CANARA BANK ANNOUNCES 3 LOAN SCHEMES AMID FIGHT AGAINST COVID 19 MK GH
Canara Bank: కెనరా బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..కొత్తగా మూడు లోన్ పథకాలు
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా మహమ్మారికి వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ ముందడుగు వేసింది. కరోనా విపత్కర సమయంలో రుణం తీసుకోవాలనుకునే వారి కోసం మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. దీని కింద వ్యక్తులకు హెల్త్ కేర్ క్రెడిట్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్లను అందిస్తుంది.
కరోనా మహమ్మారికి వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ ముందడుగు వేసింది. కరోనా విపత్కర సమయంలో రుణం తీసుకోవాలనుకునే వారి కోసం మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. దీని కింద వ్యక్తులకు హెల్త్ కేర్ క్రెడిట్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్లను అందిస్తుంది. ఈ పథకాల ద్వారా కనిష్టంగా రూ. 25 వేలు, గరిష్టంగా రూ.50 కోట్ల వరకు తక్కువ వడ్డీరేట్లకే రుణాలిచ్చేందుకు ముందుకొచ్చింది. 10 సంవత్సరాల వరకు రాయితీతో కూడిన వడ్డీ రేట్లను అందించడమే కాకుండా 18 నెలల మారిటోరియం ఆప్షన్ కూడా అందిస్తున్నట్లు కెనరా బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కెనరా బ్యాంక్ ఆఫర్ చేస్తున్న మూడు రుణ పథకాలను పరిశీలిద్దాం.
హెల్త్‌కేర్ క్రెడిట్ లోన్
ఈ పథకం కింద రూ. 10 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయం పొందవచ్చు. గుర్తింపు పొందిన ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, మెడికల్ ప్రాక్టీషనర్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్‌లు, హెల్త్ కేర్ సర్వీసింగ్ సెంటర్లను నెలకొల్పేందుకు రూ .10 లక్షల నుంచి రూ .50 కోట్ల వరకు రుణాలు అందిస్తుంది. ఈ రుణాల కాలపరిమితి 10 ఏళ్ల వరకు ఉంటుంది. 18 నెలల వరకు మారిటోరియం కూడా వర్తిస్తుంది. 2022 మార్చి 31 వరకు ఈ లోన్ అందుబాటులో ఉంటుంది.
బిజినెస్ లోన్
ఈ పథకం కింద రూ.2 కోట్ల వరకు రాయితీ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లకు మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉత్పత్తి, సరఫరా చేసే వారికి ఈ రుణాలు అందజేస్తారు. ఈ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదని కెనరా బ్యాంక్ తెలిపింది. అయితే, ఎంఎస్ఎంఈ రుణాలకు థర్డ్ పార్టీ హామీ అవసరం లేదు. నాన్ ఎంఎస్ఎంఈలకు మాత్రం 25 శాతం హామీ ఇవ్వాల్సిందే. 2022 మార్చి31 వరకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి.
సురక్ష పర్సనల్ లోన్
ఈ లోన్‌పై రూ. 25 వేల నుంచి 5 లక్షల వరకు తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. కరోనా చికిత్సకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే ఖర్చులకు ఈ నిధులను వాడుకోవచ్చు. ఈ లోన్లకు 6 నెలల మారిటోరియం వర్తిస్తుంది. వీటికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. బెంగళూరు ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశంలో కెనరా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్ ఈ కొత్త పథకాలను ప్రవేశపెట్టింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.