హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Tax Regime: కొత్త పన్ను విధానం ఎంచుకున్న తర్వాత పాత విధానంలోకి వెళ్లొచ్చా?

New Tax Regime: కొత్త పన్ను విధానం ఎంచుకున్న తర్వాత పాత విధానంలోకి వెళ్లొచ్చా?

New Tax Regime: కొత్త పన్ను విధానం ఎంచుకున్న తర్వాత పాత విధానంలోకి వెళ్లొచ్చా?
(ప్రతీకాత్మక చిత్రం)

New Tax Regime: కొత్త పన్ను విధానం ఎంచుకున్న తర్వాత పాత విధానంలోకి వెళ్లొచ్చా? (ప్రతీకాత్మక చిత్రం)

New Tax Regime | బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేయడంతో పన్నుచెల్లింపుదారుల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంచుకున్న తర్వాత పాత పన్ను విధానంలోకి మారే అవకాశం ఉంటుందా లేదా అన్నది ప్రధాన సందేహం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం (New Tax Regime) డిఫాల్ట్‌గా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023-24 (Budget 2023-24) ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకైతే పాత పన్ను విధానం (Old Tax Regime) డిఫాల్ట్‌గా ఉంది. కొత్త పన్ను విధానం ఆప్షనల్ మాత్రమే. పన్ను చెల్లింపుదారులు కావాలనుకుంటే కొత్త పన్ను విధానం ఎంచుకోవచ్చు. కానీ రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఉంటుంది. పాత పన్ను విధానం ఆప్షనల్ అవుతుంది. పాత పన్ను విధానంలో కొనసాగాలనుకునేవారు ఈ ఆప్షన్ ఎంచుకోవడం తప్పనిసరి. లేకపోతే కొత్త పన్ను విధానం ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.

మరి కొత్త పన్ను విధానం ఎంచుకున్నవాళ్లు తర్వాతి ఏడాది పాత విధానంలోకి వెళ్లొచ్చా? లేకపోతే కొత్త పన్ను విధానం ఎంచుకున్నారు కాబట్టి ఎప్పటికీ అదే విధానంలో ఉంటారా? అన్న సందేహం వేతనజీవుల్లో ఉంది. వేతనజీవులు రెండు పన్ను విధానాల మధ్య ఎన్నిసార్లైనా మారొచ్చు. తాము ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందో రెండు పద్ధతుల్లో లెక్కించి, తమకు ఏది లాభం అనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. ఒకవేళ పాత పన్ను విధానంలో పన్ను ఎక్కువగా ఆదా కానట్టైతే కొత్త ఆప్షన్ ఎంచుకోవడం మంచిదని, పేపర్‌వర్క్, ప్రాసెస్ తక్కువగా ఉంటుందని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ TaxBirbal.com డైరెక్టర్ చేతన్ చందక్ మనీకంట్రోల్‌తో అన్నారు.

Electric Bike: రూ.25 ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం... కొత్త ఎలక్ట్రిక్ బైక్ విశేషాలివే

మరోవైపు వ్యాపారుల పరిస్థితి వేరు. వ్యాపారులు పాత పన్ను విధానంలోకి మారి, మళ్లీ కొత్త పన్ను విధానంలోకి రావడానికి ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతీ ఏడాది తమ నిర్ణయాన్ని మార్చుకునే వీలు లేదు. అయితే భవిష్యత్తులో వ్యాపారాలు మూసివేసే పరిస్థితి వచ్చినప్పుడు, తాము ఎంచుకున్న పన్ను విధానాన్ని మార్చుకునే ఆప్షన్ ఉంటుందని, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, వేతనజీవులకు ఉన్నట్టుగానే అవకాశం ఉంటుందని ట్రూ-వర్త్ ఫిన్‌సల్టెంట్స్ ఫౌండర్ తివేష్ షా వివరించారు.

Income Tax: ఏ ట్యాక్స్ శ్లాబ్‌తో ఎక్కువ పన్ను ఆదా అవుతుందో తెలుసుకోండి

పన్ను విధానంపై ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి?

ఏ పన్ను విధానం ఎంచుకోవాలనే నిర్ణయాన్ని ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తీసుకోవాలి. తర్వాత ఎప్పుడో రిటర్న్స్ ఫైల్ చేస్తాం కదా, తర్వాత ఆలోచిద్దాంలే అనుకోకూడదు. వచ్చే ఏడాది ఫైల్ చేయబోయే రిటర్న్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్ణయం తీసుకొని అందుకు తగట్టుగా సేవింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఉద్యోగులైతే తాము ఏ పన్ను విధానం ఎంచుకోవాలని అనుకుంటున్నామో తమ కంపెనీకి ఇన్వెస్ట్‌మెంట్ డిక్లరేషన్‌లో తెలియజేయాలి. ఈసారి మీరు ఒకవేళ పాత పన్ను విధానం ఎంచుకోవాలనుకుంటే ఆ విషయాన్ని కంపెనీ అడ్మిన్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేయడం మంచిది. అయితే జూలైలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు మీరు మనసు మార్చుకోవచ్చు.

First published:

Tags: Budget 2023, Income tax, Personal Finance, TAX SAVING

ఉత్తమ కథలు