UPI | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న కెనరా బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. క్రెడిట్ కార్డును (Credit Card) యూపీఐ యాప్‌తో లింక్ చేసుకునే సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం కెనరా బ్యాంక్ (Canara Bank) తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
కెనరా బ్యాంక్ ఈ కొత్త సర్వీసుల వల్ల బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఇంట్లో మరిచిపోయినా కూడా యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. కెనరా బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. దీంతో కస్టమర్లు ఇకపై వారి రూపే క్రెడిట్ కార్డులను భీమ్ యూపీఐ యాప్‌తో లింక్ చేసుకోవచ్చు.
బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట.. దిగొచ్చిన ధరలు, షాకిచ్చిన వెండి!
కస్టమర్లు వారి క్రెడిట్ కార్డులోని లిమిట్ ద్వారా యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై సులభంగా ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. జేబులో ఫిజికల్ కార్డు లేకున్నా పేమెంట్ చేసేయొచ్చు. అదేసమయంలో మర్చంట్లు కూడా పీఓఎస్ మెషీన్ లేకుండానే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్లను స్వీకరించొచ్చు. స్కాన్ అండ్ పే క్యూఆర్ కోడ్ ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా భీమ్ యూపీఐ ద్వారా ట్రాన్సాక్షనల్ పూర్తి చేయొచ్చు.
ఉద్యోగులకు మోదీ అదిరిపోయే ఉగాది కానుక.. ఈ రోజు కీలక ప్రకటన?
ప్రస్తుతం కెనరా బ్యాంక్ కస్టమర్లు వారికి చెందిన రూపే క్లాసిక్, రూపే ప్లాటినం, రూపే సెలెక్ట్ కార్డులను మాత్రమే యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం కస్టమర్లు ఎలా అయితే వారి బ్యాంక్ అకౌంట్లను యూపీఐ యాప్‌తో లింక్ చేసుకుంటారో.. అలానే క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానం చేసుకోవచ్చని బ్యాంక్ వెల్లడించింది. అయితే అనుసంధానం చేసుకునే సమయంలో కస్టమర్లు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలని పేర్కొంది.
యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏవి అయితే ఉన్నాయో అలాంటి పరిమితులే ఈ క్రెడిట్ కార్డు యూపీఐ లావాదేవీలకు కూడా వర్తిస్తుందని కెనరా బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుతం యూపీఐ క్రెడిట్ కార్డు సర్వీసుల ద్వారా మర్చంట్లకు మాత్రమే పేమెంట్ చేసే ఛాన్స్ ఉంది. పర్సన్ టు పర్సన్, కార్డు టు కార్డు, క్యాష్ ఔట్ ట్రాన్సాక్షన్లకు అనుమతి లేదు. అందువల్ల ఎవరైతే వారి క్రెడిట్ కార్డును యూపీఐ యాప్‌లో లింక్ చేసుకుంటున్నారో ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. కాగా ఇప్పటికే హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వంటివి యూపీఐ క్రెడిట్ కార్డు సర్వీసులను కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, BHIM UPI, Canara Bank, Credit card, UPI