ఫామ్ 16 లేదా? అయినా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు!

మీ దగ్గర ఫామ్ 16 లేదా? కానీ ఇన్‌ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? ఫామ్ 16 లేకున్నా ఐటీఆర్ ఫైల్ చేయడం సాధ్యమే.

news18-telugu
Updated: July 13, 2018, 3:23 PM IST
ఫామ్ 16 లేదా? అయినా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు!
మీ దగ్గర ఫామ్ 16 లేదా? కానీ ఇన్‌ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? ఫామ్ 16 లేకున్నా ఐటీఆర్ ఫైల్ చేయడం సాధ్యమే.
  • Share this:
ప్రస్తుతం పనిచేస్తున్న, లేదా మానేసిన కంపెనీ నుంచి ఫామ్ 16 చేతికి రాని అనుభవాలు చాలామందికి ఉంటాయి. మరి అలాంటప్పుడు ఐటీ రిటర్న్స్‌ ఎలా ఫైల్ చేయాలి? ఇదీ చాలామంది అనుమానం. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫామ్ 16 అవసరమే కానీ... అది లేకపోయినా మీ టీడీఎస్ వివరాలను 26ఏఎస్ ద్వారా పొందొచ్చు. ఈ ఫామ్ భారత ప్రభుత్వ అధికారిక ఇ-ఫైలింగ్ పోర్టల్ incometaxindiaefiling.gov.inలో ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా రిజిస్టర్డ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యాక, లెఫ్ట్ సైడ్‌బార్‌లో ఫామ్ 26ఏఎస్‌పై క్లిక్ చేసి వివరాలు పొందొచ్చు.

ఆ తర్వాత 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పే స్లిప్స్ అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి. పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయాన్ని లెక్కేసేందుకు పేస్లిప్స్ ఉపయోగపడ్తాయి. ఆ తర్వాత మీరు ఏఏ మినహాయింపులకు అర్హులో తెలుసుకోవాలి. మీరు అద్దె చెల్లిస్తున్నట్టయితే హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ పే స్లిప్‌లో హెచ్‌ఆర్‌ఏ గురించి లేకపోయినా మీరు అద్దె చెల్లిస్తున్నట్టయితే హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు వర్తిస్తుంది. అయితే మీరు అద్దె రూపంలో ఆదాయం పొందుతూ ఉన్నా, సొంత ఇల్లు ఉన్నా వర్తించదు. మీరు అద్దె ఒప్పంద పత్రం చూపించి మినహాయింపులు పొందొచ్చు. ఈ కిందివాటిలో ఏది తక్కువ అయితే అది అద్దె మినహాయింపు వర్తిస్తుంది.

(i) మొత్తం ఆదాయంలో 10 % లోపు అద్దె.
(ii) మొత్తం ఆదాయంలో 25%
(iii) నెలకు రూ.5,000

ఇక పీపీఎఫ్, ఈపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, హోమ్ లోన్‌పై వడ్డీ, హోమ్ లోన్‌పై చెల్లించిన అసలు, విద్యారుణంపై వడ్డీ లాంటివన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంతో పాటు సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ, దీర్ఘకాలిక మూలధన లాభం, ఎఫ్‌డీలపై వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్‌లో పొందిన లాభాలు లాంటి ఆదాయ వివరాలన్నీ చూపించాలి. ఇప్పుడు 26ఏఎస్ ఫామ్ సాయంత్రో మీ ఆదాయపు పన్ను లెక్కేయాలి. మీరు పన్ను చెల్లించాల్సి వస్తుందా? లేక ట్యాక్స్ రీఫండ్ పొందుతారా అన్నది తెలుసుకోవచ్చు.

మీరు పన్ను చెల్లించాల్సి ఉంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్‌ https://www.tin-nsdl.com/ చాలాన్ 280 ద్వారా చెల్లించండి. నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ద్వారా ట్యాక్స్ చెల్లించొచ్చు. మీ 26ఏఎస్ ఫామ్ మీ పన్ను లెక్కింపుతో సరిపోతే, ఎలాంటి డ్యూ లేకపోతే, మీకు ట్యాక్స్ రీఫండ్ వస్తుందేమో చూసుకోండి. ఆ తర్వాత ఐటీఆర్ ఇ-ఫైల్ చేయండి. ఐటీఆర్ 1, 2, 3, 4 ఫామ్స్‌లో మీకు ఏది వర్తిస్తుందో అది పూర్తి చేసి ఇ-వెరిఫై చేసుకోండి.ఇవి కూడా చదవండి:
Published by: Santhosh Kumar S
First published: July 13, 2018, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading