ATM: డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి

Canara Bank | కెనెరా బ్యాంక్ మాత్రమే కాదు... ఇతర బ్యాంకులు కూడా కస్టమర్ల డబ్బులు మరింత రక్షణ కల్పించేందుకు ఇలాంటి చర్యలే తీసుకుంటున్నాయి.

news18-telugu
Updated: August 27, 2019, 4:37 PM IST
ATM: డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి
ATM: డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి (image: Canara Bank)
  • Share this:
ఏటీఎం కేంద్రంగా జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కెనెరా బ్యాంక్ వినూత్నమైన ప్రయోగం చేస్తోంది. ఇకపై ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా ఓటీపీ తప్పనిసరి చేసింది కెనెరా బ్యాంక్. ఇలా ఏటీఎం విత్‌డ్రాయల్స్‌కు ఓటీపీ ఫెసిలిటీ కల్పించిన మొదటి బ్యాంక్ ఇదే. కెనెరా బ్యాంక్ ఏటీఎంలల్లో ఒక రోజులో రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. అనధికారిక ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈ అదనపు ఫీచర్ ఉపయోగపడుతుందని కెనెరా బ్యాంక్ భావిస్తోంది. ఒకవేళ మీ డెబిట్ కార్డు ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా వారికి మీ పిన్ తెలిసినంత మాత్రానా డబ్బులు డ్రా చేయడం సాధ్యం కాదు.





ఏదైనా ఏటీఎంలో మీరు డబ్బులు డ్రా చేసినప్పుడు మీ కార్డ్ స్కిమ్మింగ్ లేదా క్లోనింగ్ చేసి, ఆ వివరాలతో మరో కార్డ్ తయారు చేసినా సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ నుంచి ఎక్కువగా డబ్బులు డ్రా చేయలేరు. ఒక రోజులో రూ.10,000 లోపే డ్రా చేస్తే ఓటీపీ అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ డ్రా చేయాలనుకుంటే ఓటీపీ కావాలి. అంటే మీరు ఒకవేళ మోసపోయినా రూ.10,000 లోపే డబ్బులు పోగొట్టుకోవచ్చు. మీరు అప్రమత్తంగా ఉంటే అసలు మోసపోయే అవకాశమే ఉండదు. ఇక కెనెరా బ్యాంక్ MServe యాప్ ద్వారా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌ని స్విచ్ ఆఫ్ చేసే సదుపాయం కల్పించింది. కెనెరా బ్యాంక్ మాత్రమే కాదు... ఇతర బ్యాంకులు కూడా కస్టమర్ల డబ్బులు మరింత రక్షణ కల్పించేందుకు ఇలాంటి చర్యలే తీసుకుంటున్నాయి. ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రాయల్స్ విషయంలో సెక్యూరిటీ ఫీచర్స్‌ని అదనంగా జోడిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో క్యాష్‌ సదుపాయాన్ని కస్టమర్లకు కల్పించింది. అసలు ఏటీఎం కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే కస్టమర్లు ఎస్‌బీఐ యోనో క్యాష్ పాయింట్స్‌లో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇందుకోసం యోనో యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. యోనో క్యాష్ పాయింట్‌లో ఏటీఎం కార్డు అవసరం లేకుండా కేవలం ఆరు అంకెల పిన్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు. యోనో క్యాష్‌లో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉండటంతో మోసాలు జరగడం అసాధ్యం. అంతేకాదు... కార్డు స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలకు అడ్డుకట్ట కూడా పడింది. ఎస్‌బీఐ కస్టమర్లు డెబిట్ కార్డు ఉపయోగించకుండా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Traffic Fines: సెప్టెంబర్ 1 నుంచి మారే ట్రాఫిక్ ఫైన్స్ ఇవే...

Aadhaar: పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చండి ఇలా...

LIC Jeevan Amar: రూ.10,800 ప్రీమియంతో రూ.1 కోటి బీమా... ఎల్ఐసీ కొత్త పాలసీ వివరాలివే
First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు