• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • CANT REMEMBER PASSWORDS MICROSOFT HAS NEW PASSWORD MANAGER FOR YOU BA GH

Microsoft: అబ్బా ఈ పాస్‌వర్డ్‌లతో చచ్చిపోతున్నాం అనుకుంటున్నారా.. మీకో గుడ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

మైక్రోసాఫ్ట్ వినియోగదారుల భద్రత కోసం 2021లో కన్వర్జ్డ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కూడా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం ‘మై యాప్స్’ అనే పోర్టల్ను అందుబాటులోకి తేనుంది.

  • Share this:
ఇంటి భద్రతకు తాళం ఎంత ముఖ్యమో.. ఆన్లైన్ ఖాతాలు అంటే మొయిల్, క్లౌడ్ స్టోరేజ్, బ్యాంకింగ్తో పాటు ఇతరత్రా వాటికి పాస్‌వర్డ్ అంతే ముఖ్యం. దేశంలో తక్కువ ధరకే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోతుంది. అయితే, వీటిని సాధారణంగా మనం పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేస్తాం. అయితే, ఆయా ఆన్‌లైన్ ఖాతాలకు మనం సెట్ చేసుకునే పాస్‌వర్డ్ (password)లు సురక్షితమేనా?.. అవి మన ఖాతాలను ఎంత మేర భద్రంగా ఉంచుతాయి? అనే సందేహాలు, ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దీనికి పరిష్కారం చూపే ప్రయత్నాలు ముమ్మరం చేసింది ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ తయారీ సంస్థ మైక్రోసాఫ్ట్. దీనిలో భాగంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) తన ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను అన్‌లాక్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. 2021లో పాస్వర్డ్ లేని టెక్నాలజీని ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఈ నూతన అప్డేట్‌ను తాజాగా మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్‌ (blog post)లో పంచుకుంది. 80 శాతానికిపైగా సైబర్ దాడులు పాస్‌వర్డ్‌ను లక్ష్యంగా చేసుకొనే జరుగుతున్నాయని, దాదాపు 250 కార్పొరేట్ కంపెనీలపై ప్రతి రోజూ పాస్‌వర్డ్ లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్లో పేర్కొంది. దీనికి పరిష్కారంగా పాస్‌వర్డ్ లేని టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. కాగా, ప్రతి నెలా 100 మిలియన్ల మందికి పైగా మైక్రోసాఫ్ట్ యూజర్లు పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్‌లను ఉపయోగిస్తున్నారని 2019 నవంబర్లో నిర్వహించిన తన మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్‌ (Microsoft Ignite) ప్రోగ్రామ్లో యూజర్లతో పంచుకుంది. అయితే, 2020 మే నాటికి ఆ సంఖ్య 150 మిలియన్లకు చేరినట్లు తెలిపింది. అందువల్ల, 2021లో మా వినియోగదారులందరికీ పాస్‌వర్డ్ లేని సిస్టమ్ యాక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా పేర్కొంది.

డేటా సెక్యూరిటీకి నూతన పోర్టల్ విడుదలకు సన్నాహాలు
ఇందులో భాగంగా వినియోగదారుల భద్రత కోసం 2021లో కన్వర్జ్డ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కూడా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం ‘మై యాప్స్’ అనే పోర్టల్ను అందుబాటులోకి తేనుంది. తద్వారా వినియోగదారులు వారి ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్లను పాస్‌వర్డ్ లేకుండానే నిర్వహించడానికి వీలవుతుంది. కాగా దీనికోసం మైక్రోసాఫ్ట్ చిప్ డిజైన్ యూనిట్ పనిచేస్తుంది. ఈ చిప్ డిజైన్ యూనిట్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్‌గా, పాస్‌వర్డ్ లేని ఫోన్ సైన్ ఇన్‌గా ఉపయోగపడుతుంది. కాగా, పాస్వర్డ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో Windows 10 పరికరాల్లో సైన్ ఇన్ కోసం ‘విండోస్ హలో’ను ఉపయోగించే వినియోగదారుల సంఖ్య గత సంవత్సరం 69.4% నుంచి 84.7% కి పెరిగింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పాస్వర్డ్ ఫీచర్ను తొలగించే ప్రయత్నాలు చేయడం మైక్రోసాఫ్ట్కు ఇది కొత్తేమి కాదు. కొన్నేళ్లుగా, ఈ అప్డేట్ను తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మైక్రోసాఫ్ట్ తో పాటు, ఆపిల్ కూడా ఈ నూతన ఫీచర్ పై పనిచేస్తోంది. దీనికి అనుగుణంగానే ఐఫోన్ (iPhone) తయారీదారులు టచ్ ఐడి (Touch ID), ఆపిల్ ఐడిలు (Apple ID), ఫేస్ ఐడిల ద్వారా యూజర్ లాగిన్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది.
Published by:Ashok Kumar Bonepalli
First published: