EMI | బ్యాంకుల వాయింపు కొనసాగుతోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు పెంపు కారణంగా బ్యాంకులు (Banks) కూడా వరుసపెట్టి రుణ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. తాజాగా మరో బ్యాంక్ కూడా రుణ రేట్లు పెంచేసింది. రేపటి నుంచి రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి రానుంది. దీని వల్ల బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
కెనరా బ్యాంక్ తాజాగా రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్), మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) పెంచుతున్నట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. కొత్త రేట్లు అక్టోబర్ 7 నుంచి అమలులోకి వస్తాయి. అన్ని టెన్యూర్లకు రేట్ల పెంపు వర్తిస్తుంది. ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రెపో రేటు 5.9 శాతానికి చేరింది.
ఈ స్కూటర్లకు ఫుల్ డిమాండ్.. ఎగబడి కొనేస్తున్న జనం.. నిమిషానికొకటి ఫట్!
రేట్ల పెంపు తర్వాత ఎంసీఎల్ఆర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓవర్ నైట్ నుంచి ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. 6.9 శాతం నుంచి 7.05 శాతానికి ఎగసింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు కూడా ఇదే స్థాయిలో పైకి చేరింది. 7.25 శాతం నుంచి 7.4 శాతానికి ఎగసింది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు అయితే 7.65 శాతం నుంచి 7.8 శాతానికి చేరింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతం నుంచి 7.9 శాతానికి పెరిగింది.
ఎస్‌బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ వరకు.. బ్యాంకుల వాట్సాప్ బ్యాంకింగ్ సేవల నెంబర్లు ఇవే!
బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటు కన్నా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి వీలుండదు. ఎంసీఎల్ఆర్ రేటును కనీస రుణ రేటుగా చెప్పుకుంటారు. దీని ఆధారంగానే బ్యాంకులు వాటి రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. సాధారణంగా బ్యాంకులు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటాయి.
అలాగే కెనరా బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ కూడా పెంచింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగింది. 8.3 శాతం నుంచి 8.8 శాతానికి చేరింది. ఆర్‌బీఐ నిర్దేశించిన రెపో రేటు లింక్ అయ్యి ఈ ఆర్ఎల్ఎల్ఆర్ రేటు ఉంటుంది. అందువల్ల రెపో రేటు తగ్గితే ఈ రేటు కూడా తగ్గుతుంది. రెపో రేటు పెరిగితే ఈ రేటు కూడా పైకి చేరుతుంది. రుణ రేట్లు పెరగడం వల్ల రీసెట్ డేట్ నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. ఈ రుణ రేట్ల ఆధారంగా లోన్ తీసుకొని ఉంటే.. అప్పుడు వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. అంటే ఈఎంఐ భారం పైకి చేరుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Canara Bank, Home loan, Mclr, Rbi