LIC Stock : ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో అతిపెద్ద సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC). భారత ప్రభుత్వ పరిధిలోని ఈ సంస్థ అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉంది. డొమెస్టిక్ బ్రోకరేజ్, పరిశోధన సంస్థ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపిన వివరాల మేరకు.. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో ఎల్‌ఐసీ 37% APE మార్కెట్ వాటాను హోల్డ్ చేస్తోంది. ఈ సంస్థ ఎల్‌ఐసీకి బై రేటింగ్ అందజేస్తూ.. టార్గెట్ ప్రైస్‌గా రూ.1000ని ప్రకటించింది. ఎల్‌ఐసీ అభివృద్ధిపై కోటక్ విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.
36 శాతం ఎక్కువగా టార్గెట్
మంగళవారం ఎల్‌ఐసీ షేర్లు ముగిసిన ప్రైస్ కంటే 36% అధికంగా కోటక్ టార్గెట్‌ను పేర్కొంది. మంగళవారం స్టాక్ 2.6% పెరిగి రూ.734.8 వద్ద ఎండ్ అయింది. మార్జిన్ విస్తరణ, అసమానమైన ఏజెన్సీ ఫోర్స్ ద్వారా ప్రొడక్ట్ మిక్స్‌కి మారడం, VNB(వ్యాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్) వృద్ధిని పెంచడం ఎల్‌ఐసీ అభివృద్ధికి దోహదపడుతాయని కోటక్ విశ్లేషకులు క్లయింట్ నోట్‌లో పేర్కొన్నారు. ఓవరాల్ మీడియం టర్మ్ APE (యాన్యువల్ ప్రీమియం ఈక్విలెంట్) వృద్ధి ఇతర ప్రైవేట్ కంపెనీల కంటే తక్కువగానే ఉందని తెలిపారు. లార్జ్ అన్‌రియలైజ్డ్ ఈక్విటీ గెయిన్స్ (FY2022 EVలో 59%) కూడా LIC EV (ఎంటర్‌ప్రైజ్ వాల్యూ)కి సపోర్ట్ చేస్తుందని, క్యాపిటల్ మార్కెట్ మూవ్‌మెంట్‌కు ఉపయోగపడుతుందని వివరించింది. APE CAGR 13 శాతం, 180 బేసిస్ పాయింట్ మార్జిన్ విస్తరణ కారణంగా FY23-25లో LIC 18 శాతం VNB CAGRని అందజేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
LICకి 1.3 మిలియన్లకు పైగా ఏజెంట్లు ఉన్నారు. భారతదేశంలోని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లలో 54 శాతం వాటా ఎల్‌ఐసీ సొంతం. నిర్వహణలో ఉన్న LIC ఆస్తులు(AUM) 2022 సెప్టెంబరు 30 నాటికి రూ.42.93 లక్షల కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.39.50 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇతర ప్రైవేట్ కంపెనీల ప్రతి ఏజెంట్ సంవత్సరానికి 0.9- 4.2 పాలసీలు చేస్తుంటే, ఎల్ఐసీ సంవత్సరానికి 15.4 పాలసీలతో ఆధిప్యతం కొనసాగిస్తోందని కొటక్ విశ్లేషకులు తెలిపారు.
SBI News: ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ ఊరట.. ఉద్యోగులకు బ్యాంక్ కీలక ఆదేశాలు!
తక్కువ వ్యాల్యూతో ఉన్న షేర్‌లు
దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్‌ఐసీ షేర్లు 2022 మేలో రూ.872 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(IPO) ధర రూ.949 ధర కంటే దాదాపు 8 శాతం తక్కువగా స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్ మొదలైంది. ఇప్పటి వరకు షేర్ కనిష్ట స్థాయి 2022 అక్టోబర్ 21న రూ.588గా నమోదైంది. ప్రైవేట్ రంగ కంపెనీలతో పోలిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్‌లు తక్కువ వ్యాల్యూలో ట్రేడ్ అవుతున్నాయని కోటక్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: LIC