Money | కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ఒక సూపర్ బిజినెస్ ఐడియా అందుబాటులో ఉంది. అదే కార్ యాక్ససిరీస్ బిజినెస్. మీరు ఈ బిజినెస్‌ను తక్కువ మొత్తంతో (Money)నే ప్రారంభించొచ్చు. అలాగే ఎప్పుడైనా డిమాండ్ ఉండే వ్యాపారం ఇది. అంతేకాకుండా ఇంకా ఈ బిజినెస్‌లో అధిక ప్రాఫిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ (కార్లు - Cars) కొనే వారు ఎప్పటికీ ఉంటారు.
కరోనా వచ్చిన దగ్గరి నుంచి కార్లకు డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత ప్రయాణానికి అధిక ప్రాధాన్యం లభించింది. అందువల్ల మీరు కారు యాక్ససిరీస్ బిజినెస్ ప్రారంభిస్తే.. ఆకర్షణీయ రాబడి సొంతం చేసుకోవచ్చు. కొత్తగా కారు కొన్న వారు కచ్చితంగా చేసే పనులు రెండు ఉంటాయి. ఒకటేమో గుడికి పూజ చేయించుకోవడానికి వెళ్తారు.
అలాగే కార్ యాక్ససిరీస్ షాపకు తర్వాత కచ్చితంగా వెళ్తారు. అందుకే మీరు ఈ కార్ యాక్ససిరీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ పొందొచ్చు. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని భావిస్తే.. 300 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కావాలి. లేదంటే షాపు ఉంటే ఇంకా మంచిది. మీరు హోల్ సెల్లర్ల నుంచి మీకు కావాల్సిన గూడ్స్‌ను కొనొచ్చు. అయితే ఇలా చేస్తే మార్జిన్ తక్కువగా ఉంటుంది.
ఒక్కసారి చార్జ్ చేస్తే తిరుపతి నుంచి విజయవాడ వెళ్లొచ్చు.. తక్కువ ధరలో టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
ఇలా కాకుండా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరి నుంచి నేరుగా గూడ్స్ కొనుగుల చేయడం ఉత్తమం. ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ ఆన్‌లైన్‌లో గూడ్స్‌ను విక్రయిస్తున్నాయి. అందువల్ల మీరు నేరుగా వారిని కాంటాక్ట్ కావొచ్చు. మీకు కావాల్సిన గూడ్స్ కొనొచ్చు. మీకు అధిక మార్జిన్ లభిస్తుంది. అలాగే మీకు మ్యానుఫ్యాక్చరర్‌కు డబ్బులు చెల్లించడానికి 30 నుంచి 60 రోజులలోగా సమయం లభిస్తుంది.
అంతేకాకుండా మరో బెనిఫిట్ కూడా ఉంది. కొంత మంది మ్యానుఫ్యాక్చరర్లు విక్రయం కాని పార్ట్‌ను వెనక్కి తీసుకుంటారు. అంతేకాకుండా మీకు ఈ బిజినెస్‌కు ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్ అక్కర్లేదు. మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ బిజినెస్ నడుస్తుంది. అయితే కార్ మార్కెట్‌కు దగ్గరిలో షాపు ఉండేలా చూసుకోండి. మీరు ఈ బిజినెస్‌లో షాపు రెంట్‌కు అధికంగా ఖర్చు అవుతుంది. అలాగే శాలరీలు ఇవ్వాలి. మీరు 2 - 3 అయినా పనిలో పెట్టుకోవాలి. తర్వాత గూడ్స్ కొనుగోలుకు డబ్బులు కావాలి. ఇలా ఇవ్వన్నీ కలుపుకుంటే మీరు రూ. 5 లక్షలలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కార్ యాక్సిసిరీస్ బిజినెస్‌లో మార్జిన్ 35 నుంచి 70 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే మీరు రూ. 5 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు సంపాదించొచ్చు. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మీ రాబడి మారుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business Ideas, Business plan, Cars, Money