హోమ్ /వార్తలు /బిజినెస్ /

MCLR Hike: కస్టమర్లకు భారీ షాకిచ్చిన బ్యాంక్.. ఒకేసారి 2 కీలక నిర్ణయాలు!

MCLR Hike: కస్టమర్లకు భారీ షాకిచ్చిన బ్యాంక్.. ఒకేసారి 2 కీలక నిర్ణయాలు!

 MCLR Hike: కస్టమర్లకు భారీ షాకిచ్చిన బ్యాంక్.. ఒకేసారి 2 కీలక నిర్ణయాలు!

MCLR Hike: కస్టమర్లకు భారీ షాకిచ్చిన బ్యాంక్.. ఒకేసారి 2 కీలక నిర్ణయాలు!

Loan | మీరు లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? లేదంటే ఇప్పటికే బ్యాంక్ నుంచి రుణం పొందారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? తాాజాగా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

EMI | బెంగళూరు కేంద్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ (Canara Bank) తాజాగా కస్టమర్లకు షాకిచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో బ్యాంక్ (Bank) నుంచి లోన్ (Loan) తీసుకునే వారిపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే లోన్ తీసుకున్న వారిపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది.

కెనరా బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. నవంబర్ 7 నుంచే ఈ రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చేసింది. అంతేకాకుండా బ్యాంక్ మరో నిర్ణయం కూడా తీసుకుంది. రెపో లింక్డ్ రిటైల్ లెండింగ్ రేట్లను కూడా పెంచేసింది. సోమవారం నుంచే వీటి కూడా అమలులోకి వచ్చింది. అంటే బ్యాంక్ ఒకేసారి రెండు కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవచ్చు.

ఈ 10 కార్లకు యమ క్రేజ్.. జనాలు ఎగబడి కొనేస్తున్నారు

కెనరా బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.1 శాతానికి చేరింది. అలాగే రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ల్ఎల్ఎల్ఆర్) 8.8 శాతానికి ఎగసింది. అంటే రుణ గ్రహీతల ఈఎంఐలు పైకి చేరనున్నాయి. కొత్తగా లోన్ తీసుకోవాలని భావిస్తే అధిక రుణ రేటు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర, ఈరోజు ఎంత తగ్గిందంటే?

కెనరా బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ 20 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఇది 8.1 శాతానికి చేరింది. ఇదివరకు ఈరేటు 7.9 శాతంగా ఉండేది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతానికి పెరిగింది. ఇదివరకు ఈ రేటు 7.8 శాతంగా ఉంది. అలాగే ఓవర్‌ నైట్, నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు అయితే 7.05 శాతం నుంచి 7.25 శాతానికి చేరాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. 7.4 శాతం నుంచి 7.55 శాతానికి ఎగసింది. ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 8.8 శాతానికి ఎగసింది.

హోమ్ లోన్ తీసుకునే మహిళలకు వడ్డీ రేటు 8.55 శాతం నుంచి 10.75 శాతం వరకు ఉంది. ఇతరులకు ఈ వడ్డీ రేటు 8.6 శాతం నుంచి 10.8 శాతం వరకు పడుతుంది. ఆర్ఎల్ఎల్ఆర్ కింద హోమ్ లోన్ తీసుకునే వారికి ఈ రేటు వర్తిస్తుంది. అంటే మహిళలకు తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాగా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంతో బ్యాంకులు అన్నీ రుణ రేట్లు పెంచుతూ వెళ్తున్నాయి. ఇప్పుడు కెనరా బ్యాంక్ కూడా ఈ జాబితాలోకి చేరింది.

First published:

Tags: Bank, Canara Bank, EMI, Home loan

ఉత్తమ కథలు