కెనరా బ్యాంక్ (Canara Bank) కస్టమర్లకు అలర్ట్. దేశంలో మూడో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజంగా ఉన్న ఈ బ్యాంకు.. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లపై విధించే సర్వీస్ ఛార్జీల (Service Charges)ను సవరించింది. దీనికి సంబంధించి బ్యాంక్ తాజాగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఫైనాన్షియల్ (Financial), నాన్ ఫైనాన్షిల్ ట్రాన్సాక్షన్ల (Non Financial Transcations)కు సవరించిన సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. ‘కెనరా బ్యాంక్ BC ఏజెంట్లు, ఇతర బ్యాంక్ BC ఏజెంట్ల ద్వారా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్, నాన్ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ ద్వారా చేసే ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త సర్వీస్ ఛార్జీలు 20/09/2022 నుంచి అమల్లోకి వస్తాయి.’ అని బ్యాంక్ ప్రెస్ నోట్‌లో తెలిపింది. అంటే సెప్టెంబరు 20 నుంచి కస్టమర్లు కొత్త సర్వీసు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.* కొత్త ఛార్జీలు
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD) అకౌంట్ల విషయంలో.. క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రా, ఇతర బ్యాంక్ BCAలు, కెనరా బ్యాంక్ BCA ద్వారా చేసిన ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై రూ.20 ప్లస్ GST సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కెనరా బ్యాంక్ BC ఏజెంట్ల (BCAs) ద్వారా చేసే నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఎటువంటి సర్వీస్ ఛార్జీ విధించరు.
* నాన్ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ కస్టమర్లకు
నాన్ బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ విషయంలో.. ఇతర బ్యాంక్ BCAల ద్వారా మినీ స్టేట్‌మెంట్లను రూపొందించడం వంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు కెనరా బ్యాంక్ ఇప్పుడు రూ.6 ప్లస్ GSTని సర్వీస్ ఛార్జీగా విధిస్తుంది. క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రా, ఇతర బ్యాంకుల BCAల ద్వారా జరిగే క్యాష్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై బ్యాంక్ రూ.30 ప్లస్ GST వసూలు చేస్తుంది.
కెనరా బ్యాంక్ BC ఏజెంట్ల (BCA) ద్వారా చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై రూ.25 ప్లస్ GST వర్తిస్తుంది. అయితే కెనరా బ్యాంక్ BC ఏజెంట్ల (BCAs) ద్వారా చేసే నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఎటువంటి సర్వీస్ ఛార్జీ ఉండదు.
ఇది కూడా చదవండి : SBI గుడ్ న్యూస్.. పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు!
* సేవింగ్స్ డిపాజిట్లపై కొత్త వడ్డీ
సేవింగ్స్ డిపాజిట్లపై కెనరా బ్యాంక్ 2022 జూన్ 29న వడ్డీ రేట్లను సవరించింది. రూ.50 లక్షల కంటే తక్కువ మొత్తం ఉన్న సేవింగ్స్ అకౌంట్లకు బ్యాంక్ ఇప్పుడు 2.90% వడ్డీ రేటును అందిస్తోంది. రూ.50 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు క్యాష్ ఉండే సేవింగ్స్ అకౌంట్‌లకు 2.90% వడ్డీ రేటు లభిస్తుంది. రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు సేవింగ్స్ అకౌంట్లో ఉంటే, ఆ మొత్తంపై 3.10% వడ్డీ ఇస్తోంది. రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల డిపాజిట్లపై 3.40%; రూ.1000 కోట్లు, అంతకు మించిన సేవింగ్స్ డిపాజిట్లపై 3.55% వడ్డీ రేటు లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Canara Bank, Personal Finance, Saving account, Savings Deposit