హోమ్ /వార్తలు /బిజినెస్ /

Amazon Ganja Case: అమెజాన్‌లో గంజాయి అమ్మకాలను బయటపెట్టిన పోలీసు అధికారి బదిలీ... ఖండించిన CAIT

Amazon Ganja Case: అమెజాన్‌లో గంజాయి అమ్మకాలను బయటపెట్టిన పోలీసు అధికారి బదిలీ... ఖండించిన CAIT

Amazon

Amazon

Amazon Ganja Case | అమెజాన్‌లో గంజాయి అమ్మకాల కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసును బయటపెట్టిన పోలీసు అధికారిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నిర్ణయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఖండిస్తోంది.

అమెజాన్ ఇ-కామర్స్ పోర్టల్‌లో గంజాయి అమ్మకాల వ్యవహారం (Amazon Ganja Case) ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసును బయటపెట్టి, దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న భిండ్ ఎస్‌పీ మనోజ్ కుమార్ సింగ్‌ను (Bhind SP Shri Manoj Kumar SIngh) మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh Government) అనూహ్యంగా బదిలీ చేసింది. ఈ బదిలీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం అమెజాన్‌లో గంజాయి అమ్మకాల వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని భిండ్ పోలీసులు ఈ రాకెట్‌ను బయటపెట్టారు. ఈ కేసుకు ఆంధ్రప్రదేశ్‌తోనూ సంబంధం ఉంది. విశాఖపట్నం నుంచి స్టీవియా ఆకులు, కరివేపాకు పొడి రూపంలో గంజాయిని సరఫరా చేస్తున్నారన్న విషయాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు గుట్టురట్టు చేశారు.

Earn Rs 10 Crore: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి రూ.10 కోట్లు కావాలంటే ఇలా పొదుపు చేయండి

ఈ కేసును బయటపెట్టడంలో భిండ్ ఎస్‌పీ మనోజ్ కుమార్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన్ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఆయన స్థానంలో శైలేంద్ర చౌహాన్‌ను నియమించారు. భోపాల్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి శైలేంద్ర చౌహాన్‌ను తీసుకొచ్చి భిండ్ ఎస్‌పీగా నియమించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఎస్‌పీ మనోజ్ కుమార్ సింగ్‌ను భోపాల్‌ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.

Credit Cards: క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా? యాన్యువల్ ఫీజు లేని బెస్ట్ కార్డులు ఇవే

ఇలాంటి సున్నితమైన కేసును బయటపెట్టిన మనోజ్ కుమార్ సింగ్‌ను బదిలీ చేయడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఖండించింది. భిండ్ ఎస్‌పీగా మనోజ్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టి ఏడాది మాత్రమే గడిచింది. కాబట్టి ఇది రొటీన్ ట్రాన్స్‌ఫర్ కాదని CAIT వాదిస్తోంది. అమెజాన్ ఒత్తిడి మేరకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎస్‌పీని బదిలీ చేసిందని CAIT ఆరోపిస్తోంది. పలు వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ డ్రగ్స్ కేసును గుట్టురట్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన మనోజ్ కుమార్ సింగ్... ఈ కేసును నిజాయితీగా నిర్వహిస్తున్నారని, ఇప్పుడు విచారణ మధ్యలో ఉండగా ఆయన్ను బదిలీ చేశారని CAIT చెబుతోంది.

Post Office Scheme: రోజూ రూ.50 దాచుకుంటే... రూ.35 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు

విచారణ కీలక సమయంలో ఉన్నప్పుడు సమర్థవంతమైన పోలీసు అధికారిని బదిలీ చేయడం ఆశ్చర్యంగా ఉందని, ఆ అధికారితో పాటు అతని బృందం అమెజాన్‌పై కఠిన చర్యలు తీసుకోబోతున్నారని అందరూ అనుకుంటున్న సమయంలో ఈ బదిలీ జరిగిందని, విదేశీ నిధులతో నడిచే కంపెనీల ఒత్తిడికి మన వ్యవస్థలు తలొగ్గుతున్నాయని CAIT జాతీయాధ్యక్షుడు భర్తియా, సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఆరోపించారు. మన వ్యవస్థ విదేశీ నిధులతో నడిచే కంపెనీల చేతుల్లో బందీ అయినట్టు కనిపిస్తోందని, మధ్యప్రదేశ్‌లోని వర్తకులు, దేశంలోని వ్యాపారులు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోరని, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవాంఛనీయ చర్యకు వ్యతిరేకంగా త్వరలోనే CAIT ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు.

First published:

Tags: Amazon, AMAZON INDIA, Ganja case, Visakhapatnam

ఉత్తమ కథలు