Canara Bank FD Rates: డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను కొంత వరకు తగ్గించింది. వివిధ మెచూరిటీ గడువు ఉండే డిపాజిట్లపై ఐదు నుంచి పది బేసిస్ పాయింట్లు (bps) వడ్డీని తగ్గించినట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: November 18, 2020, 4:27 PM IST
Canara Bank FD Rates: డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన కెనరా బ్యాంక్
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కెనరా బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. తాజా వడ్డీ రేట్లు నవంబర్ 16 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను కొంత వరకు తగ్గించింది. వివిధ మెచూరిటీ గడువు ఉండే డిపాజిట్లపై ఐదు నుంచి పది బేసిస్ పాయింట్లు (bps) వడ్డీని తగ్గించినట్లు ప్రకటించింది. తాజా సమరణల తరువాత ఏడు నుంచి 45 రోజుల వరకు మెచూరిటీ ఉండే టర్మ్ డిపాజిట్లపై కెనరా బ్యాంక్ 2.95 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మెచూరిటీ గడువు 46 నుంచి 90 రోజులు ఉండే డిపాజిట్లపై 3.9 శాతం, 91 నుంచి 179 రోజులకు నాలుగు శాతం వడ్డీని వినియోగదారులు పొందవచ్చు. 180 రోజుల నుంచి ఒక సంవత్సరం కన్నా తక్కువ మెచూరిటీ ఉండే ఎఫ్‌డీలపై 4.45 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందని బ్యాంకు వెల్లడించింది.

ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల లోపు మెచూరిటీ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే కెనరా బ్యాంక్ వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించింది. ఒక సంవత్సరంలో మెచూరిటీ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 5.25 వడ్డీని ఇస్తోంది. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే డిపాజిట్లపై బ్యాంక్ 5.20 వడ్డీ రేటును అందిస్తుంది. మూడు నుంచి పదేళ్ల గడువు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.30 శాతం వడ్డీ రేటును ఖాతాదారులు పొందవచ్చు.

సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ

తాజా సమీక్ష తరువాత సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.95 శాతం నుంచి 5.80 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తుంది. సాధారణ వినియోగదారులతో పోలిస్తే, 180 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచూరిటీ అయ్యే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని ఇస్తున్నట్లు కెనరా బ్యాంకు తెలిపింది. ఇంతకుముందు అక్టోబర్ 1న కూడా ఈ బ్యాంకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. ప్రైవేట్ రంగంలో పెద్ద బ్యాంకులుగా ఉన్న ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను సవరించాయి. తాజా వడ్డీ రేట్లు నవంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చాయి.
Published by: Krishna Adithya
First published: November 18, 2020, 4:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading