హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Bar: గోల్డ్ బిస్కిట్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

Gold Bar: గోల్డ్ బిస్కిట్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Gold Bar | గోల్డ్ బార్ లేదా బంగారం బిస్కెట్ కొనాలనుకుంటున్నారా? గోల్డ్ బిస్కిట్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.

భారతీయులకు బంగారంపై ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ పండుగొచ్చినా, ఫంక్షనొచ్చినా బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరుగుతుంటాయి. భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ఇప్పటిది కాదు అనేక యుగాల నాటిది. అందువల్లే భారతదేశం అత్యధికంగా బంగారం వినియోగించే దేశంగా మారింది. అయితే, బంగారం సహజంగా ఆభరణాలు, నాణేలు, బార్ల రూపంలో అందుబాటులో ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ, ఆభరణాల కొనుగోలుపై భారీగా డిజైన్ ఛార్జీలు వసూలు చేస్తుండటం వలన, ఎక్కువ మంది ఎటువంటి ఛార్జీలు లేని గోల్డ్ బార్లను కొనుగోలు చేయటానికి ఇష్టపడుతుంటారు. వీటిని కొనడం కూడా చాలా సులభం. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఇవి అమ్ముడవుతున్నాయి. ఆభరణాలు, నాణేలతో పోలిస్తే గోల్డ్బార్‌ల కొనుగోలుకు తక్కువ ఖర్చు అవుతుండటంతో వీటి వైపు చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, గోల్డ్ బార్ కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్య విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అవేంటో చూద్దాం.

Gold: డబ్బు తక్కువగా ఉందా? అయినా బంగారం కొనొచ్చు ఇలా

Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ, 4జీ డేటా కావాలా? Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే

గోల్డ్ బార్స్ కొనే ముందు పరిగణించాల్సిన అంశాలు..


1. ఫైన్ నెస్

బంగారం స్వచ్ఛతను సహజంగా కరాట్స్‌లో కొలుస్తారు. దీని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ స్వచ్ఛతను ఫైన్నెస్ చూపిస్తుంది. బంగారు లోహం కంటెంట్ను కొలవడానికి ‘ఫైన్నెస్’ అనే పదాన్ని ఉపయోగిస్తారు గోల్డ్ షాపు యజమానులు. ఇది బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది.

2. సర్టిఫికేషన్

గోల్డ్ బార్ కొనుగోలు చేయడానికి ముందు హాల్‌మార్క్ సర్టిఫికేషన్ తప్పనిసరి. కొనుగోలు చేయాల్సిన గోల్డ్ బార్కు BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఉందా? లేదా? అనేది ధృవీకరించుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు బంగారానికి హాల్‌మార్కింగ్ ఇవ్వబడుంతుంది.

3. బంగారం స్వచ్ఛత

గోల్డ్ బార్ కొనుగోలు చేసే ముందు మీ బంగారం స్వచ్ఛమైనదా? కాదా? అనేది నిర్ధారించుకోవాలి. సహజంగా బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు అనే విషయం తెలిసిందే. బంగారం క్యారెట్ఎక్కువగా ఉంటే అది ఎక్కువ స్వచ్ఛత గల బంగారం అని అర్థం. భారతదేశంలో, బంగారం స్వచ్ఛమైన రూపం 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లుగా ఉంటుంది. వీటిలో 24 క్యారెట్ల బంగారాన్ని 100 శాతం స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. కాకపోతే, గోల్డ్ బార్లను పెట్టుబడి ప్రయోజనం కోసం కొనుగోలు చేయడం శ్రేయస్కరం. వినియోగం కోసం అయితే 22 క్యారెట్ల బంగారాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

Indian Railways: డిసెంబర్ 1 నుంచి రైళ్లు నడవవా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Cylinder Booking on Paytm: పేటీఎంలో సింపుల్‌గా సిలిండర్ బుకింగ్... ఎలా చేయాలంటే

4. ప్యాకేజింగ్

ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో గోల్డ్ బార్ను కొనుగోలు చేస్తే, మీరు దాన్ని ప్యాకేజీ రూపంలో పొందుతారు. అందువల్ల, బంగారంతో పాటు ప్యాకేజీని భద్రపరుచుకోండి. ఎందుకంటే మీ బంగారం ప్యాకింగ్‌లో చెక్కుచెదరకుండా ఉంటే దాని స్వచ్ఛత కాపాడబడుతుంది.

5. రిఫైనరీ

మీరు కొనుగోలు చేసిన గోల్డ్ బార్ ప్రముఖ రిఫైనరీ నుండి వచ్చినట్లయితే, అది అత్యధిక స్థాయి స్వచ్ఛతను కలిగి ఉంటుంది. అందుల్ల, మీరు గోల్డ్ బార్ను కొనుగోలు చేసే సమయంలోనే, అది ఎక్కడ శుద్ధి చేయబడిందో ఆరా తీయండి. భారతదేశంలో, ప్రస్తుతం MMTC PAMP, బెంగళూరు రిఫైనరీ అనే రెండు బంగారు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.

First published:

Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates