Car Discount | కారు కొనే వారికి గుడ్ న్యూస్. కళ్లుచెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ప్రముఖ కార్ల (Cars) తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మోడళ్లపై సూపర్ ఆఫర్లు (Offers) అందుబాటులో ఉంచింది. ఏకంగా రూ. 38 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు కేవలం మార్చి నెల చివరి వరకే అందుబాటులో ఉంటాయి. అందువల్ల కొత్త కారు కొనే వారు ఈ డీల్స్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.
క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి అన్నీ కలిసి ఈ తగ్గింపు లభిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియో మోడల్‌పై రూ. 38 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల తగ్గింపు ఉంది. కార్పొరేట్ డిస్కౌంట్‌పై రూ. 3 వేల తగ్గింపు లభిస్తోంది. అలాగే క్యాష్ డిస్కౌంట్ కింద రూ. 25 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
పాత రూ.500, రూ.1000 నోట్లు.. కేంద్రం కీలక ప్రకటన!
హ్యుందాయ్ ఆరా మోడల్‌పై రూ. 33 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. క్యాష్ డిస్కౌంట్‌పై రూ. 20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 10 వేల తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇక కార్పొరేట్ తగ్గింపు రూ. 3 వేల వరకు లభిస్తుంది. హ్యుందాయ్ ఐ20 మోడల్‌పై రూ. 20 వేల వరకు బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు లభిస్తోంది.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకులకు కొత్త టైమింగ్స్.. ఇక ఎక్కువ సేపు తెరిచే ఉంటాయి, కానీ..
కాగా కొత్తగా కారు కొనే వారు ఒక విషయ తెలుసుకోవాలి. ఈ ఆఫర్లు అనేవి పరిమిత కాలం వరకే ఉంటాయి. ఇంకా ప్రాంతం, డీలర్‌షిప్, కారు వేరియంట్ ప్రాతిపదికన డిస్కౌంట్ ఆఫర్లు మారుతూ ఉంటాయి. అందువల్ల మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి కారు ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. తర్వాతనే కారు కొనాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోండి. కాగా ఇప్పటికే హోండా కార్స్, టాటా మోటార్స్, రెనో ఇండియా వంటి కంపెనీలు కూడా వాటి పలు మోడళ్లపై తగ్గింపు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. అందువల్ల మీరు కొనే ముందు ఏ ఏ మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో కూడా చెక్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Cars, Hyundai