హోమ్ /వార్తలు /బిజినెస్ /

Life Insurance: సెకండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చా? ఇందుకు ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?

Life Insurance: సెకండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చా? ఇందుకు ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలను (Life Insurance) క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే పాలసీదారులు తమ బీమా అవసరాల ఆధారంగా రెండో పాలసీని ఎంచుకోవాలి. జీవిత బీమా పాలసీల (Policy) విషయంలో కుటుంబం ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి ...

ప్రస్తుత పరిస్థితుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) పాలసీలపై(Policy) ప్రజలకు అవగాహన పెరిగింది. రెండు, మూడేళ్లలో లైఫ్ పాలసీల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అయితే 30 ఏళ్ల వ్యక్తికి పరిమిత బీమాతో కూడిన లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్(Coverage) సరిపోతుంది. కానీ 50 ఏళ్ల వ్యక్తికి అదనపు అవసరాలు, బాధ్యతలను ఇలాంటి పాలసీలు తీర్చకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి రెండో లైఫ్ ఇన్సూరెన్స్ (Second Life Insurance) పాలసీని కొనుగోలు చేయవచ్చు.

రెండో పాలసీ అవసరమా, లేదా అనేది ఎలా తెలుసుకోవాలి?

ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే పాలసీదారులు తమ బీమా అవసరాల ఆధారంగా రెండో పాలసీని ఎంచుకోవాలి. జీవిత బీమా పాలసీల విషయంలో కుటుంబం ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్‌లో అయితే కవరేజ్ భవిష్యత్తు వైద్య ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. జీవిత బీమా విషయంలో ఈ కవరేజ్ అనేది వ్యక్తి జీవిత విలువను అంచనా వేస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి తమ జీవిత ఆర్థిక విలువను భర్తీ చేయడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాలసీలను ఎంచుకోవాలి. రెండో జీవిత బీమా పాలసీ, మొదటి పాలసీ కవరేజీకి అనుబంధంగా సహాయపడుతుంది. మరోవైపు, ఒక క్లెయిమ్ తిరస్కరణకు గురైన సందర్భంలో పాలసీదారులు రెండో పాలసీపై ఆధారపడవచ్చు.

AP SSC Results 2022: ఏపీ టెన్త్ ఫలితాలు.. ఎవరైనా అలా చేస్తే ఏడేళ్ల జైలు.. జగన్ సర్కార్ సీరియస్ వార్నింగ్

రెండో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలు

ఒక వ్యక్తి వేర్వేరు మెచ్యూరిటీ డేట్స్‌తో రెండు పాలసీలను ఎంచుకోవచ్చు. జీవితంలోని వివిధ దశలలో మారుతున్న ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ హామీ మొత్తాన్ని ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తి వివాహం, పిల్లల చదువు, ఇల్లు కొనుగోలు వంటి వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ఆధారంగా కూడా పాలసీని ఎంచుకోవచ్చు.


రెండో పాలసీ విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి?

సెకండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తి, ఎందుకు మరో పాలసీని ఎంచుకుంటున్నారు, ఇందుకు కారణం ఏంటనే వివరాలను మొదటి పాలసీ అందించిన బీమా సంస్థకు తెలియజేయాలి. పెరిగిన జీవనశైలి అవసరాలు, అదనపు బాధ్యతల కారణంగా ఎదురయ్యే అదనపు అవసరాలను చూసుకోవడానికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఒక ఎడిషనల్ పాలసీ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు రెన్యూబై ఇన్సూర్ టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఇంద్రనీల్ ఛటర్జీ. ఈ విషయంపై ఆయన లైవ్ మింట్ వార్తాసంస్థతో మాట్లాడారు. అయితే ఒకే సమయంలో రెండు కంటే ఎక్కువ బీమా సంస్థలకు పాలసీ కోసం దరఖాస్తు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా సరైన పాలసీలను ఎంచుకున్నారా, లేదా అనేది తెలుసుకునేందుకు.. ఎడిషనల్ లైఫ్ పాలసీ కోసం బీమా సలహాదారులను సంప్రదించాలని ఛటర్జీ సూచించారు.

First published:

Tags: Health Insurance, Insurance, Life Insurance, RECOVERED

ఉత్తమ కథలు