హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank news: కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్.. కీలక నిర్ణయం, ఈరోజు నుంచి..

Bank news: కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్.. కీలక నిర్ణయం, ఈరోజు నుంచి..

Bank news: కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్.. కీలక నిర్ణయం, ఈరోజు నుంచి..

Bank news: కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్.. కీలక నిర్ణయం, ఈరోజు నుంచి..

Canara Bank MCLR Hike | ప్రభుత్వ రంగ ప్రముఖ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. రుణ రేట్లు పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్ల పెంపు ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Interest Rates | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ (Bank) కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. రుణ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నెలవారీ లోన్ (Loan) ఈఎంఐ పెరగనుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాని భావిస్తే.. అధిక రుణ రేట్లు చెల్లించుకోవాల్సి వస్తుంది.

కెనరా బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుంది. ఈ రుణ రేట్ల పెంపు నిర్ణయం జనవరి 7 నుంచి అమలులోకి వచ్చింది. రేట్ల పెంపు తర్వాత చూస్తే.. ఓవర్ నైట్, నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.85 శాతంగా ఉంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ అయితే 8.2 శాతంగా ఉంది. ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి చేరింది.

లక్ష్మీ కటాక్షం అంటే ఇదే.. రూ.1 షేరుతో రూ.50 లక్షల లాభం!

ఈ కొత్త రేట్లు కొత్తగా తీసుకునే రుణాలకు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది. అలాగే రెన్యూవల్, రీసెట్ డేట్ తర్వాత కూడా ఈ కొత్త రుణ రేట్లు అమలులోకి వస్తాయని పేర్కొంది. మళ్లీ బ్యాంక్ తదుపరి సమీక్ష జరిపేంత వరకు ఈ రుణ రేట్లే అమలులో ఉంటాయని కెనరా బ్యాంక్ వెల్లడించింది. బ్యాంకులు సాధారణంగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును రుణాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. రేటును రిస్క్ ప్రీమియం, మార్జిన వంటివి కలుపుకొని రుణ రేట్లను నిర్ణయిస్తాయి.

కస్టమర్లకు భారీ షాక్.. ఈ 9 సర్వీసులపై చార్జీలు పెంచేసిన బ్యాంక్!

అలాగే కెనరా బ్యాంక్ బేస్ రేటు 8.95 శాతంగా ఉంది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్) 14.45 శాతంగా ఉంది. అలాగే బ్యాంక్ షార్ట్ టర్మ్ రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.25 శాతంగా కొనసాగతుతోంది. అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు కూడా 6.25 శాతంగా ఉంది. కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్లను పెంచుకుంటూ వెళ్లడంతో బ్యాంకులు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. రెపో రేటు పెరగడం వల్ల రుణ రేట్లు కూడా పైకి కదులుతున్నాయి. దీంతో బ్యాంక్ రుణ గ్రహాతలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. నెలవారీ ఈఎంఐ భారం పెరుగుతూ వస్తోంది. అలాగే కొత్తగా లోన్ తీసుకునే వారు అధిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

First published:

Tags: Bank news, Banks, Canara Bank, EMI, Mclr

ఉత్తమ కథలు