కేబుల్ టీవీ, డీటీహెచ్ యూజర్లకు శుభవార్త. తక్కువ ధరకే ఎక్కువ ఛానెల్స్ చూసే అవకాశం రాబోతోంది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI న్యూ టారిఫ్ ఆర్డర్ 2.0 అమలు చేయబోతోంది. ఛానెళ్లు ఎంపిక చేసుకోవడానికి వినియోగదారులకు స్వేచ్ఛను కల్పించేలా ట్రాయ్ పలు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ట్రాయ్ మరిన్ని కొత్త నియమ నిబంధనల్ని అమలులోకి తీసుకురానుంది. దీంతో యూజర్లపై భారం మరింత తగ్గనుంది. ఆగస్ట్ 10 లోపే కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ రూల్స్ అమలులోకి వస్తే యూజర్లు రూ.130 చెల్లించి 200 ఛానెల్స్ చూడొచ్చు. ప్రస్తుత్ నెట్వర్క్ కెపాసిటీ ఫీజు రూ.130 ఉంది. రూ.130 చెల్లిస్తే 100 ఛానెల్స్ మాత్రమే చూసే అవకాశం ఉంది. కానీ ట్రాయ్ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే వినియోగదారులు కేవలం రూ.130 ధరకు 200 ఛానెల్స్ చూసే అవకాశం లభిస్తుంది.
TRAI App: కేబుల్, డీటీహెచ్ బిల్లు తగ్గించుకోవాలా? ఈ యాప్ ట్రై చేయండి
July 31 Deadline: ఈ 5 పనులకు జూలై 31 చివరి తేదీ... గుర్తున్నాయా?
అంతేకాదు... ఒక ఛానెల్ ఎంచుకోవాలంటే ప్రస్తుతం గరిష్టంగా రూ.19 చెల్లిస్తున్నారు. ఈ ధరను రూ.12 చేసింది ట్రాయ్. అంటే ఇకపై ఏ ఛానెల్ అయినా గరిష్టంగా రూ.12 కంటే ఎక్కువ ఛార్జ్ చేసే అవకాశం లేదు. ఆగస్ట్ 10 నాటికి కొత్త ధరలు, బొకే వివరాలు పబ్లిష్ చేయాలని బ్రాడ్క్యాస్టర్లను ట్రాయ్ ఆదేశించింది. ఇందులో నెలకు ప్రతీ ఛానెల్‌కు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, బొకే ఛానెళ్లకు ఎంత ఛార్జీలున్నాయి, బొకేలో ఏఏ ఛానెల్స్ ఉంటాయన్న వివరాలన్నీ ఆయా కంపెనీల వెబ్సైట్లలో ఆగస్ట్ 10 లోగా కనిపిస్తాయి. అయితే ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయాలపై బ్రాడ్క్యాస్టర్లలో ఆందోళన కనిపిస్తోంది. 2019 ఫిబ్రవరిలో ట్రాయ్ న్యూ టారిఫ్ ఆర్డర్ 1.0 అమలులోకి వచ్చింది. అప్పట్నుంచి వినియోగదారులు తాము చూసే ప్రతీ ఛానెల్‌కు ఎంత ధర చెల్లిస్తున్నామో చూసే అవకాశం లభించింది. దీని వల్ల ఏ ఛానెల్ చూడాలో, ఏది వద్దో ఎంచుకునే స్వేచ్ఛ లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, DTH, TRAI