హోమ్ /వార్తలు /బిజినెస్ /

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ పై ఇన్వెస్ట్‌ చేస్తున్నారా.. అయితే ఈ వివరాలు మీ కోసమే..

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ పై ఇన్వెస్ట్‌ చేస్తున్నారా.. అయితే ఈ వివరాలు మీ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Digital Gold: ప్రజలకు అందుబాటులో ఉన్న వివిధ రకాల పెట్టుబడి మార్గాల్లో బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజుల్లో డిజిటల్ విధానంలో బంగారాన్ని పెట్టుబడిగా ఎంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ గోల్డ్ డిమాండ్ సంవత్సరానికి 70 శాతం చొప్పున పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...

ప్రజలకు అందుబాటులో ఉన్న వివిధ రకాల పెట్టుబడి మార్గాల్లో బంగారానికి(Gold) ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజుల్లో డిజిటల్(Digital) విధానంలో బంగారాన్ని పెట్టుబడిగా ఎంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ గోల్డ్ డిమాండ్ సంవత్సరానికి 70 శాతం చొప్పున పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ రంగంలో MMTC-PAMP, SafeGold, Dvara SmartGold వంటి సంస్థలు పెట్టుబడిదారులకు సేవలు అందిస్తున్నాయి. కంపెనీల యాప్స్ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఇప్పుడు ఆభరణాల కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. టైటాన్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థలు ఇప్పటికే ఈ విభాగంలో సేవలు అందిస్తున్నాయి. సెన్కో గోల్డ్ & డైమండ్స్ సీఈవో, ఎండీ సువాంకర్ సేన్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిపారు.

Gold Smugling: వామ్మో నోట్లో అంత బంగారం ఎలా పట్టిందిరా బాబు..! ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ బంగారం..


ప్రస్తుతం ఈ పెట్టుబడులు డిజిటల్, ఫిజికల్ గోల్డ్ కలయికతో ఉన్నందువల్ల దీన్ని ఫిజిటల్ గోల్డ్ అని పిలుస్తున్నామని చెబుతున్నారు సువాంకర్. ఈ పెట్టుబడి మార్గాలను ఆయన విశ్లేషించారు. ఇందులో రిడమ్షన్‌ సమయంలో ఏం కోరుకుంటున్నారు, ఎలా రిడీమ్ చేయాలనుకుంటున్నారనే వివరాలను కస్టమర్లు ముందుగా ఎంచుకోవాలి. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రిడీమ్ చేయడానికి స్టోర్‌కు వెళ్లాలనుకుంటున్నారా లేదా కంపెనీల ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రిడీమ్ చేసుకుంటారా.. అనే వివరాలు సైతం అందజేయాలి.

Ig Nobel Prizes: సెక్స్ చేస్తే ముక్కు ఉపశమనంగా ఉంటుందని కనుక్కున్నారు.. నోబెల్ ప్రైజ్ కొట్టేశారు..


కొంత కాలం పాటు చేసిన పెట్టుబడులను కస్టమర్లు రిడీమ్ చేసుకోవచ్చు. అప్పటి బంగారం మార్కెట్ ధర ప్రకారం, కస్టమర్ల వద్ద ఉన్న డిజిటల్ గోల్డ్‌ విలువను లెక్కగడతారు. ఆ రిడమ్షన్‌ విలువతో ఆభరణాలను సైతం కొనుగోలు చేయవచ్చని సువాంకర్ వెల్లడించారు. కస్టమర్లు బంగారాన్ని ఆస్తిగా, పెట్టుబడిగా, భవిష్యత్తు కోసం చేసే పొదుపుగా కొనుగోలు చేయాలనేది తమ కంపెనీ లక్ష్యమని చెప్పారు. ఇలాంటి లక్ష్యాలు కంపెనీలకు, కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు.

Smartphones: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..


‘గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రూ.250 నుంచే స్వీకరిస్తున్నాం. బంగారం లేదా గోల్డ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌లో యుతవరం పెట్టుబడులను, పొదుపు అలవాట్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తక్కువ మొత్తంలో పెట్టుబడులను ప్రవేశపెట్టాం. ఆభరణాలు లేదా బంగారాన్ని కొనుగోలు చేసే ఈ డిజిటల్ విధానంతో కస్టమర్ల సేవింగ్స్ అలవాట్లు మెరుగుపడతాయి. వీటిని ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు. ఇందుకు కఠినమైన ప్రక్రియలు సైతం ఉండవు. కస్టమర్లు తమ అవసరాల ప్రకారం డిజిటల్ గోల్డ్‌ను నిల్వ చేసుకోవచ్చు లేదా రిడీమ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు కూడా..” అంటూ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి వివరించారు సువాంకర్.

Published by:Veera Babu
First published:

Tags: Gold, Investment Plans, Jewellery

ఉత్తమ కథలు