భారత మార్కెట్లోకి రానున్న Nissan Magnite కారు... ఇంటర్నెట్‌లో ధరలు లీక్

Nissan నుంచి మరో కారు భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. తమ సంస్థ నుంచి రానున్న సరికొత్త Magnite కారును ఈ నెలలోనే లాంచ్ చేస్తామని Nissan ప్రకటించింది. కానీ అంతకు ముందే ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ధరలు ఇంటర్‌నెట్‌లో లీక్ అయ్యాయి.

news18-telugu
Updated: November 9, 2020, 6:28 PM IST
భారత మార్కెట్లోకి రానున్న Nissan Magnite కారు... ఇంటర్నెట్‌లో ధరలు లీక్
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
Nissan నుంచి మరో కారు భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. తమ సంస్థ నుంచి రానున్న సరికొత్త Magnite కారును ఈ నెలలోనే లాంచ్ చేస్తామని Nissan ప్రకటించింది. కానీ అంతకు ముందే ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ధరలు ఇంటర్‌నెట్‌లో లీక్ అయ్యాయి. భారతదేశంలో Nissan Magnite 1.0 లీటర్ XE పెట్రోల్ వేరియంట్‌ ధర రూ.5.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మోడల్‌ను బట్టి ధరలు ఉన్నాయి. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ XV ప్రీమియం CVT వేరియంట్ ధర రూ.9.55 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధరలు) ఉంది. లీకైన ధరల ప్రకారం చూస్తే, Nissan Magnite కారు హ్యుందాయ్ వెన్యూ, మారుతి విటారా బ్రెజ్జా వంటి వాహనాలతో పోటీ పడనుంది.త్వరలో భారత్‌కు రానున్న ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను Nissan ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ దాని ఇంజిన్ లైనప్ గురించి మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. Nissan రెండు ఇంజిన్ ఆప్షన్‌లతో Magnite 2020ను అభివృద్ధి  చేసింది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో ఈ ఎస్‌యూవీని రూపొందించారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ యూనిట్ 6,250 rpm వద్ద అత్యధికంగా 71 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 3,500 rpm వద్ద 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 5,000 rpm వద్ద 99 bhp శక్తిని, 2,800- 3,600 rpm వద్ద 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టర్బో ఇంజిన్ CVT మోడల్‌ 2,200 నుంచి 4,400 rpm వద్ద 152 Nm టార్క్‌ను అందిస్తుంది.ఇంధన సామర్థ్యం

Nissan Magnite1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 18.75 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 1.0లీటర్ టర్బో పెట్రోల్- మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. వీటితో పాటు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ CVT మోడల్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని Nissan ప్రకటించింది.
లీకైన Nissan Magnite ధరల వివరాలు
XL రూ.6.25 లక్షలు
XV రూ.6.75 లక్షలు
XV Premium రూ.7.65 లక్షలు
Turbo XL రూ.7.25 లక్షలు
Turbo XVPremium రూ.8.65 లక్షలు
Turbo XL CVT రూ.8.15 లక్షలు
Turbo XV CVT రూ.8.65 లక్షలు
Turbo XV PremiumCVT రూ.9.55 లక్షలు
Nissan MagniteXE రూ.5.5 లక్షలు
Published by: Krishna Adithya
First published: November 9, 2020, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading