Cabinet Meeting: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం వరాలు...రూ. 50 వేల కోట్ల సాయం...

కేబినేట్ సమావేశంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎంఎస్‌ఎంఇల కోసం 20,000 కోట్ల రూపాయల ప్యాకేజీకి అనుమతి లభించింది. అంతేకాదు ఎంఎస్‌ఎంఇల కోసం రూ .50 వేల కోట్ల ఈక్విటీ ఫండ్ ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.

news18-telugu
Updated: June 1, 2020, 5:19 PM IST
Cabinet Meeting: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం వరాలు...రూ. 50 వేల కోట్ల సాయం...
ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశం పూర్తయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కరోనా సతమతమవుతున్న చిన్న మధ్య తరహా పరిశ్రమలపై వరాల జల్లు కురిపించింది. అంతేకాదు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలతో పాటు అన్‌లాక్ 1.0పై కూడా పలు కేబినేట్ నిర్ణయాలు తీసుకుంది. ఇదిలా ఉంటే కేబినేట్  MSME పరిశ్రమలను ఆదుకునేందుకు పలు చర్యలు తీసుకుంది. అలాగే, ఎంఎస్‌ఎంఇ కోసం ఈక్విట్ స్కీమ్‌కు కూడా క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 20 లక్షల కోట్ల పథకం కింద ఆర్థిక ప్యాకేజీలో MSME పరిశ్రమలను ఆదుకునే ముందుగానే విషయాన్ని ప్రకటించారు. కేబినేట్ సమావేశంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎంఎస్‌ఎంఇల కోసం 20,000 కోట్ల రూపాయల ప్యాకేజీకి అనుమతి లభించింది. అంతేకాదు ఎంఎస్‌ఎంఇల కోసం రూ .50 వేల కోట్ల ఈక్విటీ ఫండ్ ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. నిధులు కావాల్సిన కంపెనీలు మార్కెట్లో లిస్టింగ్ చేయడం ద్వారా నిధులను సేకరించవచ్చు.

అంతేకాదు వీధి వ్యాపారులకు క్రెడిట్ పథకం కూడా కేబినేట్ ఆమోదించింది. వీధి వ్యాపారులను ఆదుకునేందుకు సత్వరమే రూ.10 వేలు రుణం ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. దీని ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. దేశవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ఎంఎస్‌ఎంఇలు ఉన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ దెబ్బకు ఈ రంగం బాగా దెబ్బతిన్నది. సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాని మోదీ, ఎంఎస్ఎంఇలకు ఉపశమన చర్యలను ప్రకటించారు.
First published: June 1, 2020, 5:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading