హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD Rates: కస్టమర్లకు బంపర్ గిఫ్ట్.. బ్యాంక్ కీలక నిర్ణయం!

FD Rates: కస్టమర్లకు బంపర్ గిఫ్ట్.. బ్యాంక్ కీలక నిర్ణయం!

FD Rates: ఈ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ గిఫ్ట్.. ఇకపై..

FD Rates: ఈ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ గిఫ్ట్.. ఇకపై..

Bank News | ప్రభుత్వ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లు పెంచేసింది. దీంతో అధిక రాబడి లభించనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Fixed Deposits | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. రూ. 2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు (FD Rates) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎఫ్‌డీ రేట్ల పెంపు అమలులోకి వచ్చంది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు (Money) దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి అధిక రాబడి వస్తుంది.

కెనరా బ్యాంక్ తాజా ఎఫ్‌డీ రేట్లను గమనిస్తే.. 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 3.25 శాతం నుంచి 7.15 శాతం వరకు ఉంది. రెగ్యులర్ కస్టమర్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.65 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. 400 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.15 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ రేటు 7.65 శాతంగా ఉంది. నాన్ కాలబుల్ డిపాజిట్లకు అయితే (రూ. 15 లక్షలకు పైన) బ్యాంక్ 7.45 శాతం వడ్డీని అందిస్తోంది. 400 రోజుల ఎఫ్‌డీలకే ఇది వర్తిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్‌కు 7.75 శాత వడ్డీ వస్తుంది.

డబ్బులు పంపిస్తే రూ.5 వేల క్యాష్‌బ్యాక్, ఉచిత సిమ్.. ఆఫర్ అదిరింది!

అలాగే 666 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. 2 ఏళ్లు లేదా ఆపైన టెన్యూర్ నుంచి మూడేళ్ల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంది. ఇక సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డ రేటు 7.3 శాతంగా కొనసాగుతోంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఎప్‌డీలపై అయితే వడ్డీ రేటు 6.5 శాతంగానే ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు 7 శాతం వడ్డీ లభిస్తుంది.

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి బంపరాఫర్.. రూ.85 వేల భారీ తగ్గింపు, ఒక్కసారి చార్జ్ చేస్తే 450 కి.మి వెళ్లొచ్చు!

కాగా బ్యాంకులు వరుసపెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచుకుంటూ వస్తున్నాయి. ఆర్‌బీఐ కీలక రెపో రేటును పెంచుకుంటూ రావడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచేశాయి. ఇప్పుడు తాజాగా కెనరా బ్యాంక్ కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో కస్టమర్లకు ఊరట కలుగనుంది.

First published:

Tags: Banks, Canara Bank, FD rates, Fixed deposits, Personal Finance

ఉత్తమ కథలు