Home /News /business /

CAR PRICES ON KIA MOTORS MARUTI SUZUKI AND HYUNDAI MOTORS MAY HIKE FROM JANUARY 2021 AK

Cars Price: కారు కొనాలనుకుంటున్నారా ? డిసెంబర్‌లోనే కొనేయండి.. లేకపోతే..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Cars Price: కియా మోటార్స్ వచ్చే ఏడాది జనవరిలో తమ కంపెనీకి చెందిన సెల్టాస్, సోనెట్ మోడల్స్ ధరలను పెంచబోతోంది. ధరలు ఎంత మేరకు పెరుగుతాయన్నది వచ్చే నెలలోనే క్లారిటీ రానుంది.

    కారు కొనడం మధ్య తరగతి ప్రజల కల. అందుకే కార్ల ధరలు పెరుగుతున్నాయనే వార్త వాళ్లకు ఒకరకంగా చేదువార్తే. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు.. మళ్లీ కార్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా లాక్‌డౌన్ ప్రభావం తరువాత తమ అమ్మకాలు పెంచుకునేందుకు పలు మోడల్స్‌పై కార్ల కంపెనీలు డిస్కౌంట్ కూడా ఇచ్చాయి. ఆ రకంగా ఈ ఏడాది మొదటి అర్థభాగంలో తగ్గిన అమ్మకాలు.. ఆ తరువాత మళ్లీ పుంజుకున్నాయి. అయితే త్వరలోనే పలు కంపెనీలు మళ్లీ ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరిలో ఈ పెంపు ఉండనుంది.

    సాధారణంగా కార్ల కంపెనీలు ప్రతి ఏడాది జనవరిలో తమ కార్ల ధరలను పెంచుతుంటాయి. ముడి పదార్థాల ధరలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని పలు మోడల్స్‌ రేట్లను కంపెనీలు సవరిస్తుంటాయి. వచ్చే నెలలో ధరలు పెరగనున్న నేపథ్యంలో.. ఈ నెలలో కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కియా మోటార్స్ వచ్చే ఏడాది జనవరిలో తమ కంపెనీకి చెందిన సెల్టాస్, సోనెట్ మోడల్స్ ధరలను పెంచబోతోంది. ధరలు ఎంత మేరకు పెరుగుతాయన్నది వచ్చే నెలలోనే క్లారిటీ రానుంది.

    ప్రస్తుతం కియా సెల్టాస్ మోడల్ ధర రూ. 9.89 లక్షల నుంచి రూ. 17.34 లక్షలు ఉండగా... సోనెట్ మోడల్ ధర రూ. 6.71 నుంచి రూ. 12.89గా ఉంది. హుందాయ్ సైతం తమ కంపెనీకి చెందిన పలు మోడల్ కార్ల ధరలను పెంచాలని భావిస్తోంది. దాదాపు మోడల్స్‌పై ఎంతో కొంత పెంపు ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. ఇక కార్ల అమ్మకాల్లో దిగ్గజంగా ఉన్న మారుతి సుజుకీ సైతం తమ కార్ల ధరలను పెంచనుందని తెలుస్తోంది. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో.. ఈసారి పెంపు అంతగా ఉండకపోవచ్చనే వాదన ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Auto News, Automobiles, Cars

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు