ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రూ.2 కోట్ల వరకు చేసే డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. కెనరా బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే టర్మ్ డిపాజిట్లను అందిస్తోంది. డిపాజిట్ మొత్తంతో సంబంధం లేకుండా దేశీయ/NRO టర్మ్ డిపాజిట్‌లను కనీసం 7 రోజుల్లో రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. రూ.5 లక్షల లోపు ఉండే డిపాజిట్ల మినిమం రెన్యువల్ పీరియడ్ 15 రోజులుగా ఉంది.
* సవరణ తరువాత అందే వడ్డీ రేట్లు
ఏడు రోజుల నుంచి 45 రోజుల మెచూరిటీతో చేసే రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కెనరా బ్యాంక్ 2.9 శాతం వడ్డీ అందిస్తోంది. 46 రోజుల నుంచి 90 రోజులు, 91 రోజుల నుంచి 179 రోజుల వరకు చేసే ఎఫ్‌డీలపై వరుసగా 3.90 శాతం, 3.95 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 180 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధి ఉండే ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితితో చేసే FDలపై 5.10 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. మూడేళ్ల నుంచి ఐదు సంవత్సరాల కంటే తక్కువ మెచూరిటీ ఉండే ఎఫ్‌డీలపై కెనరా బ్యాంక్ 5.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాల కంటే ఎక్కువ మెచూరిటీతో చేసే డిపాజిట్లపై కూడా ఈ బ్యాంకు 5.25 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.
SBI Education loan: విదేశీ విద్యకు ఎస్బీఐ స్పెషల్ ఎడ్యుకేషన్ లోన్.. పూర్తి వివరాలు
కెనరా బ్యాంక్ ప్రత్యేకంగా 1111 రోజుల రిటైల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ని అందిస్తోంది. దీని ద్వారా డిపాజిటర్లు అదనంగా 0.10 శాతం వడ్డీ పొందవచ్చు. ఈ పథకం కింద డిపాజిటర్లకు 5.35 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీ పొందవచ్చు. అయితే వీరు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంతో, 180 రోజుల కంటే ఎక్కువ కాలపరిమితితో చేసే డిపాజిట్లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
కెనరా టాక్స్ సేవర్ డిపాజిట్ స్కీమ్ డిపాజిట్లపై ఈ బ్యాంకు 5.25 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే ఇందులో అత్యధికంగా రూ.1.50 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. రికరింగ్ డిపాజిట్‌లకు కూడా ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఖాతాదారులు మరిన్ని వివరాల కోసం కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Canara Bank