హోమ్ /వార్తలు /బిజినెస్ /

Wastage Of Gold: ఆభరణాల తయారీలో గోల్డ్‌ వేస్టేజ్‌ను మేకింగ్ ఛార్జెస్‌గా పరిగణించి TDS విధించవచ్చా? ITAT చెబుతోంది ఇదే..

Wastage Of Gold: ఆభరణాల తయారీలో గోల్డ్‌ వేస్టేజ్‌ను మేకింగ్ ఛార్జెస్‌గా పరిగణించి TDS విధించవచ్చా? ITAT చెబుతోంది ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బంగారం వృథాను క్లెయిమ్‌ చేయడాన్ని తిరస్కరించి, పన్ను విధించడంపై ఓ వ్యక్తి ఆదాయపన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT)ను ఆశ్రయించారు. చివరికి అతనికి అనుకూలంగా ITAT ఆదేశాలిచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

బంగారం వృథాను క్లెయిమ్‌ చేయడాన్ని తిరస్కరించి, పన్ను విధించడంపై ఓ వ్యక్తి ఆదాయపన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT)ను ఆశ్రయించారు. చివరికి అతనికి అనుకూలంగా ITAT ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా ఆభరణాలు తయారు చేస్తున్న సమయంలో వృథా అయ్యే బంగారాన్ని మేకింగ్‌ ఛార్జెస్‌గా పరిగణించకూడదని ఆదాయపన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT), చెన్నై తెలిపింది. అటువంటి వృథా మొత్తంపై TDS డిడక్ట్‌ చేయకూడదని పేర్కొంది. సెక్షన్ 194C నిబంధనలు అసెస్సీకి వర్తించవని చెప్పింది. 2022 ఆగస్ట్ 24 నాటి ఓ అసెస్సింగ్ ఆఫీసర్ (AO) ఆసక్తికరమైన ఆర్డర్‌ను ITAT తోసిపుచ్చింది. ఆ ఆర్డర్‌లో స్వర్ణకారుడు మేకింగ్ ఛార్జెస్‌గా పరిగణించి ఉంచుకున్న వృథా అయిన బంగారానికి కూడా సెక్షన్ 194C కింద TDS వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ కేసు వివరాలు, ITAT సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కేసు ఏంటి?

అసెస్సీ బంగారం, వెండి ఆభరణాలు తయారు చేస్తారు. అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లో, అసెస్సీ కస్టమర్ల నుంచి పాత బంగారాన్ని కొనుగోలు చేశారని, ఆ బంగారం నుంచి స్వచ్ఛమైన బంగారాన్ని పొందడానికి స్వర్ణకారుల ద్వారా కరిగించారని AO గుర్తించారు. ITAT ఆర్డర్‌లో పేర్కొన్న కేసు వాస్తవాల ప్రకారం.. 2013-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో కొత్త ఆభరణాల తయారీ కోసం అసెస్సీ స్వర్ణకారులకు 146331.79 గ్రాముల బంగారాన్ని ఇచ్చాడు. అయితే పాత బంగారాన్ని కరిగించగా 141397.61 గ్రాములను మాత్రమే తిరిగి పొందారు. మిగిలిన 1294.66 గ్రాములు స్వర్ణకారుల వద్దే ఉండిపోయింది. ఈ ప్రక్రియలో 5454.03 గ్రాముల బంగారం వృథా అయినట్లు అసెస్సీ క్లెయిమ్ చేశారు.

అదేవిధంగా 2014-15 అసెస్‌మెంట్ ఇయర్‌లో.. తయారీ ప్రక్రియలో 1286.03 గ్రాముల బంగారం వృథా అయినట్లు అసెస్సీ క్లెయిమ్ చేశారు. అన్ని ఇతర ఆభరణాలకు, అసెస్సీ 4.5% నుంచి 6% మధ్య ఛార్జీలు చూపించారని, అయితే వృథా కేవలం 0.5% నుంచి 1% వరకు ఉంటుందని AO పేర్కొన్నారు. స్వర్ణకారుల వద్ద ఉండిపోయిన బంగారానికి కూడా అదనంగా క్లెయిమ్‌ చేసినట్లు చెప్పారు.

స్వర్ణకారుల స్టేట్‌మెంట్ రికార్డింగ్ సమయంలో.. AOకి విరుద్ధమైన స్టేట్‌మెంట్‌లు అందాయి. అక్కడ కొందరు 5% నుంచి 6% వరకు వృథా అవుతుందని క్లెయిమ్ చేయగా, మరికొందరు 0.5% నుంచి 1% వరకు మాత్రమే వృథా అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194C కింద పన్ను మినహాయించకుండా AO ఈ వేస్టేజ్‌ను స్వర్ణకారులకు పేమెంట్‌గా పరిగణించారు. నగదు లేదా చెక్‌లో పరిగణనలోకి తీసుకోనప్పుడు ట్యాక్స్‌ డిడక్ట్‌ చేయాల్సిన అవసరం లేదన్న అసెస్సీ వాదనను AO తిరస్కరించారు. బంగారం వృథా అనేది స్వర్ణకారుడు కలిగి ఉన్న బంగారంలో 1%కి పరిమితం చేసినట్లు, ఈ 1% కంటే ఎక్కువ వృథా చేస్తే మేకింగ్‌ ఛార్జీలకు వసూలు చేసినట్లు పరిగణించాలని AO చెప్పారు.

CIT (A) ముందు AO ఉత్తర్వును అసెస్సీ సవాలు చేశారు. CIT (A) దాదాపు అందరు స్వర్ణకారులు AO ముందు ఒప్పుకున్నారని, తయారీ ప్రక్రియలో వారు దాదాపు 5% ఇన్‌పుట్‌లో బంగారాన్ని ఉంచుకుంటారని, దాన్ని అసెస్సీ వేస్టేస్‌గా పరిగణించారని చెప్పింది. CIT (A) ప్రకారం.. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194C ప్రకారం అసెస్సీ ఈ వృథాను క్లెయిమ్ చేయడంపై TDA డిడక్ట్‌ చేయాలని పేర్కొంది. CIT (A)ఆర్డర్‌తో అసంతృప్తికి గురైన అసెస్సీ.. ITAT ముందు అప్పీల్ చేశారు.

ITAT ఏమి చెప్పింది?

నగదు, చెక్కు లేదా డ్రాఫ్ట్‌ల ద్వారా లేదా మరేదైనా రూపంలో పేమెంట్‌ చేయకుండా.. తయారీ సమయంలో వృథా అయిందని పేర్కొన్న బంగారంపై TDS డిడక్ట్‌ చేయకూడదని పేర్కొంది. ప్రస్తుత కేసులో రెవెన్యూ అంచనా వేసినట్లుగా 0.5% నుంచి 1% లేదా అసెస్సీ క్లెయిమ్ చేసినట్లుగా 4.5% నుంచి 6% వరకు బంగారం వృథా అయినా.. నగదు రూపంలో, ఇతర ఏవిధమైన పేమెంట్‌ జరగలేదని తెలిపింది. అందువల్ల TDS u/s.194C యాక్ట్‌ వర్తించదని స్పష్టం చేసింది. AO, CIT(A) ఉత్తర్వులను తోసిపుచ్చింది.

First published:

Tags: Gold, Tds

ఉత్తమ కథలు