రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల వరుసగా రెపో రేట్లను పెంచడంతో.. అన్ని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను (Interest Rates) పెంచుతున్నాయి. ప్రధాన బ్యాంకులన్నీ ఇప్పటికే టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. తాజాగా ప్రభుత్వ రంగ రుణదాత కెనరా బ్యాంక్ (canara bank) కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు 2022 అక్టోబర్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మెచూరిటీ ఉండే డిపాజిట్లపై ఈ బ్యాంకు సాధారణ ప్రజలకు 3.25% నుంచి 7.00%.. సీనియర్ సిటిజన్లకు 3.25% నుంచి 7.50% వరకు వడ్డీ అందిస్తోంది. అయితే రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ ఉండే డిపాజిట్లకు మాత్రమే పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు బ్యాంక్ పేర్కొంది.
కొత్త వడ్డీ రేట్ల వివరాలు..
- 7 రోజుల నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 35 బేసిస్ పాయింట్లు (bps) పెరిగి.. 3.25 శాతానికి చేరుకుంది.
- 46 రోజుల నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 25 bps పెరిగింది. దీంతో గతంలో ఉన్న 4 శాతం నుంచి తాజా రేటు 4.25 శాతానికి పెరిగింది.
- 91 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై కొత్త వడ్డీ 45 బేసిస్ పాయింట్ల వరకు పెరిగింది. వడ్డీరేటు గతంలో ఉన్న 4.05 శాతం నుంచి 4.50 శాతానికి పెరిగింది.
Loan: పెరగనున్న ఈఎంఐలు.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. రేపటి నుంచి అమలులోకి!
- 180 రోజుల నుంచి 269 రోజుల టర్మ్ డిపాజిట్లపై ఇప్పుడు వడ్డీ రేటు 125 బేసిస్ పాయింట్లు పెరిగి.. గతంలో ఉన్న 4.65% నుంచి 5.90 శాతానికి చేరుకుంది.
- 270 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీరేటు 4.65% నుంచి 6.00%కి పెరిగింది.
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంక్ 5.50% నుంచి 6.50%కి పెంచింది
- 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ గడువుతో.. 2 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.55% నుంచి 6.50% వరకు పెరిగింది.
- 666 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6% నుంచి 7.00%కి పెరిగింది
- 2 సంవత్సరాల నుంచి మూడేళ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.60% నుంచి 6.50కి పెరిగింది.
- మూడు నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 5.75% నుంచి 6.50%కి; ఐదు నుంచి పదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ 5.75% నుంచి 7 శాతానికి పెరిగింది.
- డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Canara Bank, Rbi