Cafe Coffee Day: వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు రూ.1000 కోట్ల వ్యక్తిగత రుణమే కారణమా...?

సిద్ధార్థ సుమారు రూ. 1000 కోట్ల విలువైన వ్యక్తిగత రుణం ఉన్నట్లు ప్రముఖ ఆంగ్ల దిగనపత్రిక ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఈ రుణాన్ని ఆయన మూడు సంస్థలు (దేవదర్షిని ఇన్ఫో టెక్నాలజీస్, గొనిబెడు కాఫీ అండ్ కాఫీ డే కన్సాలిడేషన్) ద్వారా స్వీకరించినట్లు కార్పోరేట్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న డాక్యుమెంట్లలో పేర్కొన్నట్లు ఆ వార్తలో తెలిపింది.

news18-telugu
Updated: August 2, 2019, 2:54 PM IST
Cafe Coffee Day: వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు రూ.1000 కోట్ల వ్యక్తిగత రుణమే కారణమా...?
వీజీ సిద్దార్థ ఫైల్ ఫోటో
news18-telugu
Updated: August 2, 2019, 2:54 PM IST
కేఫ్ కాఫిడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతికి కారణమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా ఆయనకు సుమారు రూ. 1000 కోట్ల విలువైన వ్యక్తిగత రుణం ఉన్నట్లు ప్రముఖ ఆంగ్ల దిగనపత్రిక ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఈ రుణాన్ని ఆయన మూడు సంస్థలు (దేవదర్షిని ఇన్ఫో టెక్నాలజీస్, గొనిబెడు కాఫీ అండ్ కాఫీ డే కన్సాలిడేషన్) ద్వారా స్వీకరించినట్లు కార్పోరేట్  ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న డాక్యుమెంట్లలో పేర్కొన్నట్లు ఆ వార్తలో తెలిపింది. కాగా సెప్టెంబర్ 2014లో దేవదర్షిణి ద్వారా రూ.471 కోట్లు ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఓసీడీ) జారీ చేసి స్టాండర్డ్ చార్టెర్డ్ ప్రైవేట్ ఈక్విటీ (మారిషస్), క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ ఏషియా క్రెడిట్ ఆపర్చునిటీస్ (మారిషస్) నుంచి సేకరించారు. అలాగే అదే కంపెనీ పేరుతో మరో రూ.300 కోట్లు, 2018 నవంబరులో ఎస్ఎస్‌జీ ఏషియా నుంచి ఓసీడీలు జారీ చేయడం ద్వారా సేకరించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. కాగా గొనిబేడు కాఫీ ద్వరా రూ.450 కోట్లు సేకరించినట్లు పేర్కొన్నప్పటికీ, ఈ రుణాలను తీర్చేశారా.. లేదా అనే విషయానికి సంబంధించిన డాక్యుమెంట్లు లభించలేదని పేర్కొంది.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...