Home /News /business /

CABINET LIKELY TO APPROVE MEGA TEXTILE PARK SCHEME MORE INVESTMENTS MORE JOBS MK GH

Investment Textile Park: మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ వచ్చే మూడేళ్లలో ఎకరాల స్థలాలలో ఏడు పార్కులను నిర్మించనుంది. ఎగుమతుల్లో ఆధిపత్యం చూపించడానికి ప్లగ్ & ప్లే సౌకర్యాలతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను టెక్స్‌టైల్ పార్కుల పథకం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు.

ఇంకా చదవండి ...
దిగుమతులను తగ్గిస్తూ ఎగుమతులను పెంచుతూ భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్స్(Mega Investment Textile Parks) పథకాన్ని ఆమోదించింది. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. ఏడు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ & అపెరల్ (PM MITRA) పార్కుల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని గోయల్ పేర్కొన్నారు. వీటిని 5 ఏళ్లలో మొత్తం రూ.4,445 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకం వస్త్ర రంగంలోకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్(FDI) ఆకర్షించడానికి, లక్షలాది ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుంది.

టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ వచ్చే మూడేళ్లలో ఎకరాల స్థలాలలో ఏడు పార్కులను నిర్మించనుంది. ఎగుమతుల్లో ఆధిపత్యం చూపించడానికి ప్లగ్ & ప్లే సౌకర్యాలతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను టెక్స్‌టైల్ పార్కుల పథకం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. బడ్జెట్ 2021లో మెగా టెక్స్‌టైల్ పార్కుల పథకాన్ని ఆవిష్కరించారు. ఏకీకృత సౌకర్యాలతో సహా రవాణా నష్టాలను తగ్గించడానికి త్వరితగతిన డెలివరీ పూర్తిచేసే సౌకర్యాలూ ఈ పార్కులు కలిగి ఉంటాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టెక్స్‌టైల్ రంగంలో సమగ్ర, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ తయారీదారిగా, ఎగుమతి కేంద్రంగా భారతదేశాన్ని మార్చడానికి టెక్స్‌టైల్ పథకం దోహద పడుతుందని ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

"మిత్ర(MITRA) భారతీయ వస్త్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్ అవుతుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌తో కలిసి మిత్ర పెట్టుబడులు పెరగడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది” అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఈ మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్కులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆకర్షించడానికి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పార్కుల ఏర్పాటుపై వచ్చే నెలలోపు రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర టెక్స్‌టైల్ పార్క్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపాయని సమాచారం. 2021-22లో వస్త్ర రంగం 44 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధిస్తుందని కేంద్ర వాణిజ్య, వస్త్ర శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ పరిశ్రమ వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మ్యాన్ మేడ్ ఫైబర్ సెగ్మెంట్ (MMF) దుస్తులు, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్ & సాంకేతిక వస్త్రాల పది ఉత్పత్తుల కోసం రూ.10,683 కోట్ల ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌ను కేంద్ర గతంలోనే ఆమోదించింది. ఈ పథకం దేశీయ తయారీ, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోని వస్త్రాలు, దుస్తుల ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలలో భారతీయ వస్త్ర రంగం ఆరవ స్థానంలో ఉండటం విశేషం.
Published by:Krishna Adithya
First published:

Tags: Business

తదుపరి వార్తలు