కరోనా ఫస్ట్ వేవ్ రోజుల్లో ఏది ముట్టుకున్నా కరోనా భయం ఉండేది. అందులో కరెన్సీ కూడా ఉంది. కరెన్సీ నోటు, కాయిన్స్ ముట్టుకుంటే అవతలి వ్యక్తి నుంచి కరోనా సోకుతుందేమో అనే భయం ఉండేది. దీనిపై అప్పటి నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జర్మన్ శాస్త్రవేత్తలు. దీని కోసం ప్రత్యేక పద్ధతిని పరిగణనలోకి తీసుకొని ఒక మెథడ్‌ను రూపొందించారు. కరెన్సీ నోట్ల వల్ల కొవిడ్ 19 ఇన్ఫెక్షన్ పూర్తిగా రాదని చెప్పలేమని, అయితే దాని తీవ్రత, అవకాశం తక్కువగా ఉందటుందని తేల్చారు. జర్మనీలోని ఆర్‌యూహెచ్‌ఆర్ బోచుమ్ విశ్వవిద్యాలయం, యురోపియన్ సెంట్రల్ బ్యాంకు నిపుణులు కలసి ఈ పరిశోధన చేపట్టారు. ఆ నివేదికను ఇటీవల జర్నల్ ఐ సైన్స్‌లో ప్రచురించారు.
SBI Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరండి... ప్రతీ నెలా డబ్బులు పొందండి
PF Withdrawal Rule: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక్క రోజులో రూ.1,00,000 అడ్వాన్స్
ఈ పరిశోధన కోసం కొన్ని రోజులపాటు యూరో కాయిన్స్, బ్యాంక్ నోట్లు మీద రకరకాల ద్రావణాలతో పరీక్షలు నిర్వహించారు. అందులో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారకాలు పెద్దగా కనిపించలేదట. ఈ పరీక్ష సమయంలో పరిశోధకులు ఆ నోట్లు/కాయిన్స్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపరితలం మీద పెట్టారట. ఈ క్రమంలో సర్ఫేస్ మీద పది రోజులు ఉన్న కరోనా వైరస్ కారకాలు, నోట్ల మీద మూడు రోజుల్లోనే పోయాయని తేల్చారు. అదే కాయిన్ల మీద అయితే గరిష్ఠంగా ఆరు రోజులు ఉన్నాయట.
Bank Holidays in August 2021: ఖాతాదారులకు అలర్ట్... ఆగస్టులో బ్యాంకులకు హాలిడేస్ ఎప్పుడో తెలుసుకోండి
New Rules from August 1: రేపటి నుంచి ఈ కొత్త రూల్స్... మీకు లాభమా? నష్టమా? తెలుసుకోండి
10 సెంట్ల కాయిన్ మీద ఆరు రోజులు, ఒక యూరో కాయిన్ మీద రెండు రోజులు, ఐదు సెంట్ల కాయిన్ మీద గంటసేపు మాత్రమే కరోనా వైరస్ కారకాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఐదు సెంట్ల కాయిన్ కాపర్‌తో చేయడం వల్లే అంత త్వరగా కరోనా వైరస్ కారకం పోయిందని తెలిపారు.
ఇదే లెక్కన మన దేశంలోనూ కరెన్సీ నోట్ల విషయంలో ప్రజలు అంత భయపడక్కర్లేదు అనుకోవచ్చు. గతంలోనే కొందరు నిపుణులు, పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంతవరకు డిజిటల్ కరెన్సీని వినియోగించుకోవడం ఉత్తమం అని వైద్యులు, పరిశోధకులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cash, Corona virus, Covid -19 pandemic, Covid-19, Currency