం. మీరు గతంలో కార్డ్ వివరాలు సేవ్ చేశారు కాబట్టి సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. అంటే మీ క్రెడిట్ కార్డ్ వివరాలు ఫ్లిప్‌కార్ట్ దగ్గర సేవ్ చేసి ఉన్నాయి. ఇకపై ఇలా మీ కార్డు వివరాలు ఫ్లిప్‌కార్ట్ దగ్గర ఉండవు. మీరు మీ క్రెడిట్ కార్డుపై టోకెన్ క్రియేట్ చేయాలి. ఆ టోకెన్ నెంబర్ మాత్రమే ఉంటుంది. ఆ టోకెన్ ఆధారంగా మీరు లావాదేవీలు చేయొచ్చు. ఇలా ప్రతీ మర్చెంట్‌కు వేర్వేరు టోకెన్స్ క్రియేట్ అవుతాయి. మీరు కార్డు టోకెనైజ్ చేయకపోతే ప్రతీ లావాదేవీకి మీ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

కార్డ్ టోకెనైజేషన్ చేయాలని బ్యాంకులు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలు కోరుతున్నాయి. ఆర్‌బీఐ కూడా కార్డ్ టోకెనైజ్ చేయాలని కార్డ్‌హోల్డర్లను కోరుతోంది. ఎలా చేయాలో స్టెప్స్ కూడా వివరించింది. మీ కార్డ్ టోకెనైజేషన్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

Aadhaar Photo: ఆధార్ కార్డుపై మీ ఫోటో నచ్చలేదా? సింపుల్‌గా మార్చేయండి ఇలా

కార్డ్ టోకెనైజేషన్ చేయండి ఇలా

Step 1- ఏదైనా ఇకామర్స్ వెబ్‌సైట్ లేదా మర్చంట్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి పేమెంట్ ప్రాసెస్ ప్రారంభించండి.

Step 2- చెకౌట్ సమయంలో మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి.

Step 3- Secure your card లేదా Save card as per RBI guidelines ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

Step 4- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీకి వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి.

Step 5- మీ కార్డు వివరాలకు బదులుగా టోకెన్ జనరేట్ అవుతుంది.

Step 6- మీరు మళ్లీ అదే వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ట్రాన్సాక్షన్ చేస్తే మీ కార్డులోని చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Credit cards, Debit cards, Personal Finance, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు