జనవరి 1 లోపే టీవీ, ఫ్రిజ్ కొనండి... 7-10% రేట్లు పెరుగుతున్నాయి

ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. తయారీ ఖర్చులు పెరిగాయి. కస్టమ్ డ్యూటీ కూడా పెరిగింది. రవాణా ఖర్చులే 10-15 శాతం ఉంటున్నాయి.

news18-telugu
Updated: December 7, 2018, 4:05 PM IST
జనవరి 1 లోపే టీవీ, ఫ్రిజ్ కొనండి... 7-10% రేట్లు పెరుగుతున్నాయి
ప్రతీకాత్మక చిత్రం (Reuters)
  • Share this:
ఫెస్టివల్ సీజన్‌లో కొత్త టీవీ, కొత్త ఫ్రిజ్ కొనలేకపోయాం... కొత్త సంవత్సరంలో కొందామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీ పర్సు ఖాళీ కావడం ఖాయం. ఎందుకంటే... టీవీ, ఫ్రిజ్, ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. అందుకే ఇలాంటివి కొనాలనుకుంటే న్యూ ఇయర్ లోపే కొనేయండి. జనవరి నుంచి టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీల ధరలు 7-10 శాతం పెరుగుతాయి. ఈ ఏడాది చివరి వరకు ప్రస్తుత ధరలే ఉంటాయని, జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని ఇప్పటికే కొన్ని కంపెనీలు ధృవీకరిస్తున్నాయి.

ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. తయారీ ఖర్చులు పెరిగాయి. కస్టమ్ డ్యూటీ కూడా పెరిగింది. రవాణా ఖర్చులే 10-15 శాతం ఉంటున్నాయి. దీంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి కంపెనీలది. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్‌లోనే ధరలు పెంచాలనుకున్నాయి కంపెనీలు. కానీ... పండుగ సీజన్‌లో సేల్స్ పడిపోతాయన్న భయంతో ధరలు పెంచేందుకు మొగ్గుచూపలేదు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ముగియడంతో ఇక ధరలు పెంచడం లాంఛనమే.

గత వేసవిలో అమ్మకాలు తక్కువగా ఉండటం, అమ్ముడుపోకుండా స్టాక్ మిగిలిపోవడంతో ఏసీల ధరలు భారీగా పెరిగే అవకాశముంది. టీవీ, ఫ్రిజ్‌, ఫుడ్ ప్రాసెసర్, వాషింగ్ మెషీన్లపై జీఎస్‌టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గినా ఏసీలపై తగ్గించలేదు. ఏసీలపై 28 శాతం జీఎస్‌టీ కొనసాగుతోంది. అయితే ఏసీలను కూడా 18 శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలని కంపెనీలు కోరుతున్నా... అది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో తెలియదు. సో... మీరు జనవరి 1 లోపు హోమ్ అప్లయెన్సెస్ ఏవైనా కొంటే... ఎంతో కొంత పొదుపు చేయొచ్చు. ఆ తర్వాత కొంటే మాత్రం అదనంగా 7-10% చెల్లించాల్సిందే.

ఇవి కూడా చదవండి:వాట్సప్‌లో వెంటనే మార్చాల్సిన సెట్టింగ్స్ ఇవే...

పేటీఎం వాడుతున్నారా? యాప్‌లో ఇక ఆ ఫీచర్ ఉండదు

సూపర్ ఆఫర్: షావోమీ పోకో ఎఫ్1 పై రూ.5,000 డిస్కౌంట్జియో చేతికి సావన్ మ్యూజిక్... 90 రోజుల పాటు ఫ్రీ

 
First published: December 5, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు