Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు (ప్రతీకాత్మక చిత్రం)

Mutual Funds | మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకోండి.

 • Share this:
  నష్టభయం తక్కువగా ఉండే మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం మంచిది. మ్యూచువల్ ఫండ్లు కూడా మార్కెట్ ఒడిదొడుకులకు లోబడే ఉంటాయి. అందుకే వీటిని ఎంచుకునేవారు కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కొంతమంది పెట్టుబడిదారుల నుంచి స్టాక్స్, బాండ్లు, షార్ట్టర్మ్ డెట్.. వంటి సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి మ్యూచువల్ ఫండ్లు డబ్బును పూల్ చేస్తాయి. మొదటిసారి వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఇది కాస్త అయోమయంగా అనిపించవచ్చు. అందుకే ఎంచుకున్న పెట్టుబడి మార్గంపై పూర్తి అవగాహన ఉండాలి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందు పరిగణించాల్సిన కొన్ని అంశాలు మీకోసం.

  1. స్కీమ్ పై అవగాహన


  ప్రతి పెట్టుబడి లక్ష్యం రాబడి పొందడమే. కానీ వీటికి నష్టభయం కచ్చితంగా ఉంటుంది. అందుకే పెట్టుబడిదారుడు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించిన అన్ని వివరాలూ తెలుసుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్స్(నష్టభయం) ఎంత వరకు ఉంటుంది, ఫండ్ రేటింగ్ ఎంత వంటి అంశాలపై పట్టు ఉండాలి. మనకు వచ్చే తుది రాబడిపై ఎంత వరకు పన్నులు విధిస్తున్నారో కూడా తెలుసుకోవాలి.

  LPG Subsidy: గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదా? ఎలా చెక్ చేయాలంటే

  SBI UPI Transfer: యూపీఐ ట్రాన్స్‌ఫర్ ఫెయిలై డబ్బులు డెబిట్ అయితే ఇలా చేయండి

  2. పెట్టుబడిదారుల ప్రొఫైల్


  మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు పెట్టుబడిదారుల ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్(నష్టభయం), ఇన్వెస్ట్మెంట్ గడువు(టెన్యూర్), మెచూరిటీ వంటి ప్రాధాన్యతలను అంచనా వేయగలగాలి. పెట్టుబడిదారుల ప్రాధాన్యతలకు సరిపోయే ఫండ్లనే ఎంచుకోవాలి.

  3. ఫండ్ మేనేజర్ గురించి


  ఫండ్ పనితీరులో ఫండ్ మేనేజర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు ఫండ్ మేనేజర్ గత పనితీరు ఎలా ఉందో విశ్లేషించుకోవాలి. వివిధ మార్కెట్ పరిస్థితులలో భిన్న రకాల పథకాలను నిర్వహించడంలో ఫండ్ మేనేజర్‌కు ఎలాంటి ప్రావీణ్యం ఉందో తెలుసుకోవాలి.

  4. సరైన పథకాన్ని ఎంచుకోవాలి


  సాధారణంగా ఇలాంటి పథకాలన్నింటినీ వృద్ధి(గ్రోత్), డివిడెండ్ ఆధారంగానే ఎంచుకుంటారు. మీరు గ్రోత్ ఆప్షన్ను ఎంచుకుంటే మీకు డివిడెండ్ రాదు. కానీ రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. తద్వారా దీర్ఘ కాలంలో క్యాపిటల్ అప్రిషియేషన్ పొందే వీలుంటుంది. ఒకవేళ డివిడెండ్ ఆప్షన్ను ఎంచుకుంటే.. మీరు క్రమం తప్పకుండా డివిడెండ్ పే-అవుట్ పొందుతారు.

  Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్‌తో రూ.30,000 ఇన్స్యూరెన్స్... వారికి మాత్రమే

  SBI Loan: ఈఎంఐ కట్టలేకపోతున్నవారికి ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన అవకాశం

  5. ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్


  పెట్టుబడిదారులు సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారానే మ్యూచువల్ ఫండ్ ఖాతా తీసుకోవాలి. ఈ మధ్య కొత్తగా అందుబాటులోకి వస్తోన్నన్యూ ఏజ్ ప్లాట్‌ఫామ్ అకౌంట్ ఓపెన్ చేయడాన్ని సులభతరం చేస్తున్నాయి. ఇవి కమీషన్ లేకుండా సేవలందిస్తున్నాయి. ఇవి వివిధ అంశాల్లో ఇన్వెస్టర్లకు మార్గదర్శకాలు ఇస్తాయి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉన్నాయి, పోర్ట్ఫోలియో ఎనాలసిస్.. వంటి సేవలు కొత్తగా ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. పెట్టుబడిదారులకు వారి ప్రయాణంలో అడుగడుగునా ఇవి సహాయపడతాయి.

  6. పెట్టుబడి ప్రణాళిక


  ఈక్విటీ ఫండ్లలో మొదటిసారి ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ద్వారా పెట్టుబడి పెట్టడం మంచిది. పెద్ద మొత్తంలో చేసే పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘ కాలంలో పెట్టుబడులను విస్తరించడానికి, వివిధ మార్కెట్ లెవల్స్లో పెట్టుబడులు పెట్టడానికి SIP తోడ్పడుతుంది.
  Published by:Santhosh Kumar S
  First published: