Health Insurance: క్యాన్సర్, హృద్రోగాలకు బీమా పాలసీలు అందిస్తున్న స్టార్‌హెల్త్.. రూ.10 లక్షల వరకు కవరేజీ

star health

స్టార్ట్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌ సంస్థ రెండు విభిన్న బీమా పాలసీలను అందిస్తోంది. స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్‌ పాలసీ, స్టార్ కార్డియాక్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్‌ పాలసీలను ఆ సంస్థ తాజాగా ప్రారంభించింది. నిర్దిష్ట వ్యక్తులే లక్ష్యంగా.. అంటే క్యాన్సర్, హృద్రోగాలతో బాధపడే వారి కోసం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ స్పష్టం చేసింది.

  • Share this:
గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా హృద్రోగాలు, క్యాన్సర్ బాధితులు చికిత్సకు అయ్యే ఖర్చులను చెల్లించలేకపోతున్నారు. దీంతో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని స్టార్ట్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌ సంస్థ రెండు విభిన్న బీమా పాలసీలను అందిస్తోంది. స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్‌ పాలసీ, స్టార్ కార్డియాక్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్‌ పాలసీలను ఆ సంస్థ తాజాగా ప్రారంభించింది. నిర్దిష్ట వ్యక్తులే లక్ష్యంగా.. అంటే క్యాన్సర్, హృద్రోగాలతో బాధపడే వారి కోసం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ఈ పాలసీలు కొనుగోలు చేయాలంటే ప్రీమెడికల్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని, పూర్వ వైద్య రికార్డులు సమర్పిస్తే సరిపోతుందని స్టార్ హెల్త్ సంస్థ తెలిపింది. అంటే పాలసీని కొనుగోలు చేసే సమయంలో మీరు తీసుకున్న చికిత్సల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. వీటిలో వినియోగదారులు లైఫ్ లాంగ్ రెన్యువల్ చేసే ఆప్షన్ ఉంది. అంతేకాకుండా ప్రీమియంలు త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక వాయిదాల్లో చెల్లించే అవకాశముంది. భారత్ లో హృద్రోగాలు, క్యాన్సర్ బాధితులు ఎక్కువవుతున్నారని, ఈ ఆరోగ్య బీమా పాలసీల ద్వారా సదరు అనారోగ్యాలకు బీమా రక్షణ పొందవచ్చని సంస్థ ఎండీ డాక్టర్ ఎస్ ప్రకాశ్ తెలిపారు.

స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం పాలసీ..
క్యాన్సర్‌తో బాధపడుతున్న లేదా బయట పడ్డ వ్యక్తులు ఈ పాలసీకి అర్హులు. ఇది 5 నెలల పసిపాపల నుంచి 65 ఏళ్ల వయసున్న వ్యక్తులకు రూ.10 లక్షల వరకు వర్తిస్తుంది. క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడంతో పాటు సంబంధిత చికిత్సలకు అయ్యే ఖర్చును ఈ బీమా పాలసీ కవర్ చేస్తుంది. ప్రమాదాలకు వెయిటింగ్ పీరియడ్, క్యాన్సర్ కాకుండా మిగతా వ్యాధుల చికిత్సలకు 30 రోజుల వెయిటింగ్ పీరియడ్, క్యాన్సర్ తో పాటు ఇప్పటికే చికిత్స చేస్తున్న వాధులకు 30 నెలల వెయిటింగ్ పీరియడ్‌ను పాలసీ కవర్ చేస్తుంది.

రూ.5 లక్షలు, రూ.7 లక్షల 50 వేలు, రూ.10 లక్షల వరకు కస్టమర్ వివిధ రకాల ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇన్ పేషేంట్ హాస్పిటలైజేషన్, డే కేర్ ట్రీట్మెంట్, రోడ్ అంబులెన్స్, ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులను కూడా ఈ పాలసీ భరిస్తుంది. మొదటి క్యాన్సర్ తో సంబంధం లేకుండా రెండోసారి కూడా వ్యాధి తిరగబెడితే ఈ పాలసీ మొత్తం సొమ్ము చెల్లిస్తుంది. బీమా పరిహారంతో పాటు అదనంగా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పాలసీ కొనుగోలుదారులు క్లెయిమ్ చేసుకోని సంవత్సరానికి(Claim free Year) ప్రాథమిక మొత్తంలో 5 శాతం వరకు బోనస్ పొందుతాడు. గరిష్ఠంగా 50 శాతం వరకు బోనస్ పొందే అవకాశముంది. ఈ సమయంలో ఆరోగ్య పరీక్షలు కూడా పొందవచ్చు.

* స్టార్ కార్డియాక్ కేర్ ఇన్సూరెన్స్‌ పాలసీ..
పేరులో ఉన్నట్లుగానే ఈ పాలసీ గుండె జబ్బులకు సంబంధించింది. ఇది 7 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న వ్యక్తులకు బీమాను అందిస్తుంది. ఈ పాలసీలో బీమా చేసే మొత్తం రూ.15 లక్షలు. ఈ బీమా కొనుగోలు చేసిన 30 రోజుల తర్వాత గుండె లేదా నాన్-కార్డియక్ అనారోగ్యాలకు కూడా ఆసుపత్రి ఖర్చులను భరిస్తుంది. ప్రమాదాలకు NIL వెయిటింగ్ పీరియడ్, గుండె మార్పిడి చికిత్స కోసం 24 నెలల వ్యవధి, ఇప్పటికే ఉన్న వ్యాధుల చికిత్సలకు 48 నెలల వ్యవధిని ఇస్తుంది.

ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్, డే కేర్ ట్రీట్మెంట్, రోడ్ అంబులెన్స్, ప్రీ & పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, ఇ-సెకండ్ మెడికల్ ఒపీనియన్, టెలి-హెల్త్ సర్వీసెస్, వెల్నెస్ సర్వీసులు లాంటి ప్రయోజనాలు ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. క్లెయిమ్ ఫ్రీ సంవత్సరంలో ప్రాథమిక మొత్తంలో 10 శాతం బోనస్ అందుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను లేదా ఏజెంట్‌ను సంప్రదించాలని స్టార్‌హెల్త్ సూచించింది.
Published by:Krishna Adithya
First published: