హోమ్ /వార్తలు /బిజినెస్ /

Income Tax Returns: గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయలేదా ? అయితే ఎన్ని ప్రయోజనాలు కోల్పోతారో తెలుసా !

Income Tax Returns: గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయలేదా ? అయితే ఎన్ని ప్రయోజనాలు కోల్పోతారో తెలుసా !

 గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయలేదా ? అయితే ఎన్ని ప్రయోజనాలు కోల్పోతారో తెలుసా !

గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయలేదా ? అయితే ఎన్ని ప్రయోజనాలు కోల్పోతారో తెలుసా !

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్‌ (ITR) ఫైల్ చేయడానికి 2022 జులై 31తో గడువు ముగిసింది. పన్ను(Tax) పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే, తప్పనిసరిగా ఐటీఆర్‌ ఫైల్ చేయాలి. గడువులోగా ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయకపోతే ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారించే అవకాశం ఉంది ?

ఇంకా చదవండి ...

ADHIL SHETTY, CEO, BANKBAZAAR

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్‌ (ITR) ఫైల్ చేయడానికి 2022 జులై 31తో గడువు ముగిసింది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే, తప్పనిసరిగా ఐటీఆర్‌ ఫైల్ చేయాలి. గడువులోగా ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయకపోతే ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారించే అవకాశం ఉంది.

కొన్నిసార్లు ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే గడువును పొడిగిస్తారు. కరోనా(Corona) మహమ్మారి కారణంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేందుకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం గడువును పొడిగించింది. కానీ పొడిగింపుపై ఆధారపడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పెనాల్టీలు, చెల్లించని పన్నులపై వడ్డీ లేదా చట్టపరమైన పరిశీలనను నివారించడానికి గడువు తేదీకి ముందే ఐటీఆర్‌లను ఫైల్‌ చేయాలని పేర్కొన్నారు.

ఐటీఆర్‌ అనేది ఆదాయం, ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన పన్నుల గురించిన సమాచారాన్ని తెలిపే డాక్యుమెంట్(Document). గడువు తేదీ తర్వాత దాఖలు చేసిన ఐటీఆర్‌ను బిలేటెడ్‌ రిటర్న్ అంటారు.

గడువు తేదీలోగా రిటర్న్‌లను ఫైల్ చేయకపోతే ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఇవే..

పెనాల్టీ

ఆదాయ పన్ను రిటర్న్‌ గడువులోపు సమర్పించకపోతే, చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ 2022 డిసెంబర్ 31లోపు రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. అయితే ఇందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉంటే రూ.5,000 జరిమానా(Fine) చెల్లించాలి. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకంటే తక్కువగా ఉంటే రూ.1,000 జరిమానా వర్తిస్తుంది. సెక్షన్ 234F ప్రకారం 2021-22 సంవత్సరానికి చెల్లించని పన్నులపై వడ్డీ కూడా చెల్లించాలి. ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉంటే, డాక్యుమెంటేషన్ ప్రయోజనాల కోసం రిటర్న్‌లను ఫైల్ చేస్తుంటే.. ఎటువంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు.

వడ్డీ

గడువు ముగిసిన తర్వాత రిటర్న్‌ దాఖలు చేస్తే, బకాయి ఉన్న మొత్తంపై 1 శాతం వడ్డీ విధిస్తారు. జులై 31 నుంచి వడ్డీతో పాటు బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు గడువు ముగిసినప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి రిటర్నులను దాఖలు చేయడంలో ఎంత ఆలస్యం చేస్తే, వడ్డీ చెల్లింపు అంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. రిటర్నులను సకాలంలో ఫైల్ చేస్తే ఇలాంటి సమస్యలను నివారించవచ్చు.

ఇదీ చదవండి: Infinix Hot 12 Pro: భారీ డిస్‌ప్లేతో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే అదుర్స్ అంటారుచట్టపరమైన చర్యలను ఎదుర్కోవచ్చు

ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయడంలో ఆలస్యం లేదా విఫలమైతే ఆదాయ పన్ను శాఖ చట్టపరమైన నోటీసు పంపి, వివరణ కోరవచ్చు. ఈ వివరణతో ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సంతృప్తి చెందకపోతే, చట్టప్రకారం చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది.

కోల్పోయే ప్రయోజనాలు

ఆదాయ పన్ను రిటర్న్‌ సకాలంలో ఫైల్ చేసి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఆలస్యంగా ఫైల్ చేయడం ద్వారా వీటిని కోల్పోతారు. సమీప భవిష్యత్తులో లోన్‌ తీసుకోవాలని అనుకుంటే.. రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, ఆదాయాన్ని ధ్రువీకరించడానికి బ్యాంకులు ఐటీఆర్‌లను కోరుతాయి. గడువు కంటే ముందే రిటర్న్‌ ఫైల్ చేయడం వల్ల ఆర్థిక సంవత్సరంలో నష్టాలను ప్రకటించవచ్చు. రిటర్న్‌ ఫైల్ చేస్తున్నప్పుడు, ఈ నష్టాలకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు లేదా వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరానికి కొనసాగించవచ్చు. అదే విధంగా వివిధ దేశాల కాన్సులేట్లు వీసా మంజూరు చేసే ముందు ఆదాయం, ఉద్యోగాన్ని నిర్ధారించడానికి ఐటీఆర్‌ స్టేట్‌మెంట్‌ కోరుతాయి.

First published:

Tags: Fine, ITR, Itr deadline, Penalty

ఉత్తమ కథలు