Insurance: ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Insurance | పాలసీ ప్రీమియం ఎంత, కవరేజీ ఎంత అన్న అంశాలు మాత్రమే కాదు... మొత్తం పాలసీ డాక్యుమెంట్ మొత్తం ఓసారి చదివితే పూర్తి అవగాహన లభిస్తుంది.

news18-telugu
Updated: August 16, 2019, 3:54 PM IST
Insurance: ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Insurance: ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టెక్నాలజీ పెరిగిపోవడం, ఇంటర్నెట్ అందరి జీవితాల్లోకి రావడంతో పనులు వేగంగా జరిగిపోతున్నాయి. గతంలో ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఏజెంట్ ద్వారా లేదా ఆఫీసుకి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా సులువైపోయింది. ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత, ఇన్స్యూరెన్స్ పాలసీపై అవగాహన ఉన్నవాళ్లు ఏజెంట్ అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు. ఎక్కువగా టర్మ్ ఇన్స్యూరెన్స్‌ల కోసం ఆన్‌లైన్ పైనే ఆధారపడుతున్నారు. ఏజెంట్ ద్వారా తీసుకుంటే ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. అదే నేరుగా పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. కంపెనీలు కూడా కస్టమర్లకు ఆన్‌లైన్‌లోనే పాలసీలను అందిస్తున్నాయి. ఎల్ఐసీ కూడా డైరెక్ట్ ప్లాన్స్‌ని ప్రవేశపెట్టింది. అయితే ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

మీరు ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకోకముందు అనేక అంశాలు పరిశీలించాలి. ఎక్కడో యాడ్ కనిపించిందనో, ఎవరో చెప్పారనో తీసుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి మీకన్నా ఇతరులకు ఎవరికీ బాగా తెలియదు. అందుకే మీ ఆదాయం ఎంత, అవసరాలెంత, ఆర్థిక లక్ష్యాలేంటీ, ప్రీమియం ఎంత చెల్లించగలరు అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చూసిన పాలసీని పోలిన ఇతర ప్లాన్స్ వేరే కంపెనీలు కూడా అందిస్తుంటాయి. ఒక పాలసీ తీసుకునేముందు అలాంటివి నాలుగైదు పోల్చి చూసుకోవాలి. పాలసీ తీసుకునే ముందు ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో కూడా చూడాలి. పాలసీ ఎంపిక చేయడంలో అనుమానాలు, సందేహాలు ఉంటే... ఎవరైనా తెలిసిన ఇన్స్యూరెన్స్ ఏజెంట్ సలహాలు తీసుకోవడం మంచిది. పాలసీ ప్రీమియం ఎంత, కవరేజీ ఎంత అన్న అంశాలు మాత్రమే కాదు... మొత్తం పాలసీ డాక్యుమెంట్ మొత్తం ఓసారి చదివితే పూర్తి అవగాహన లభిస్తుంది.

ఆన్‌లైన్‌లో పాలసీలు అందించే వెబ్‌సైట్స్ అనేకం ఉన్నాయి. ఇన్స్యూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్ లేదా ఐఆర్‌డీఏ సర్టిఫైడ్ ఆన్‌లైన్ పోర్టల్స్ నుంచి మాత్రమే మీరు పాలసీలు తీసుకోవడం మంచిది. లేకపోతే మోసగాళ్ల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే మీరు ఏదైనా ఆన్‌లైన్ పోర్టల్‌లో పాలసీ తీసుకోవాలనుకుంటే దానికి ఐఆర్‌డీఏ సర్టిఫికేషన్ ఉందా? అన్ని అర్హతలున్నాయా? అని ఆరా తీయాలి. మీరు టర్మ్ పాలసీ తీసుకోవడానికి కారణం ఆకస్మిక మరణం సంభవించినా, కోలుకోలేని స్థితిలో ప్రమాదానికి గురైనా మీ కుటుంబం డబ్బుల కోసం ఇబ్బందిపడొద్దన్న ఆలోచనే. మీ కుటుంబం నెల బడ్జెట్ ఎంత? ఎన్నేళ్లకు సరిపడా లెక్కేసి పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇన్స్యూరెన్స్ పాలసీలకు క్రిటికల్ ఇల్‌నెస్, డిసేబిలిటీ, యాక్సిడెంటల్ డెత్ లంటి రైడర్స్ ఉంటాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా రైడర్స్‌ని ఎంచుకోవచ్చు. రైడర్ ఎంచుకుంటే అదనంగా కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

మీరు టర్మ్ పాలసీ తీసుకొని నెలనెలా ప్రీమియం చెల్లిస్తే సరిపోదు. మీరు పాలసీ తీసుకున్న విషయం మీ కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా చెప్పాలి. పాలసీ డాక్యుమెంట్లు వారికి అందుబాటులో ఉంచాలి. పాలసీలో నామినీ పేరు తప్పనిసరిగా వెల్లడించాలి. కొన్నేళ్ల తర్వాత నామినీ పేరు మార్చాలనుకుంటే ఇన్స్యూరెన్స్ కంపెనీ దగ్గర అప్‌డేట్ చేయాలి.

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:LIC Paid-up: ఎల్ఐసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా? పెయిడ్-అప్‌గా మార్చుకుంటే లాభాలివే

IRCTC: ఎయిర్‌‌పోర్టును తలపించేలా ఐఆర్‌సీటీసీ ఎగ్జిక్యూటీవ్ లాంజ్... బుక్ చేసుకోండి ఇలా

Update Mobile Number: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ మార్చేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading