EMI vs Rent... ఈ రెండింటిలో ఏది బెస్ట్ తెలుసుకోండి

EMI vs Rent | సింపుల్ గా చెప్పాలంటే EMI చెల్లింపుల బాధ్యత మీపై అధిక భారాన్ని మోపుతుందని భావించి మీరు అద్దే ఇంట్లో నివసిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయం, ఆస్పత్రులు, షాపింగ్ మాళ్లు, మొదలైనవి దూరం కాకుండా అనువైన ప్రాంతానికి మారేందుకు అద్దె ఇళ్లను ఎంచుకుంటున్నారు.

news18-telugu
Updated: November 17, 2020, 5:04 PM IST
EMI vs Rent... ఈ రెండింటిలో ఏది బెస్ట్ తెలుసుకోండి
EMI vs Rent... ఈ రెండింటిలో ఏది బెస్ట్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సొంతంగా ఇల్లు కొనుగోలు చేయాలనేది ప్రతి ఒక్కరి కల. కరోనా వైరస్ మహమ్మారి.. సొంతింటి కలను సకారం చేసుకోవాలనుకునేవారికి గుదిబండగా మారింది. అయితే నెలవారీగా అద్దెను చెల్లించడం కంటే ఇంటిని కొనుగోలు చేయడమే ఆకర్షణీయమైన ఎంపిక. అయితే ఇల్లు కొనుగోలు చేయడమనేది అద్భుతమైన ప్రతిపాదనే.. కానీ అది కొనుగోలుదారుని ఆర్థిక సంసిద్ధతను బలంగా ఉంచినంత వరకు మాత్రమే. ఈ నేపథ్యంలో EMI-అద్దె ఎంపికల ఏది ఉత్తమమో NoBroker.com సహ వ్యవస్థాపకుడు, ఛీఫ్ బిజినెస్ అధికారి సౌరబ్ గార్గ్ సవివరంగా వివరించారు.

మారిన కొనుగోలుదారుని దృక్పథంఇంటిని కొనుగోలు చేయడమే ప్రతి భారతీయుడి కల. ముఖ్యంగా మిలినియల్స్ ఈ అంశానికి సంబంధించి విపరీతంగా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆరు నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ వాతావరణానికి అలవాటు పడి ఇంటి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. నోబ్రోకర్ డేటా ప్రకారం 65 శాతం మంది అద్దేదారులు వచ్చే మూడు నెలల్లో గృహాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించింది. ఆసక్తి మార్పు వల్ల చాలా అనుకూల కారాణాలు దీనికి ఆపాదిస్తున్నారు.
తక్కువ వడ్డీకే రుణాలు పొందడమనేది ఇందులో మొదటి కారణం. ఆర్బీఐ రెపోరేటు తగ్గించినందున గృహ రుణాలపై వడ్డీ రేట్లు 7 శాతం లోపు పడిపోయాయి. ఈ ఏడాది క్రితం ఇదే సమయంలో 8 నుంచి 9 శాతం మధ్యలో వడ్డీరేట్లు ఉన్నాయి.

ULIP Plan: యూలిప్ ప్లాన్ అంటే ఏంటీ? ఈ ప్లాన్‌తో లాభమెంత?

Prepaid Plans: రూ.300 లోపు రీఛార్జ్ చేయాలా? Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే

రెండోది వ్యాపారాన్ని కొనసాగించేందుకు డెవలపర్లు తక్కువ ఖరీదుకే అమ్ముడుపోని యూనిట్లను విక్రయించడం. ఫలితంగా కొనుగోలు దారు తమ బడ్జెట్ కు అనుగుణంగా ఎన్నో ఆప్షన్లు ఎంచుకునే అవకాశముంది. అంతేకాకుండా విస్త్రత శ్రేణి ఎంపికల కోసం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కోసం నెలల తరబడడానికి వేచి ఉండటానికి బదులు ఇల్లు కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపించవచ్చు. కరోనా మహమ్మారి కూడా ప్రజల మనస్తత్వాన్ని మార్చింది. కొన్నేళ్ల క్రితం సొంతిల్లు ఉండటమనేది విలాసవంతమైనది. ప్రస్తుత కాలంలో ఇది ఒక అవసరంగా మారింది.

గృహాన్ని కొనుగోలు చేసేందుకు ఈ సమయం ఎంతో అనువైందనే చెప్పే మరో అంశం PMAY గడువు పొడిగింపు. లాభదాయకమైన ప్రయోజనాన్ని పొందటానికి ప్రభుత్వం మరో ఏడాది గడవును పొడిగించింది. అంటే 6-18 లక్షల మధ్య వార్షిక ఆదాయాన్ని సంపాదించే కుటుంబాలు 2021 మార్చి 31 వరకు 2.38 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీని పొందవచ్చు. మొదటిసారి ఇది కొనుగోలు దారులకు శుభవార్తగా పరిగణించవచ్చు. అంతేకాకుండా ఆర్థిక ఒత్తిడి విషయంలో వారికి భారీ ఉపశమనం లభిస్తుంది.

SBI ATM cash: మీ ఏటీఎం కార్డుతో ఎంత డ్రా చేయొచ్చో తెలుసా? లిమిట్ ఇదే

SBI Debit Card: మీ ఏటీఎం కార్డు పోయిందా? రెండు నిమిషాల్లో బ్లాక్ చేయండిలా

రెంట్ కంటే EMIలే ఎక్కువ


ఏది ఏమైనప్పటికీ సొంతింటి కల కోసం నెలవారీ చెల్లించే EMIల మొత్తం పరిమాణం.. సౌకర్యాలు, లొకేషన్ మొదలైన వేరియబుల్స్ కారణంగా నెలవారీ అద్దే కంటే ఎక్కువగా భరించాలి. అంతేకాకుండా EMIల రుణంపై అధిక వడ్డీ చెల్లింపులు మీపై భారం మోపుతుంది. అంతేకాకుండా మీరు జీవన నాణ్యతలో కొన్ని సార్లు రాజీ పడాల్సి వస్తుంది. 20 శాతం డౌన్ పేమెంట్, 80 శాతం రుణం ఉన్న పరిస్థితిలో మీరు రుణం కంటే బ్యాంకుకు ఎక్కువ వడ్డీని చెల్లించాలి వస్తుందనే విషయాన్ని గ్రహించాలి.

సింపుల్ గా చెప్పాలంటే EMI చెల్లింపుల బాధ్యత మీపై అధిక భారాన్ని మోపుతుందని భావించి మీరు అద్దే ఇంట్లో నివసిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయం, ఆస్పత్రులు, షాపింగ్ మాళ్లు, మొదలైనవి దూరం కాకుండా అనువైన ప్రాంతానికి మారేందుకు అద్దె ఇళ్లను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా అధిక నాణ్యత కలిగిన అపార్టమెంట్లలో ఎక్కువ అద్దెతో నివసించగలుగుతున్నారు. నిర్దిష్ట సమయం వరకు సహజంగా అద్దెకు ఉండటం నిర్దిష్ట సమయం వరకు మంచి ఎంపిక అవుతుంది.

EMI, అద్దెలు విషయంలో లెక్కలు సరిగ్గా చూసుకుంటే


EMI, అద్దె రెండింటిని వేరు చేసేది అందుబాటులో ధర. ఇంటిని లోన్ తో కొనుగోలు చేసినప్పుడు దీర్ఘకాలానికి EMIల రూపంలో చెల్లించాలనే విషయం మీకు ఇప్పటికే అవగాహన ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం బెంగళూరులో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ రూ.50లక్షలు వరకు ఉంది. మీరు ఇక్కడే ఇంటిని కొనుగులు చేయాలా.. అద్దెకు ఉండాలనేదానిపై నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది.

మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాతా రెంట్ కు ఉండాలంటే నెలకు 12 వేల నుంచి 14 వేల రూపాయల వరకు అద్దెను భరించాలి. మళ్లీ 11 నెలల తర్వాత ఈ అద్దె పెరుగుతుంది. అంతేకాకుండా విభిన్న లోకేషన్ ల్లో ప్రతి ఏటా అద్దె అనేది మారుతుంటుంది. ఏటా దాదాపు 5 నుంచి 10 శాతం రెంట్ పెరుగుతుంది. జీతాలు పెరిగినప్పటికీ అది ద్రవ్యోల్బణం కారకం అని అర్థం చేసుకుంటారు.

ఇదే సమయంలో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే (20 శాతం డౌన్ పేమెంట్, 80 శాతం లోన్) మీరు నెలకు రూ.32,000లు EMI రూపంలో(7.25 శాతం వడ్డీ, 20 ఏళ్ల కాలం) చెల్లించాలి. అదే మీరు 50 శాతం సొమ్మును డౌన్ పేమెంట్ గా ఎంచుకుంటే రూ.20,000లు EMI రూపంలో చెల్లిస్తే సరిపోతుంది.
Published by: Santhosh Kumar S
First published: November 17, 2020, 5:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading