CANARA BANK HIKES FIXED DEPOSIT RATES CHECK LATEST FD RATES HERE GH VB
Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ప్రముఖ బ్యాంక్.. తాజా వడ్డీ రేట్లను పరిశీలించండి..
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రభుత్వ రంగ బ్యాంక్ తన ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది. వివిధ మెచ్యూరిటీల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంక్ ఏంటి.. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్(Canara Bank) తన ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది. వివిధ మెచ్యూరిటీల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై(Fixed Deposits) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా సవరణ తర్వాత, 7నుంచి 45 రోజుల మెచ్యూరిటీ వ్యవధి కలిగిన టర్మ్ డిపాజిట్లపై(Term Deposits) 2.90% వడ్డీ రేటును అందిస్తుంది. ఇక, 46 నుంచి -90 రోజులకు 3.93 శాతం , 91 రోజుల నుండి 179 రోజుల వరకు 3.95 శాతం, 180 రోజుల నుండి ఏడాది వరకు 4.40 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (Deposits) ఏడాది కాల వ్యవధికి వడ్డీ రేటు 5.1 శాతానికి పెంచగా, ఏడాది నుంచి -రెండేళ్ల వరకు 5 శాతం నుంచి 5.15 శాతానికి పెంచింది. ఇక, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) 5.25 శాతం నుండి 5.20 శాతం వరకు, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 5.45 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
మరోవైపు, 5- నుంచి 10 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 25 బేసిస్ పాయింట్ల పెంపును ప్రకటించింది. ఈ వ్యవధిలో 5.5 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై మాత్రమే తాజా వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు 1 మార్చి 2022 నుండి వర్తిస్తాయి.
వడ్డీ రేట్ల సవరణ తర్వాత, సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.90% నుండి 6% వరకు వడ్డీ రేటును పొందుతారు. ఫిబ్రవరి నెలలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.