వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?

ఒక్కోసారి ప్రమాదాలు జరగొచ్చు. మీ వాహనం ఢీకొని ఎవరైనా గాయపడొచ్చు. ఇలాంటి సందర్భంలో బాధితులకు మీ తరఫున బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. అదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్.

news18-telugu
Updated: October 9, 2018, 4:21 PM IST
వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొత్త బండి కొంటే వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ విషయం గురించి చాలామందికి తెలియదు. అందుకే పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఏడాది వరకే ఉంటుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేయించడం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతీ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. రెన్యువల్ కూడా చేయించాలి. కానీ సగం మంది కూడా రెన్యువల్ చేయించరు. ప్రమాదం జరిగినప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకేసారి మూడేళ్లు లేదా ఐదేళ్లకు థర్డ్ పార్టీ బీమా తీసుకోవాలన్న నిబంధనను సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. మూడు రకాల మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ప్రకటించింది ఐఆర్‌డీఏఐ. వాటి వివరాలు తెలుసుకోండి.

1. స్వతంత్ర దీర్ఘకాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ

సాధారణంగా భారతదేశంలో వాహన బీమా ఏడాదికి ఉంటుంది. నాలుగేళ్ల క్రితం ఐఆర్‌డీఏఐ బైకులకు మూడేళ్ల వరకు తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇటీవల కార్లకు మూడేళ్లు, బైకులకు ఐదేళ్లు తప్పనిసరి అని తెలిపింది. స్వతంత్ర దీర్ఘకాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ కార్లకు మూడేళ్లు, బైకులకు ఐదేళ్లు లభిస్తుంది. ఇందులో థర్డ్ పార్టీ మరణం, వైకల్యం, ప్రాపర్టీ డ్యామేజ్ లాంటివి కవర్ అవుతాయి. ఇందులో వాహనదారుడి మరణం, వైకల్యం కూడా కవర్ అవుతుంది. ఇందులో ఇంజిన్ కెపాసిటీని బట్టి ప్రీమియం పెరుగుతుంది. ఈ పాలసీ ఏ వాహనానికైనా తీసుకోవచ్చు.

2. బండిల్డ్ ఇన్సూరెన్స్ కవర్... ఏడాది పాటు సొంత డ్యామేజీకి!
ఇందులో కార్ థర్డ్ పార్టీ మూడేళ్లు కవర్ చేసినా... సొంత డ్యామేజీకి మాత్రం ఏడాదే కవర్ లభిస్తుంది. అలాగే బైకులకు కూడా థర్డ్ పార్టీ కవర్ ఐదేళ్లు... సొంత డ్యామేజీకి ఏడాది మాత్రమే. దీని ద్వారా సొంత డ్యామేజీ విభాగంలో ఏటేటా పాలసీ రెన్యూవల్ చేసుకోవాలి.

3. దీర్ఘకాల సమగ్ర బీమా పాలసీ
ఇది కేవలం కొత్త కార్లు, కొత్త బైకులకు మాత్రమే లభించే పాలసీ. ఇందులో కార్లకు మూడేళ్లు, బైకులకు ఐదేళ్లు థర్డ్ పార్టీ, వెహికిల్ డ్యామేజీ పాలసీ లభిస్తాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ కవర్‌తో పాటు రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదంలో వాహనం పాడైనా, చోరీకి గురైనా పాలసీ కవర్ అవుతుంది.థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?
ఒక్కసారి వాహనం రోడ్డెక్కిందంటే ప్రమాదం జరగదన్న గ్యారెంటీ ఉండదు. మీరు వాహనం జాగ్రత్తగా నడుపుతున్నా సరే... ఇతరుల పొరపాట్ల వల్ల ఒక్కోసారి ప్రమాదాలు జరగొచ్చు. మీ వాహనం ఢీకొని ఎవరైనా గాయపడొచ్చు. ఇలాంటి సందర్భంలో బాధితులకు మీ తరఫున బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. అదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. చాలామంది ఈ బీమా గురించి పెద్ద పట్టించుకోరు. డబ్బులు చెల్లించడం అవసరమా అనుకుంటారు. కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వచ్చేసరికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విలువ తెలుస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో మీ వాహనం కారణంగా గాయపడ్డ వ్యక్తికి మాత్రమే పరిహారం దక్కుతుంది తప్ప... మీ వాహనంలో ప్రయాణించిన వారికి ఎలాంటి పరిహారం లభించదు. డబ్బులు మిగుల్తాయి కదా అని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే చివరకు ఇబ్బందుల్లో పడక తప్పదు.

ఇవి కూడా చదవండి:

లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?

Video: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్  ఆఫర్లివే...

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

ఫేస్‌బుక్ క్లోన్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!

అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999
Published by: Santhosh Kumar S
First published: October 9, 2018, 4:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading