హోమ్ /వార్తలు /బిజినెస్ /

PPF Investments: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే?

PPF Investments: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎవరైనా సరే తాము కష్టపడి సంపాదించుకునే సొమ్మును భద్రంగా ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటారు. వాటి నుంచి మంచి వడ్డీ ఆదాయం, పన్ను మినహాయింపులు ఉండేలా చూసుకుంటారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఎవరైనా సరే తాము కష్టపడి సంపాదించుకునే సొమ్మును భద్రంగా ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటారు. వాటి నుంచి మంచి వడ్డీ ఆదాయం, పన్ను మినహాయింపులు ఉండేలా చూసుకుంటారు. అలాంటి అన్ని బెనిఫిట్లను అందించే స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. రిస్క్ లేని రాబడి, పన్ను మినహాయింపులు, పెట్టుబడికి రాబడికి హామీ ఉండటంతో దీంట్లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే పీపీఎఫ్‌ స్కీమ్‌లో ప్రణాళిక ప్రకారం పెట్టుబడి పెడితే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. అదెలాగో చూడండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ప్రభుత్వ పరిధిలోని చిన్న పొదుపు పథకం. ఇందులో జీతం వచ్చేవారు ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు. అవి మెచ్యూరిటీకి చేరుకున్నప్పుడు అధిక రాబడిని ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం PPF ఖాతాదారుడు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏడాదికి గరిష్ఠంగా లక్ష యాభైవేల రూపాయల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని అందించే రిస్క్‌ లేని పెట్టుబడుల్లో ఇది ఒకటి.

వడ్డీ రేట్ల మార్పులు
PPFలోని పెట్టుబడులకు ప్రస్తుతం ప్రభుత్వం 7.1% వడ్డీని అందిస్తోంది. అయితే ఆ శాతం ప్రతి త్రైమాసికానికి ఓ సారి మారుతూ ఉండొచ్చు. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా ఆ మార్పు ఉంటుంది. అయితే అంచనాలను బట్టి చూస్తే రాబోయే కాలంలో వడ్డీ రేట్లు ఇప్పుడు ఉన్నట్లుగానే, లేదంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Recession: అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందా ? లేదా ?.. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఏం చెప్పిందంటే..

రూ.1 కోటి రాబడి ఎలా?
25 సంవత్సరాల వయస్సులో మీరు PPFలో ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. దాని ద్వారా మీ వార్షిక పెట్టుబడి రూ. 60,000 అవుతుంది. దానికి ప్రభుత్వం ఇప్పుడు 7.1% వడ్డీ రేటును చెల్లిస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే 15 సంవత్సరాలలో రూ. 7,27,284 వడ్డీ పొందుతారు. మొత్తం పెట్టుబడి తొమ్మిది లక్షల రూపాయలు. దీనితో కలిపి మెచ్యూరిటీ తర్వాత మీకు లభించే మొత్తం రూ. 16,27,284. అదే మీరు నెలకు రూ.5,000 చొప్పున పెట్టుబడిని 37 ఏళ్లపాటు కొనసాగిస్తే రూ.22,20,000 పెట్టుబడితో రూ.83,27,232 రాబడి వస్తుంది. మెచ్యూరిటీ సమయంలో అది మొత్తం రూ.1,05,47,232 అవుతుంది.

పీపీఎఫ్‌ అకౌంట్ గురించి..
పోస్టాఫీసు, ఎస్బీఐ, పంజాబ్‌ నేషనల్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ.... తదితర బ్యాంకుల్లో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏడాదికి కనిష్ఠంగా 500 నుంచి గరిష్ఠంగా రూ.1.5లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. PPF గరిష్ట టెన్యూర్‌ 15 సంవత్సరాలు. ఆ కాలాన్ని 37 ఏళ్లకు పొడిగించుకోవాలనుకుంటే, ఇందుకు ఫారమ్‌ 16-Hని ముందుగా నింపాల్సి ఉంటుంది. పీపీఎఫ్‌ అకౌంట్‌ ప్రారంభించిన తర్వాత నుంచి వరుసగా 15, 20, 25, 30, 35 ఏళ్లలో ఈ 16-H రెన్యువల్‌ ఫారమ్‌ని పూర్తి చేసి సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతా తెరిచినప్పుడే నామినీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి పేరుతో ఒక అకౌంట్ మాత్రమే తీసుకునే వీలుంటుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Investments, PPF