Canara Bank FD Rates | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ (Canara Bank) తాజాగా తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD Rates) వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్లలోపు డిపాజిట్లకు రేట్ల పెంపు వర్తిస్తుంది. రేట్ల పెంపు నిర్ణయం అక్టోబర్ 31 నుంచి అమలులోకి వస్తుంది. అంటే రేపటి నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం బ్యాంక్ 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్‌తో కస్టమ్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులు అందిస్తోంది. ఈ ఎఫ్‌డీలపై 3.25 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. సాధారణ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే అదనపు వడ్డీ ప్రయోజనం ఉంటుంది. వీరికి 3.25 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. 666 రోజుల ఎఫ్‌డీలపై గరిష్టంగా సాధారణ కస్టమర్లకు7 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.
పర్సనల్ లోన్ కావాలా? 24 బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా.. ఎందులో తక్కువంటే?
7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై ఇప్పుడు బ్యాంక్ 3.25 శాతం వడ్డీని అందిస్తోంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 180 రోజుల నుంచి ఏడాది టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 5.5 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఏడాది నుంచి రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. బ్యాంక్ ఇప్పుడు 666 రోజుల ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీని అందిస్తోంది. 2 ఏళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. మూడేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.5 శాతంగా కొనసాగుతోంది.
జేజమ్మ లాంటి స్టాక్.. నెలలో డబ్బు రెట్టింపు.. కొంటే 1 షేరుకు 2 షేర్లు ఫ్రీ!
కెనరా బ్యాంక్ ట్యాక్స్ సేవర్ డిపాజిట్ల విషయానికి వస్తే.. బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. పైన పేర్కొన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లే రికరింగ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తాయి. కాగా డబ్బులు ముందే తీసుకోవాలని చూస్తే.. ప్రిమెచ్యూర్ చార్జీలు 1 శాతంగా ఉంటాయి. అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు టెన్యూర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక్కసారి డబ్బులు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ వరకు డబ్బులు తీసుకోవడానికి వీలుండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Canara Bank, FD rates, Fixed deposits, Personal Finance