HOME » NEWS » business » CAIT DEMANDS 7 DAY BAN ON AMAZON INDIA FOR VIOLATING COUNTRY OF ORIGIN RULE SK

Amazon: 'అమెజాన్‌పై 7 రోజులు నిషేధం'.. కఠిన చర్యలకు CAIT డిమాండ్

Amazon: నిబంధనలను ఉల్లంఘించిన అమెజాన్‌ సంస్థపై... మరోసారి తప్పుచేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కనీసం ఏడు రోజుల పాటు అమెజాన్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. లేదంటే మన దేశ చట్టాలు ఎగతాళికి గురయ్యే అవకాశముందని అభిప్రాయపడింది.

news18-telugu
Updated: November 27, 2020, 5:19 PM IST
Amazon: 'అమెజాన్‌పై 7 రోజులు నిషేధం'.. కఠిన చర్యలకు CAIT డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్ కాలం నడుస్తోంది. షాపులకు వెళ్లి.. చూసి.. వస్తువులను కొనుగోలు చేయడం.. మనలో చాలా మంది మానేశారు. స్మార్ట్‌ఫోన్‌‌తోనే అరచేతిలోనే అన్ని వస్తువులను చూస్తున్నారు. నచ్చిన వాటిని సింగిల్ క్లిక్‌తో కొనుగోలు చేస్తున్నారు. బయటకు వెళ్లే శ్రమ లేకుండా నేరుగా ఇంటికే మనకు కావలసినవన్నీ వచ్చేస్తున్నాయి. అందుకే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో అమ్మకాలు విపరీతంగా పుంజుకున్నాయి. ఐతే ఈ- కామర్స్‌లో అమ్ముతున్న వస్తువులను సంబంధించి కేంద్రం ఓ నిబంధన విధించింది. ఆ వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో స్పష్టం చేయాలని స్పష్టం చేసింది. కానీ అమెజాన్ ప్రభుత్వం ఆ రూల్‌ని ఉల్లంఘించింది. వస్తువులను ఎక్కడ తయారు చేశారన్న వివరాలను పేర్కొనలేదు.

ఈ క్రమంలోనే ఇటీవల అమెజాన్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం రూ.25వేల జరిమానాను విధించింది. ఐతే ఈ జరిమానాను CAIT (The Confederation of All India Traders) తీవ్రంగా తప్పుబట్టింది. భారత ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే.. అంత తక్కువ జరిమానా విధించి.. సరిపెట్టుకుంటారా..? అని కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ఈకామర్స్‌ దిగ్గజ సంస్థకు రూ.25వేలు పెద్ద లెక్కా..? అని మండిపడుతోంది. నిబంధనలను ఉల్లంఘించిన అమెజాన్‌ సంస్థపై... మరోసారి తప్పుచేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కనీసం ఏడు రోజుల పాటు అమెజాన్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. లేదంటే మన దేశ చట్టాలు ఎగతాళికి గురయ్యే అవకాశముందని అభిప్రాయపడింది.

ఈ మేరకు CAIT జాతీయ అధ్యక్షుడు బీ.సీ. భార్టియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేవాలా ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. '' అమెజాన్ వలన మన దేశ ఆర్థికవ్యవస్థ కలిగిన నష్టానికి సమానంగా జరిమానా విధించాలి. వస్తువుల తయారీ వివరాలను పేర్కొనకుండా.. మొదటిసారి తప్పుచేసే ఈ కామర్స్ సంస్థలపై ఏడు రోజులు నిషేధం విధించాలి. మరోసారి తప్పు చేస్తే 15 రోజులు బ్యాన్ చేయాలి. అప్పుడే విదేశీ కంపెనీలు భారత చట్టాలను గౌరవిస్తాయి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటాయి. మింత్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇతర సంస్థల పట్ల కూడా ఇలాగే కఠినంగా వ్యవహరించాలి. ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా ప్రధాని మోదీ వోకల్ ఫర్ లోకల్ నినాదం చేశారు. స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరగాలంటే ఈ-కామర్స్ సంస్థలు ఈ నిబంధలను ఖచ్చితంగా పాటించాలి. '' అని పేర్కొన్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 27, 2020, 5:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading