హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: కొత్త ఇల్లు కొంటున్నారా? హోమ్ లోన్‌తో ట్యాక్స్‌ ఇలా సేవ్‌ చేసుకోండి..

Home Loan: కొత్త ఇల్లు కొంటున్నారా? హోమ్ లోన్‌తో ట్యాక్స్‌ ఇలా సేవ్‌ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదాయ పన్ను చట్టం, 1961లో హోమ్‌ లోన్‌ పొందే వారికి ట్యాక్స్‌ డిడక్షన్స్‌ అందించే నిబంధనలు ఉన్నాయి. గృహ రుణాలు తీసుకున్న వారు ఎలాంటి డిడక్షన్స్ క్లెయిమ్‌ చేయవచ్చు, ట్యాక్స్‌ ఎంత సేవ్‌ చేయవచ్చనే వివరాలను పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Home Loan: ప్రస్తుతం సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్న వారికి హోమ్ లోన్ (Home loan)బెస్ట్‌ ఆప్షన్‌. పొదుపు చేసిన డబ్బునంతా ఇంటి కన్‌స్ట్రక్షన్‌ లేదా కొనుగోలుకు ఉపయోగించి, ఆ తర్వాత అనుకోని అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కోవడం సరైన ఆలోచన కాదు. అందుకే ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి హోమ్‌ లోన్‌ ఉపయోగపడుతుంది. దీని వడ్డీ రేట్లు కూడా ఇతర లోన్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అయితే ట్యాక్స్‌ సేవింగ్‌లోనూ హోమ్ లోన్ సహాయపడుతుంది. ఆదాయ పన్ను చట్టం, 1961లో హోమ్‌ లోన్‌ పొందే వారికి ట్యాక్స్‌ డిడక్షన్స్‌ అందించే నిబంధనలు ఉన్నాయి. గృహ రుణాలు తీసుకున్న వారు ఎలాంటి డిడక్షన్స్ క్లెయిమ్‌ చేయవచ్చు, ట్యాక్స్‌ ఎంత సేవ్‌ చేయవచ్చనే వివరాలను పరిశీలిద్దాం.

* ప్రాపర్టీ మొదటిసారి కొనుగోలు చేసేవారికి ట్యాక్స్‌ డిడక్షన్స్‌ ఇలా

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80EE కింద హోమ్‌ లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీపై రూ.50,000 వరకు ట్యాక్స్‌ డిడక్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ బెనిఫిట్ కోసం పన్ను చెల్లింపుదారు రూ.35 లక్షలలోపు లోన్‌ తీసుకోవాలి. ప్రాపర్టీ విలువ రూ.50 లక్షలకు మించకూడదు. హోమ్‌ లోన్‌ మంజూరు అయ్యే సమయంలో సంబంధిత వ్యక్తికి మరో రెసిడెన్షియల్‌ హౌస్‌ ప్రాపర్టీ ఉండకూడదు. అదే విధంగా సెక్షన్ 80EEA హోమ్‌ లోన్‌పై చెల్లించే వడ్డీపై రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్‌ డిడక్షన్‌ అందిస్తుంది. సెక్షన్ 24 కింద అందుబాటులో ఉన్న డిడక్షన్‌కి ఇది అదనంగా లభిస్తుంది.

* హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్‌పై ట్యాక్స్‌ డిడక్షన్‌

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్‌ రీపేమెంట్‌పై రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇలా క్లెయిమ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఈ బెనిఫిట్‌ను పొందాలంటే, ప్రాపర్టీ కన్‌స్ట్రక్షన్‌ కచ్చితంగా పూర్తవ్వాలి. సెక్షన్ 80C కింద డిడక్షన్‌లను కాలిక్యులేట్‌ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

Demat Nomination: ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్‌ నామినేషన్స్‌కు గడువు పెంపు.. లాస్ట్‌ డేట్‌ ఎప్పుడంటే?

* హోమ్ లోన్ వడ్డీపై ట్యాక్స్‌ డిడక్షన్‌

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, హోమ్‌ లోన్‌ వడ్డీ చెల్లింపులపై కూడా ట్యాక్స్‌ డిడక్షన్స్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. ఈ సెక్షన్‌ ద్వారా పన్ను చెల్లింపుదారులు, తమ ట్యాక్స్‌ లయబిలిటీని రూ.2 లక్షలు తగ్గించుకోవచ్చు. ఐదేళ్లలోపు ప్రాపర్టీ కన్‌స్ట్రక్షన్‌ పూర్తయితేనే ఈ బెనిఫిట్‌కు అర్హులు. కన్‌స్ట్రక్షన్‌కి ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం అయితే, డిడక్షన్‌ రూ.30,000కి తగ్గుతుంది. ప్రాపర్టీ మరమ్మతు, పునర్నిర్మాణం కోసం హోమ్‌ లోన్‌ తీసుకుంటే, రూ.30,000 మాత్రమే క్లెయిమ్‌ చేయగలరు.

కొత్త పన్ను విధానంలో సెక్షన్ 24(బి), సెక్షన్ 80సి, సెక్షన్ 80EEA కింద హోమ్ లోన్ ట్యాక్స్‌ డిడక్షన్స్‌ అందుబాటులో ఉండవు.

First published:

Tags: Home loan, Taxes

ఉత్తమ కథలు