దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు ముఖ్య సమాచారాన్ని అందించింది. ఎటుమానూరు- కొట్టాయం- చింగవనం స్టేషన్ల మధ్య డబుల్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నందున సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య రెండు రైళ్లను మే 24 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా మే నెలలో 6 నుంచి 17 వరకు మరో ఆరు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు-సూళ్లూరుపేట్, హెచ్‌ఎస్ నాందేడ్-సత్రగచీ స్టేషన్ల మధ్య నాలుగు రైళ్లను రద్దు చేశారు. దోన్ గుంటూరు స్టేషన్ల మధ్య రెండు రైళ్ల సమయాలను రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు.
Jio Q4 Result: దుమ్ములేపిన జియో.. Q4 లాభం ఎన్ని కోట్లంటే?
16 సమ్మర్ స్పెషల్ రైళ్లు
హైదరాబాద్-జైపూర్ స్టేషన్ల మధ్య 16 సమ్మర్ వీక్లి ప్రత్యేక రైళ్లను ఈ నెల 6 నుంచి జూన్ 26వ తేదీ వరకు నడుపనున్నట్లు రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎస్‌సీఆర్ (SCR) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు..
అంతే కాకుండా 34 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 7, 8 తేదీల్లో అంటే శని, ఆది వారాల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. Lingampalli-Hyderabad MMTS: ఈ మార్గంలో 9 సర్వీసులను రద్దు చేశారు. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. Hyderabad-Lingampalli: ఈ మార్గంలో 9 సర్వీసులను రద్దు చేశారు. 47105, 47109, 47110, 47111, 47116, 47118, 47120 నంబర్ గల సర్వీసులను రద్దు చేశారు.
Falaknuma-Lingampalli: ఈ మార్గంలో 7 సర్వీసులను రద్దు చేశారు. 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్ గల సర్వీసులను రద్దు చేశారు అధికారులు. Lingampalli-Falaknuma: ఈ మార్గంలో మొత్తం 7 సర్వీసులను రద్దు చేశారు. 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 నంబర్ గల సర్వీసులను రద్దు చేశారు అధికారులు. Secunderabad-Lingampalli మార్గంలో 47150 నంబర్ గల సర్వీసును అధికారులు రద్దు చేశారు.
Ooty Tour: హైదరాబాద్ టు ఊటీ టూర్... తెలంగాణ టూరిజం ప్యాకేజీ
రైల్వే పరీక్ష అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు శాలీమార్-చీరాల, హతియా-చీరాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు, జబల్‌పూర్, నాందేడ్ స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు గురువారం రైల్వే అధికారులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.